english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ధైర్యంగా కలలు కనండి
అనుదిన మన్నా

ధైర్యంగా కలలు కనండి

Tuesday, 26th of March 2024
0 0 1084
Categories : కలలు (Dreams)
యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, "నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి." (ఆదికాండము 37:5-6)

మనందరి దగ్గర కలలు ఉంటాయి మరియు జీవితంలో పనులు చేయడానికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనలో కొందరు వారు ఏది ఉత్తమమని భావిస్తున్నారో దాని ప్రకారం ఒక ఖచ్చితమైన విధంగా అంచెలంచెలుగా పని చేసారు. మరికొందరు ఆ ప్రవాహానికి అనుగుణంగా దాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.

గొప్ప ఫలితాలు తరచుగా కలలతో ప్రారంభమవుతాయి. యోసేపు ఏదో ఒక రోజు శక్తివంతమైన నాయకుడిగా మారాలని కలలు కన్నాడు. దీన్ని మీ జీవితాంతం గుర్తుంచుకోండి. దైవికమైన కల ఎప్పుడూ వ్యతిరేకతను ఆకర్షిస్తుంది. అందుకే కలలు ప్రమాదకరమని నేను చెప్తూ ఉంటాను. యోసేపు కలలు అతని స్వంత సహోదరుల ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. యోసేపుకు లోబడి యుండడం వారికి నచ్చలేదు. అతని కలల ఫలితంగా సహోదరులు ఇలా అన్నారు:

అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, "ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చు చున్నాడు; వీని చంపి యిక్కడ నున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని" ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. (ఆదికాండము 37:18-20)

కొన్నిసార్లు, ఆ కలలు అనుదిన జీవితంలోని నిరాశలు మరియు దినచర్యల ద్వారా అణగద్రొకవచ్చు, తద్వారా వాటిని నెరవేర్చడానికి మనకు ఇకపై శక్తి ఉండదు.

అలా జరిగినప్పుడు, మన దగ్గర ఒక ఎంపిక ఉంటుంది. అన్యాయంగా ప్రవర్తించినందుకు మనం బాధాకరంగా మరియు కోపంగా మారవచ్చు లేదా మనల్ని బాధపెట్టి, మన కల నెరవేరకుండా అడ్డుకున్న వారిని క్షమించవచ్చు.

యోసేపు తన జీవితంలో దేవుని హస్తం పని చేయడం చూశాడు. చాలా సంవత్సరాల తర్వాత, అతడు తన సహోదరులతో తిరిగి కలిసినప్పుడు, అతడు ఇలా అన్నాడు: "మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను." (ఆదికాండము 50:20)

నొప్పి మరియు బాధల మధ్య, దేవుడు యోసేపును రక్షించడానికి మరియు ఐగుప్తులో గొప్ప స్థానంలో ఉంచడానికి తెర వెనుక అలౌకికంగా పనిచేశాడు.

యోసేపు కలలు చాలా మంది జీవితాలలో దీవెనలను తెచ్చాయి. యోసేపు జీవితం ప్రవచనాత్మకంగా రాబోయే గొప్ప విమోచకుని - ప్రభువైన యేసుక్రీస్తును సూచించింది.
మీరు మీ కలలను ప్రభువుకు అప్పగించినప్పుడు మరియు మీ జీవితంలో ఆయన వాక్యం పనిచేయడానికి అనుమతించినప్పుడు, మీ కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయనను విశ్వసించండి మరియు మీరు ఖచ్చితంగా దానిని సాధిస్తారు.
ప్రార్థన
తండ్రీ, నీవు నాకు దయచేసిన కలలకై వందనాలు. నా చుట్టూ ఏమి జరుగుతుందో నేను అర్థం చేసుకోలేనప్పటికీ, నా జీవితం మీద నీ హస్తం ఉన్నందున సమస్త విషయాలు నాకు అనుకూలంగా పనిచేస్తున్నాయని నేను నమ్ముతున్నాను. యేసులో, ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఆధ్యాత్మిక మహా ద్వారము యొక్క రహస్యాలు
● తలుపులను మూయండి
● 21 రోజుల ఉపవాసం: 17# వ రోజు
● 21 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీరు అసూయను ఎలా నిర్వహిస్తారు
● 01 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దేవుని అత్యంత స్వభావము
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్