అనుదిన మన్నా
క్రీస్తు సమాధిని జయించాడు
Sunday, 20th of August 2023
0
0
597
Categories :
మరణం (Death)
సమాధి (Grave)
ఈ లాక్డౌన్ సమయంలో, ప్రార్థన తర్వాత, నేను పడుకోబోతుండగా, నా ఫోన్ మోగింది. అవతల నా సిబ్బందిలో ఒకరు, "ముంబయిలో నివసిస్తున్న మన సంఘ సభ్యులలో ఒకరు కింద పడి చనిపోయారు" అనే వార్తను తెలియజేశారు. ఆదివారం వావ్ సభకు ఆమె క్రమం తప్పకుండా హాజరవుతుందని నాకు చెప్పబడింది. ఈ విషాద వార్తతో నేను చాలా బాధపడ్డాను. నేను త్వరగా ప్రార్థన చేయడం ప్రారంభించాను మరియు అప్పుడు ఈ వచనం నా మనస్సులో వెలిగింది.
ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. (1 పేతురు 1:23)
ఈ రోజు మీరు చూసే ప్రతి ఒక్కరు, ఎంత అందంగా, పద్ధతిగా, శక్తివంతంగా, ప్రభావశీలంగా లేదా జనాదరణ పొందిన వారైనా, ఏదో ఒక రోజు గడ్డి పువ్వువలె ఎండిపోతారు.
బైబిలు శరీరాన్ని గడ్డితో ఎందుకు పోలుస్తుంది?
గడ్డి బలహీనమైన మొక్కలలో ఒకటి మరియు చిన్న గాలితో సహా స్వల్ప ఒత్తిడికి కూడా కొట్టుకోపోతుంది. ఇది మానవుని బలహీనతను గురించి వివరిస్తుంది.
చాలా కాలం క్రితం యోబు ఇలా అడిగాడు, "మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా?" (యోబు 14:14).
ఏదైనా నీరిక్షణ ఉందా?
యేసుక్రీస్తు పునరుత్థానంలో, చాలా మంది అడిగిన యోబు ప్రశ్నకు మనకు సమాధానం ఉంది. క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం అని బైబిలు సెలవిస్తుంది. గొప్ప సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు మరణించాడు, కానీ మళ్లీ తిరిగి లేచాడు మరియు మీరు మరియు నేను కూడా చనిపోతాము, కానీ నూతనంగా మళ్లీ తిరిగి లేస్తాము.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన(జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.
కుటుంబ రక్షణ
తండ్రీ, రక్షణ యొక్క కృపకై కోసం నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను; తండ్రీ, నీ కుమారుడైన యేసును మా పాపాల కోసం చనిపోవడానికి పంపినందుకు వందనాలు. తండ్రీ, యేసు నామమున, (ప్రియమైన వ్యక్తి పేరును పేర్కొనండి) నీ జ్ఞానంలో ప్రత్యక్షతను దయచేయి. నిన్ను ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకునేందుకు వారి కళ్ళు తెరువు.
ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నా పిలుపును నెరవేర్చడానికి ఆర్థిక అభివృద్ధి కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. నీవు గొప్ప పునరుద్ధరణకర్తవి.
KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, KSM యొక్క సమస్త పాస్టర్‌లు, గ్రూప్ సూపర్‌వైజర్లు మరియు J-12 లీడర్‌లు నీ వాక్యంలో మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. అలాగే, KSMతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి నీ వాక్యం మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. యేసు నామములో.
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశ సరిహద్దులలో శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. మా దేశంలోని ప్రతి రాష్ట్రంలో శాంతి మరియు గొప్ప అభివృద్ధి కోసం మేము ప్రార్థిస్తున్నాము. మా దేశంలో నీ సువార్తకు ఆటంకం కలిగించే ప్రతి శక్తిని నాశనం చేయి. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● మీ విశ్వాసముతో రాజీ పడకండి● విశ్వాసం యొక్క స్వస్థత శక్తి
● అంతర్గత నిధి
● మీ రక్షణ దినాన్ని జరుపుకోండి
● స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల
● మీ ప్రతిదినము మిమ్మల్ని నిర్వచిస్తుంది
● ఆయన మీ గాయాలను బాగు చేయగలడు
కమెంట్లు