english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రవచనాత్మక వాక్యాన్ని పొందుకున్న తర్వాత ఏమి చేయాలి?
అనుదిన మన్నా

ప్రవచనాత్మక వాక్యాన్ని పొందుకున్న తర్వాత ఏమి చేయాలి?

Monday, 10th of July 2023
0 0 920
Categories : ప్రవచనాత్మకమైన వాక్యం (Prophetic Word )
ప్రవచనాత్మక వాక్యం మీ వినోదం కోసం మాత్రమే కాదు. ఇది పక్కన పెట్టడానికి మరియు మర్చిపోవడానికి కాదు. మీ మార్గంలో ఏ పర్వతాలు నిలిచినప్పటికీ, మీరు సరైన దారిలో ఉండటానికి తండ్రి హృదయం నుండి వచ్చిన సందేశం.

వ్యక్తిగత ప్రవచనాన్ని పొందుకోవడం శక్తివంతమైన మరియు అద్భుతమైన క్షణం. మీరు వ్యక్తిగత ప్రవచనాన్ని పొందుకునప్పుడు, దేవునికి మీ గురించి వ్యక్తిగతంగా తెలుసని మరియు మీ జీవితానికి ఒక ప్రణాళిక ఉందని ఇది మీకు గుర్తుకు వస్తుంది.

నేను వ్యక్తిగత ప్రవచనాన్ని పొందుకున్న తర్వాత ఏమి చేయాలి?
నేను దీనిలోకి వెళ్లే ముందు, వ్యక్తిగత ప్రవచనం అనేది దేవుడు ఇప్పటికే మీకు చూపుతున్నదానికి నిర్ధారణ అని మరియు ప్రాథమిక మార్గదర్శకత్వం కాదని స్పష్టంగా తేలియాజేస్తున్నాను.

1. మీ వ్యక్తిగత ప్రవచనాన్ని వ్రాసుకొండి లేదా రికార్డ్ చేయండి

"యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, 

అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును" (హబక్కూకు 2:2-3)

హబక్కూకు తనకు లభించిన ప్రవచనాత్మక వాక్యాన్ని వ్రాయమని ప్రభువు ఆదేశించాడు. అదేవిధంగా, మనము ఒక ప్రవచనాత్మక వాక్యాన్ని పొందుకునప్పుడు, ఆ వాక్యాన్ని వ్రాయడానికి మనం ప్రతి ప్రయత్నం చేయాలి. ఇది ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోవడానికి మరియు అది ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి మనకు వీలు కల్పిస్తుంది.

2. మీ వ్యక్తిగత ప్రవచనాన్ని గురించి ప్రార్థించండి

ప్రవచనాత్మక వాక్యాన్ని పొందుకున్న తర్వాత చేయగలిగే తదుపరి విషయం ప్రార్థన. ప్రార్థనలో ప్రభువు యొద్దకు ప్రవచనాత్మక వాక్యాన్ని తీసుకెళ్లండి. ఈ వాక్యం ప్రభువు యొద్ద నుండో కాదో అని నిర్ధారిస్తుంది. అలాగే, ప్రభువు మీకు అంతర్దృష్టులను మరియు మీరు పొందుకున్న వాక్యం గురించి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యాచరణ ప్రణాళికను ఇస్తాడు.

3. మీ ప్రవచనంతో ఆధ్యాత్మిక యుద్ధం చేయండి

నా కుమారుడువైన(పిల్లవైన) తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.(1 తిమోతి 1:18)

అపొస్తలుడైన పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి తాను పొందుకున్న ప్రవచనాలను గుర్తు చేశాడు మరియు ఆధ్యాత్మిక యుద్ధాన్ని చేయమని ప్రోత్సహించాడు, అతడు పొందుకున్న ప్రవచనాత్మక వాక్యం పట్ల పట్టు కలిగి ఉన్నాడు.

ఒక వ్యక్తి ప్రవచనాత్మక వాక్యాన్ని పొందుకునప్పుడల్లా ఇది ముఖ్యమైన కారణాల్లో ఒకటి; శత్రువు అతను లేదా ఆమె పొందుకున్న వాక్యం యొక్క సంభావ్యతను తెలుసుకున్న వ్యక్తికి వ్యతిరేకంగా వస్తాడు. అలాంటి సమయాల్లో, ఆ వ్యక్తి వాక్యముకు కట్టుబడి ఉండి చీకటి శక్తులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలి మరియు వెనుకడుగు చేయకూడదు.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి.

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, నేను పొందుకున్న ప్రవచనాత్మక వాక్యాలను నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించు. నేటి బోధనను ఆచరణలో పెట్టడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్.

కుటుంబ రక్షణ
తండ్రీ, “తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా (యేసయ్య) యొద్దకు రాలేడు” అని మీ వాక్యం చెబుతోంది (యోహాను 6:44). నా సభ్యులందరినీ నీ కుమారుడైన యేసు వైపుకు ఆకర్షించమని నేను మనవిచేయుచున్నాను, వారు నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు మరియు నీతో శాశ్వతత్వం ఉంటారు.

ఆర్థిక అభివృద్ధి
ఓ దేవా యేసు నామములో లాభదాయకమైన మరియు ఫలించని శ్రమ నుండి నన్ను విడిపించు. దయచేసి నా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించు.

ఇప్పటి నుండి నా గమనము మరియు పరిచర్య ప్రారంభం నుండి నా పెట్టుబడులు మరియు శ్రమలన్నీ యేసు నామములో పూర్తి లాభాలను పొందడం ప్రారంభిచును గాక.

KSM సంఘం:
తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన బృంద సభ్యులు అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. నీ శాంతి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను చుట్టుముట్టను గాక.

దేశం:
తండ్రీ, యేసు నామములో, ఈ దేశాన్ని నిర్వహించడానికి జ్ఞానం మరియు అవగాహన ఉన్న నాయకులను, పురుషులను మరియు స్త్రీలను లేవనెత్తు.

Join our WhatsApp Channel


Most Read
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 1
● ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏమిటి?
● నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - II
● వెతికే మరియు కనుగొనే యొక్క కథ
● కార్యాలయంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి - I
● పరధ్యానం యొక్క గాలుల మధ్య స్థిరంగా (ఉండుట)
● విశ్వాసంలో దృఢంగా నిలబడడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్