english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ
అనుదిన మన్నా

దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ

Tuesday, 1st of August 2023
0 0 823
Categories : ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు (Names and Title of the Spirit) దేవుని 7 ఆత్మలు (The 7 Spirits of God)
మీకు తెలిసినట్లుగా, మనము యెషయా 11:2లో పేర్కొబడిన ప్రభువు యొక్క ఏడు ఆత్మలను గురించి అధ్యయనం చేస్తున్నాము.
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ 
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని 
యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును (యెషయా 11:2)

ఈ రోజు మనం పరిశుద్ధాత్మ తనకు తాను ప్రభువు యందు భయభక్తులు గల ఆత్మగా ఎలా వెల్లడిస్తాడో దాని గురించి అధ్యయనం చేయబోతున్నాం. యెషయా 11లోని "భయం" అనే పదానికి ప్రభువు పట్ల పరిశుద్ధమైన భయం మరియు వినయం అని అర్థం. ప్రభువు యందు భయభక్తులు గల ఆత్మను భక్తి యొక్క ఆత్మ అని కూడా సూచిస్తారు. (కీర్తనలు 111:9)

నేను ఒకరోజు చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు తమాషాగా శబ్దం చేసే మరియు వాటిపై లైట్లు పడే బూట్లు ధరించినట్లు గుర్తు. నేను వాటితో చాలా ఉత్సాహంగా ఉన్నాను, యాజకుడు ప్రార్థనలు చేస్తున్నప్పుడు నేను చర్చి అంతా తిరుగుతున్నాను. మా అమ్మ ఎక్కడి నుంచో వచ్చి, నా వెనుక వైపు సున్నితంగా చిటికె వేసి, నేను జీవితాంతం మరచిపోలేనిది నాతో చెప్పింది. ఆమె ఇలా చెప్పింది, "కుమారుడా, దేవుడు మరియు ఆయన సన్నిధి పట్ల ఎల్లప్పుడూ లోతైన భక్తిని కలిగి ఉండాలని గుర్తుంచుకో. అలా చేస్తే దేవుడు ఎప్పుడూ నీకు దగ్గరగా ఉంటాడు."

ప్రభవు యందు భయభక్తులు గల ఆత్మ యొక్క వ్యక్తీకరణలలో ఒకటి, ఆయన ఒక స్థలంలోకి లేదా ఒక వ్యక్తిపైకి వచ్చినప్పుడు, ఆయన దేవుని పట్ల లోతైన భక్తిని తెలియజేస్తాడు. ప్రజలు అకస్మాత్తుగా విస్మయంతో మోకాళ్లపై పడతారు, కొన్నిసార్లు వారి ముఖాల్లో కన్నీళ్లు రాళ్ళుతాయి.

కొన్నేళ్లుగా, ఎప్పుడో వాలా మనసుకు నచ్చిన విధంగా సంఘ సభలో పాల్గొనే వ్యక్తులను నేను చూశాను. ఆరాధన జరుగుతున్నప్పుడు, కొందరు తమ సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయడం, వారి ఇమెయిల్‌లను తనిఖీ చేయడంలో బిజీగా ఉంటారు. అలాంటి అసభ్య వైఖరిని దేవుడు ఎన్నటికీ సహించడు.

ప్రభువు యందు భయభక్తులు గల ఆత్మ ఒక వ్యక్తిపై నిలిచినప్పుడు, అలాంటి వ్యక్తి వినయంతో నడుచుకుంటాడు. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, "దేవునియందు భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి యుండుడి" (ఎఫెసీయులకు 5:21) జాగ్రత్తగా గమనించండి, ప్రభువు యందు భయభక్తులు గల ఆత్మ సన్నిధి లేకుండా మనల్ని మనం ఒకరికొకరు లోబడి యుండడం జరగదు. స్వభావరీత్యా మానవులు ఎవరికీ లోబడి ఉండకూడదనుకుంటారు. తిరుగుబాటు మనకు సహజంగానే వస్తుంది. సంక్షిప్తంగా, ప్రభువు యందు భయభక్తులు గల ఆత్మ మనకు దేవుని పట్ల భయాన్ని ఇస్తుంది, అది మనలను వంకర లేని మరియు ఇరుకైన మార్గంలో ఉంచుతుంది.

పరిశుద్ధాత్మ తనకు తాను ప్రభువుకు యందు భయభక్తులు గల ఆత్మగా వెల్లడిపరచినప్పుడు, మనం ఆయనను ఆదరిస్తాము, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటాము, పరిశుద్దాత్మ మార్గంలో ఆయన యందు భయము కలిగి ఉంటాము - మరియు ప్రతి సమయంలో ఆయన యందు ఆనందిస్తాము.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 

వ్యక్తిగత వృద్ధి
పరిశుద్దాత్మ దేవా, ఈ రోజు ప్రభువు యందు భయభక్తులు గల ఆత్మగా నాలో ప్రత్యక్షమగు. నీ పట్ల పరిశుద్ధమైన వినయము మరియు భక్తితో నన్ను నింపుము. నన్ను నేను నీకు పూర్తిగా అప్పగించుకుంటున్నాను. యేసు నామంలో. ఆమెన్

కుటుంబ రక్షణ
నేను నా హృదయంతో విశ్వసిస్తున్నాను మరియు నేను మరియు నా కుటుంబ సభ్యుల విషయానికొస్తే, మేము జీవము గల దేవుని సేవిస్తాము. నా రాబోయే తరం కూడా ప్రభువును సేవిస్తుంది. యేసు నామములో.
 
ఆర్థిక అభివృద్ధి
ఓ తండ్రీ, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన వృత్తి మరియు మానసిక నైపుణ్యాలను నాకు దయచేయి. యేసు నామములో. నన్ను దీవించు.
 
సంఘ ఎదుగుదల
తండ్రీ, ప్రత్యక్ష ప్రసార ఆరాధనలను చూసే ప్రతి వ్యక్తి దాని గురించి విన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే ముఖ్యమైన అద్భుతాలను పొందును గాక. ఈ అద్భుతాల గురించి విన్న వారు కూడా నీ వైపు తిరిగేలా విశ్వాసాన్ని పొంది మరియు అద్భుతాలను పొందుదురు.
 
దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశాన్ని (భారతదేశం) చీకటి దుష్ట శక్తులు ఏర్పరచిన ప్రతి విధ్వంసం నుండి విడుదల చేయి

Join our WhatsApp Channel


Most Read
● భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - I
● క్రైస్తవులు వైద్యుల వద్దకు వెళ్లవచ్చా?
● దైవికమైన అలవాట్లు
● ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము
● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
● విశ్వాసంతో వ్యతిరేకతను ఎదుర్కొనుట
● సంసిద్ధత లేని లోకములో సంసిద్ధముగా ఉండడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్