మధ్యస్తము యొక్క ముఖ్యమైన వాస్తవాలు
అపొస్తలుల కార్యములు 12లో, హేరోదు సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు. అతడు యోహాను సోదరుడు యాకోబును హత్య చేశాడు మరియు పేతురును చెరసాలలో వేయించెను. ఇది చూసిన తరువాత, సంఘం తీవ్రమైన మధ్యస్తంలోకి ప్రవేశించింది, పేతురును విడిపించమని ప్రభువును వేడుకొంది. సంఘం యొక్క తీవ్రమైన మధ్యస్తం ప్రార్థనలకు ప్రతిస్పందనగా, దేవుడు అద్భుతంగా చెరసాల తలుపులు తెరిచి పేతురును విడిపించాడు.
మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.
పేతురుకు తెలివివచ్చి "ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటి నుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని" అనుకొనెను. (అపొస్తలుల కార్యములు 12:10-11)
ప్రార్థించే ఎవరైనా మాత్రమే అసాధారణమైన అనుగ్రహాన్ని విడుదలను పొందుకుంటారు, కానీ వారు మీ కోసం స్పష్టంగా ప్రకటించబడే దర్శనాన్ని చూడడానికి భారం కలిగిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మీ కోసం ప్రార్థించడం వలన మీ జీవితంలో అసాధారణమైన అనుగ్రహం లభిస్తుంది. పేతురు విషయంలో, అతని కోసం ప్రార్థించే వ్యక్తులు కేవలం కొన్ని మతపరమైన విధుల్లో పాల్గొనలేదు. వారు పేతురును ప్రేమించారు మరియు అతనిని స్వతంత్రంగా చూడాలని కోరుకున్నారు.
2. ప్రతి ఒక్కరికీ మధ్యస్తులు అవసరం
నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు
నరపుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరినేను
దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను (యోబు 16:21)
పై వచనం ప్రకటన యొక్క సత్యాన్ని నొక్కి చెబుతుంది: ఈ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తికి మధ్యస్తులు అవసరం.
అపొస్తలుడైన పౌలు స్వయంగా ఒక శక్తివంతమైన ప్రార్థన యోధుడు అయినప్పటికీ మరియు దేవునిచే గొప్పగా వాడబడుతున్నప్పటికీ, అతడు తన కోసం ప్రార్థించమని సంఘాన్ని తరచుగా అడిగేవాడు.
సహోదరులారా, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను (రోమీయులకు 15:30)
నా కోసం, నా కుటుంబం మరియు బృందం కోసం ప్రతిరోజూ ప్రార్థించమని నేను మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుతున్నాను, తద్వారా దేవుడు నన్ను చేయమని పిలిచిన దానిలో నేను నమ్మకంగా మరియు ప్రభావవంతంగా ఉంటాను.
3. దేవుడు మధ్యస్తులను కోరుకుంటున్నాడు (వెతుకుతున్నాడు)
నిజమైన మధ్యస్తుల కొరత ఉంది. వారు అరుదైన రకము వారు. దేవుడు స్వయంగా మధ్యస్తులను వెతకడంలో ఆశ్చర్యం లేదు.
ప్రభువు ఇలా అన్నాడు, "కాబట్టి నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు" (యెహెజ్కేలు 22:30)
దేవునికి తన హృదయంలో ప్రజల కోసం మధ్యస్తం చేసే వారి కోసం, వేరొకరి కోసం సందులలో నిలబడే వారి కోసం ప్రత్యేక స్థానం ఉంది. మీరు మధ్యస్తిగా ఉండాలనే పిలుపును పొందుకుంటారా మరియు శత్రువు - దుష్టుని యొక్క ప్రణాళికలను అడ్డుకుని ఆపుతారా? దేవుడు నిన్ను ఖచ్చితంగా సన్మానిస్తాడు.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
పరిశుద్దాత్మ దేవా, మధ్యస్తం చేయాలనే పిలుపును స్పష్టంగా వినడానికి నా చెవులను తెరిచి ఉంచు. నేను నా హృదయాన్ని తెరిచి, మధ్యస్తిగా ఉండాలనే పిలుపును స్వీకరించాను. మధ్యస్తం చేయడానికి నీ ఆత్మ ద్వారా నన్ను శక్తివంతం చేయి. యేసు నామంలో.
(ఇప్పుడు మధ్యస్తము చేయడానికి కొంత సమయం గడపండి)
1. మీ కుటుంబం మరియు బంధువుల రక్షణ కొరకు
2. KSM సభలకు హాజరయ్యే ప్రజల రక్షణ కొరకు
కుటుంబ రక్షణ
నా జీవితంలో మరియు కుటుంబ సభ్యులలో శాంతికి ఆటంకం కలిగించే ప్రతి శక్తి యేసు నామములో నరికివేయబడును గాక. నీ శాంతి నా జీవితంలో మరియు కుటుంబ సభ్యులలో ఉండును గాక.
ఆర్థిక అభివృద్ధి
నేను మరియు నా కుటుంబ సభ్యులు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉండుము. మేము చేయునదంతయు దేవుని మహిమ కోసం సఫలమగును. (కీర్తనలు 1:3) మేము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. (గలతీయులకు 6:9)
KSM సంఘము
పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యుల శాంతికి ఆటంకం కలిగించే ప్రతి శక్తి యేసు నామములో నరికివేయబడును గాక. నీ శాంతి వారి జీవితములో ఉండును గాక.
దేశం
ప్రభువైన యేసు, నీవు శాంతికి అధిపతివి. మా దేశ సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తున్నాం. నీ శాంతి మా దేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము.
Most Read
● మర్చిపోయిన ఆజ్ఞా● 19 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆ వాక్యన్ని పొందుకునట
● సమయానుకూల విధేయత
● విశ్వాసం ద్వారా కృప పొందడం
● మోసపూరిత లోకములో విచక్షణ సత్యం
● శాంతి మిమ్మల్ని ఎలా మారుస్తుందో తెలుసుకోండి