english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా?
అనుదిన మన్నా

మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా?

Wednesday, 28th of June 2023
1 0 910
Categories : ఒంటరితనం (Loneliness)
మీరు ఆదికాండము 1వ అధ్యాయము చదివగలిగితే, దేవుడు భూమిని మరియు దానిలోని వివిధ వస్తువులను సృష్టించిన వృత్తాంతాన్ని మీరు చూడగలరు. సృష్టి యొక్క ప్రతి దశలో, దేవుడు ఆగి తన పనిని అంచనా వేసాడు. "మరియు అది మంచిదని దేవుడు చూశాడు" (ఆదికాండము 1:4, 10, 12, 18, 21, 25)

చివరగా, దేవుడు తన స్వరూపంలో మానవుని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆదామును తన స్వరూపంలో మరియు పోలిక చొప్పున సృష్టించాడు. మొదటి మానవుడైన ఆదాము ఏదొను తోటలో ఏ ఇతర జీవిలా లేడు. కానీ ఆదామును తోటలో ఉంచిన తర్వాత, దేవుడు ఇంకా ఏదో వెలితి ఉనట్లు గమనించాడు.

దేవుడు ఆదాము చుట్టూ ఎన్నో అద్భుతమైన జంతువులు మరియు పక్షులు ఉన్నప్పటికీ, అతడు చాలా మంచి వాతావరణంలో ఉన్నప్పటికీ - అతడు ఒంటరిగా ఉన్నాడు. నిజం ఏమిటంటే, మీరు గుంపులో ఉండవచ్చు మరియు ఇప్పటికీ ఒంటరిగా అనుభూతి చెందుతున్నారు. ఇది దేవుని దృష్టిని ఆకర్షించిన ఆదాము యొక్క ఒంటరితనం, మరియు దేవుడు అనుకున్న మొదటి విషయం - మంచిది కాదు.

మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయ మును వాని కొరకు చేయుదుననుకొనెను. (ఆదికాండము 2:18)

ప్రభువైన యేసు సిలువపై వ్రేలాడతుండగా, ఆయన తన తల్లిని మరియు తాను ప్రేమించిన శిష్యుని పక్కన నిలబడుట చూశాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. (యోహాను 19:26,27)

యేసు ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు? మన ప్రభువు రక్తస్రావంతో సిలువపై వేలాడదీసినప్పుడు, విపరీతమైన నొప్పి మరియు బలహీనతతో, ఆయన తన తల్లిని ఒకరిగా మరియు ఒంటరిగా చూశాడని నేను నమ్ముతున్నాను. ఆమె వృద్ధాప్యంలో తనను తాను చూసుకోవడానికి ఆయన ఆమెను ఎలా వదిలిపెట్టగలడు? ప్రవక్త సిమోను ప్రవచించిన ఆమె గాయపడిన హృదయమును ఆయన బహుశా చూశాడు. (లూకా 2:35) యేసు సిలువపై ఉన్నప్పుడు కూడా తన తల్లి అవసరాన్ని తీర్చాడు. ఆమె ఒంటరితనాన్ని దూరం చేశాడు.

మరణిస్తున్న మరియు రక్తస్రావంతో ఉన్న రక్షకుడు ఒకరి అవసరాలను తీర్చగలిగితే, ఈ రోజు ఆయన పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడై మరి ఎంత ఎక్కువగా తీర్చగలడు. (హెబ్రీయులకు 8:1)

మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా? మీరు ఒంటరిగా మరియు తిరస్కరించబడినట్లు భావిస్తున్నారా? సమస్తమును అనుభవించి మరియు మిమ్మల్ని మీ ఒంటరితనం నుండి తొలగించే శక్తిని కలిగి ఉన్న యేసు వైపు చూడవలసిన సమయం ఇది.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, ఈ క్షణంలో నేను ఎలా భావిస్తున్నానో పర్వాలేదు. "నేను నిన్ను ఎన్నటికీ విడువను మరియు ఎడబాయను" అని నీవు సెలవిచ్చావు. నేను ఈ వాక్యం మీదనే ఆధారపడుతున్నాను. యేసు నామంలో. ఆమెన్.

కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఎలా పరిచర్య చేయాలో ప్రత్యేకంగా నాకు చూపించు. ప్రభువా నాకు అధికారం దయచేయి. సరైన సమయంలో నీ గురించి పంచుకోవడానికి అవకాశాలను బహిర్గతం చేయి. యేసు నామములో. ఆమెన్.

ఆర్థిక అభివృద్ధి
నేను విత్తిన ప్రతి విత్తనమును యెహోవా జ్ఞాపకముంచుకొనును గాక. కాబట్టి, నా జీవితంలో అసాధ్యమైన ప్రతి పరిస్థితిని యెహోవా తిప్పిస్తాడు. యేసు నామములో.

KSM చర్చి పెరుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించుదురు గాక. నీ పేరు మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.

దేశం
తండ్రీ, యేసు నామములో, భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలోని ప్రజల హృదయాలు నీ వైపు మళ్లాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడి యేసును తమ ప్రభువు మరియు రక్షకునిగా ఒప్పుకుందురు.

Join our WhatsApp Channel


Most Read
● ఉద్దేశపూర్వక వెదకుట
● యూదా జీవితం నుండి పాఠాలు - 2
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● 18 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీ భవిష్యత్తు కొరకు దేవుని కృప మరియు ఉద్దేశ్యాన్ని హత్తుకోవడం
● 24వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● కలవరాన్ని అధిగమించడానికి క్రియాత్మకమైన మార్గాలు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్