యెషయా 11:2లో జాబితా చేయబడిన దేవుని ఏడు ఆత్మలలో బలము గల ఆత్మ ఐదవది. ఈ ప్రకరణంలోని "బలము" అనే పదానికి అక్షరార్థంగా శక్తివంతమైన, బలమైన మరియు పరాక్రమం అని అర్థం. నిరూపితమైన యోధుడిని వివరించడానికి ఇది ఉపయోగించబడుతుంది.
"బలము" అనే పదం దావీదు యొక్క అద్భుతమైన యుద్ధ విన్యాసాలు చేసిన అనుచరుల బలాఢ్యులను వర్ణించడానికి కూడా ఉపయోగించబడింది.
దావీదు అనుచరులలో బలాఢ్యులు..... (2 సమూయేలు 23:8)
మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, దావీదు యొక్క బలాఢ్యులు ఇప్పటికీ అనుచరులు, మరియు వారు తమ బలమును మూలం నుండి పొందవలసి ఉంటుంది. ఆ మూలం పరిశుద్ధాత్మ. బలము గల ఆత్మ మీలో పని చేస్తున్నప్పుడు, ఆయన మిమ్మల్ని ధైర్యంగా ఉండేలా చేస్తాడు.
ప్రవక్త యెషయా, యెషయా 9:6లో యేసు ప్రభువును గురించి ప్రవచించాడు మరియు ఆయనను "బలవంతుడైన దేవుడు" అని అన్నాడ. దేవుని ఈ పేరు విజయం పొందే బలము యొక్క లక్షణాన్ని సూచిస్తుంది. ఇది బలవంతులపై విజయము విధంగా బలం యొక్క ప్రదర్శన గురించి మాట్లాడుతుంది.
బలము గల ఆత్మను కలిగి ఉండటం వలన ప్రతి అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధించగలుగుతాము. "దేవుడు సమర్ధుడు" అని ఒప్పుకునే స్థాయికి మించి, ఏదైనా చేయగల సామర్థ్యం మనకు ఉందని తెలుసుకునే స్థాయికి తీసుకెళ్తుంది.
"నా దేవుడు సమర్ధుడు, నేనూ కూడా సమర్థుడను" (ఫిలిప్పీయులు 4:13) అని చెప్పగల సామర్థ్యాన్ని బలము గల ఆత్మ మనకు ఇస్తుంది. ఏమి చేయాలో తెలుసుకోవడం అనేది జ్ఞానం గల ఆత్మ యొక్క కార్యము; వాస్తవానికి దీన్ని చేయగల సామర్థ్యం కలిగి ఉండటం బలము గల ఆత్మ యొక్క కార్యము.
సహోదరులారా తుదకు ప్రభువు యొక్క మహాశక్తినిబట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. (ఎఫెసీయులకు 6:10) మీరు అది ఎలా చేయగలరు? బలము గల ఆత్మ యొక్క సన్నిధి గురించి జ్ఞానం కలిగి ఉండండి మరియు మీలో మరియు మీ ద్వారా ఆయనని వ్యక్తీకపరచడానికి అనుమతించండి.
ఈ ఒత్తిడి మరియు ఆపద సమయాల్లో, దేవుని బిడ్డగా ప్రతిఒక్కరు బలము గల ఆత్మతో నింపబడాలి, తద్వారా మనం ప్రభువు కోసం గొప్ప కార్యములను సాధించగలము. అది పరిచర్యలో, వ్యాపారంలో, కార్యాలయంలో లేదా క్రీడలలో గొప్ప కార్యములు చేసినా, మీరు బలము గల ఆత్మతో నింపబడాలి.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
పరిశుద్దాత్మ దేవా, నీవే నాలో నివసించే గొప్ప వ్యక్తివి. నీవు బలము గల ఆత్మవి. నీవు నా పక్షమున ఉండగా, కాబట్టి నాకు విరోధి ఎవరు ఉండగలరు.
కుటుంబ రక్షణ
తండ్రీ దేవా, "దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు" (2 కొరింథీయులు 7:10) అని మీ వాక్యం చెబుతోంది. అందరూ పాపం చేసి నీ మహిమకు దూరమయ్యారనే వాస్తవాన్ని నీవు మాత్రమే మా కళ్ళను తెరవగలవు. నా కుటుంబ సభ్యులు పశ్చాత్తాపపడి, నీకు లోబడి, రక్షింపబడేలా దైవ దుఃఖంతో నీ ఆత్మను వారిపైకి వచ్చేలా చేయు. యేసు నామములో.
ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో లాభరహిత శ్రమ మరియు గందరగోళ కార్యాల నుండి నన్ను విడిపించు.
KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రత్యక్ష ప్రసారం దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు చేరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. నిన్ను ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకునేలా వారిని ఆకర్షించు. చేరుకునే ప్రతి ఒక్కరూ వాక్యము, ఆరాధన మరియు ప్రార్థనలో ఎదుగును గాక.
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశం యొక్క పొడవు మరియు వెడల్పు అంతటా నీ ఆత్మ యొక్క శక్తివంతమైన కదలిక కోసం నేను ప్రార్థిస్తున్నాను, ఫలితంగా సంఘాలు నిరంతరము ఎదుగుతూ మరియు విస్తరించు గాక.