యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు?
అంజూరపు చెట్టు అనేది లేఖనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన చెట్లలో ఒకటి. దాని ఆకుల నుండి ఆదాము మరియు హవ్వలు తమ మొదటి కవచమును తయారు చేసుకున్నారు (ఆదికాండము 3:7). అంజూరపు చెట్టు దాని రుచికరమైన, తీపి ఫలాల కోసం మొదటిగా విలువైనది (న్యాయాధిపతులు 9:11).
ఇశ్రాయేలు దేశాన్ని తరచుగా ప్రతీకాత్మకంగా 'అంజూర చెట్టు' అని పిలుస్తారు. ఇశ్రాయేలు దేశం మళ్లీ పునర్జన్మకు సంబంధించి యేసు ప్రభువు కూడా అంజూరపు చెట్టు గురించి ప్రస్తావించాడు. (మత్తయి 24:32-33)
పాత నిబంధనలో అనేక సార్లు, ప్రవక్తలు దేవుడు ఇశ్రాయేలును "ప్రారంభ పండ్లను" పరిశీలిస్తున్నట్లు వర్ణించారు (మీకా 7:1; యిర్మీయా. 8:13; హోషేయ 9:10-17) —కానీ ఆయన "నా ఆత్మ కోరుకునే మొదటి అంజూరపు పండ్లు" కనబడలేదు.
కాబట్టి ఇద్దరు ప్రవాసులలో (అష్షూరీయులు మరియు బబులోనియులు), దేవుడు ఫలించని శాపాన్ని కురిపించాడు (హోషేయా 9:16), మరియు ఇశ్రాయేలు కుళ్ళిన అంజూరపు పండు అయింది (యిర్మీయా. 29:17). కాబట్టి ఫలించకపోవడం తీర్పుకు దారితీస్తుందని మీరు గమనించగలరు.
అయితే అంజూరపు పండ్లకు సరైన కాలం కాక పోయినప్పటికి యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు?
ఈ ప్రశ్నకు సమాధానం అంజూరపు చెట్ల లక్షణాలను అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయించబడుతుంది.
అంజూరపు చెట్టు యొక్క పండు సాధారణంగా ఆకుల ముందు కనిపిస్తుంది, మరియు పండు ఆకుపచ్చగా ఉన్నందున, అది దాదాపు పంటకి వచ్చే వరకు ఆకులతో కలిసిపోతుంది. కాబట్టి, యేసు మరియు ఆయన శిష్యులు చెట్టుకు ఆకులు ఉన్నాయని దూరం నుండి చూసినప్పుడు, అది కాలముకు ముందుగా ఉన్నప్పటికీ, దాని మీద పండ్లు కూడా ఉన్నాయని వారు ఆశించారు.
ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఆకులు మాత్రమే ఉన్న అనేక చెట్లు ఉన్నాయి మరియు కాని ఇవి శపించబడలేదు. ఆకులు లేదా పండ్లు లేని అనేక చెట్లు ఉన్నాయి మరియు ఇవి శపించబడలేదు. ఈ చెట్టుకు ఫలాలు ఉన్నాయని చెప్పినప్పటికీ అది ఫలించలేదు కాబట్టి శపించబడింది.
ప్రతీకాత్మకంగా, అంజూరపు చెట్టు ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక మృత్యువును సూచిస్తుంది, వారు సమస్త త్యాగాలు మరియు వేడుకలతో బాహ్యంగా చాలా మతపరమైనప్పటికీ, అంతర్గతంగా ఆధ్యాత్మికంగా ఫలించని విధంగా ఉన్నారు.
ఒక వ్యక్తి జీవితంలో నిజమైన రక్షణ యొక్క ఫలం రుజువు చేయబడితే తప్ప, అంతర్గత రక్షణానికి హామీ ఇవ్వడానికి కేవలం బాహ్య మతపరమైన ఆచారాలు సరిపోవు అనే సూత్రాన్ని కూడా ఇది మనకు బోధిస్తుంది.
కేవలం మతతత్వం యొక్క బాహ్య రూపాన్ని ఇవ్వకుండా, అంజూరపు చెట్టు యొక్క పాఠం ఏమిటంటే, మనం ఆధ్యాత్మిక ఫలాలను ఫలింపజేయాలి (గలతీయులు 5:22-23). దేవుడు ఫలించకపోవడాన్ని నిర్ణయిస్తాడు మరియు ఆయనతో సంబంధం కలిగి ఉన్నవారు "ఎక్కువ ఫలాలను ఫలించాలని" ఆశిస్తున్నాడు (యోహాను 15:5-8).
ఉపవాసం మరియు ప్రార్థన దినాలుగా ప్రకటించాము. మీరు కూడా మాతో చేరి దేవుని కదలికను అనుభవించవచ్చు.
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామంలో, నేను ఆత్మ ఫలాల యందు బహుగా ఫలిస్తాను. దీని ద్వారా, నీవు మహిమపరచబడుతావు మరియు నేను నీ నిజమైన శిష్యునిగా అవుతాను. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నేను ప్రభువు వాక్యమును బట్టి ఆనందించు వాడను; అందువలన, నేను ధన్యుడను. కలిమియు మరియు సంపదయు నా ఇంట ఉండును, నా నీతి నిత్యము నిలుచును. (కీర్తనలు 112:1-3)
తండ్రీ, పెంతెకోస్తు కూడికకు హాజరయ్యే ప్రజల ఆర్థిక మరియు ఆస్తులను కలిగి ఉన్న ప్రతి చీకటి గొలుసు యేసు నామములో విచ్ఛిన్నం అవును గాక.
KSM సంఘము
తండ్రీ, యేసు నామములో, KSM సంఘానికి అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి వాక్యము మరియు ప్రార్థనలో ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు నీ ఆత్మ యొక్క తాజా అభిషేకాన్ని పొందును గాక.
దేశం
తండ్రీ, భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో నీ ఆత్మ మరియు జ్ఞానంతో నిండిన నాయకులను లేవనెత్తు.
తండ్రీ, నీ ఆత్మ భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రం మీద కదిలింపబడును గాక. యేసు నామములో.
Most Read
● ఆరాధనను ఒక జీవన విధానంగా మార్చుకోవడం● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
● దేవుని మహిమపరచండి మరియు మీ విశ్వాసాన్ని ఉత్తేజపరచండి
● శాంతి (సమాధానం) మన వారసత్వం
● మీ మానసిక స్థితిని మెరుగుపరుచుట
● పరిశుద్ధత యొక్క ద్వంద్వ కోణాలు
● ప్రభువు యొద్దకు తిరిగి వెళ్దాం