english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. అంత్య దినం - ప్రవచనాత్మక కావలివాడు
అనుదిన మన్నా

అంత్య దినం - ప్రవచనాత్మక కావలివాడు

Wednesday, 30th of August 2023
0 0 608
నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండ మీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను. (యెషయా 5:1-2)

ఇశ్రాయేలు దేవుని ద్రాక్షతోట. సంఘము దేవుని ద్రాక్షతోట. దేవుడు నాటిన ద్రాక్షపండ్లు ఫలవంతం కావాలి. ఇక్కడ మీరు గమనించవల్సిన రెండు విషయాలు ఉన్నాయి.
1. ప్రభువు తన ద్రాక్షతోట చుట్టూ కంచె వేసాడు.
2. ఆయన మధ్యలో ఒక బురుజు వేయించాడు.


కంచె మరియు బురుజు ఎందుకు వేయించాడు?
కంచె మరియు బురుజు శత్రువులను దూరంగా ఉంచడానికి అవసరం.

మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. (యోహాను 15:16)

మనం ఫలాలను ఫలించుటకు మాత్రమే నియమించబడలేదు, కానీ ఫలాలను నిలిచియుండుటకు కూడా నియమించబడ్డాము. ఫలాలు నిలిచియుండుకపోతే ఫలించుటకు ఏం లాభం?
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు (యోహాను 10:10)

శత్రువు కుటుంబాలు, గృహాలు, సంఘాలు, పరిచర్యలు మరియు సంస్థల ఫలాలు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు.

కంచె లేకుండా ద్రాక్షతోటను నాటడం అవివేకం. ద్రాక్షతోటకు కంచె ఒక రక్షణ అవరోధాన్ని అందిస్తుంది. బురుజు అనేది కావలివాని కోసం ఒక స్థలం. ద్రాక్షతోటలకు కావలివారు కావాలి.

ద్రాక్షతోటను రక్షించడానికి స్థానిక సంఘాలకు బురుజులు మరియు కావలివారు చాలా అవసరం. సంస్థలకు కావలివాడు అవసరం.

ప్రభువు నాతో ఇట్లనెను
"నీవు వెళ్లి కావలివాని నియమింపుము, 
అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను." (యెషయా 21:6)

కావలివాడు ప్రవచనాత్మక విజ్ఞాపన ప్రార్థనపరుడు. విజ్ఞాపన ప్రార్థన ఎందుకు అంత ముఖ్యమైనదో ఇప్పుడు మీరు గమనించగలరు.

​యెజ్రెయేలు గోపురము మీద కావలివాడు నిలిచియుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, "సైన్యమొకటి నాకు కనబడుచున్నదని" తెలియజెప్పెను. (2 రాజులు 9:17)

కావలివాడు అంటే కాపలాగా నిలబడేవాడు. పురాతన నగరాల్లో గోడల మీద కావలివారు ఉండేవారు. ఒక కావలివాడు కేవలం చూడటం మరియు గమనించడం లేదా వినడం మాత్రమే కాదు; ఒక కావలివాడు బాకా ఊదుతాడు. అది వారి బాధ్యత.

శత్రువు మారువేషంలో వస్తాడు, కానీ ఒక ఆధ్యాత్మిక కావలివాడు అప్రమత్తంగా ఉంటాడు మరియు బాకా ఊదుతాడు మరియు శబ్దం చేస్తాడు, తద్వారా కుటుంబ సభ్యులు త్వరగా హెచ్చరించి మరియు నాశనం అవకుండా చేస్తాడు. 

మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను, 2 "నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన యెడల, 3 అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున, 4 ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది 5 బాకానాదము విని యును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడిన యెడల తనప్రాణమును రక్షించుకొనును. 6 అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను, నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. (యెహెజ్కేలు 33:1-6)

ఇక్కడ ఇద్దరు కావలివాని గురించి వివరించబడింది:
1. జాగ్రత్త గల కావలివాడు
2.ఉదాసీనమైన కావలివాడు
దేవుడు కావలివానిని బాధ్యత గలవానిగా చేస్తాడు

ద్రాక్షతోటలు మరియు పొలాలకు కావలివారు ఉంటారు, ముఖ్యంగా కోత సమయంలో. జంతువులు మరియు దొంగల నుండి ఉత్పత్తులను రక్షించడం వారి బాధ్యత.
మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంక పరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా, మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలి యుంచితివిు. (నెహెమ్యా 4:8-9)

నెహెమ్యా శత్రువులు యెరూషలేము గోడల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వచ్చారు. నెహెమ్యా అపొస్తలుల పరిచర్య యొక్క ముఖచిత్రం. అపొస్తలులు నిర్మించే వారు. భవన నిర్మాణానికి వ్యతిరేకత, వృద్ధికి వ్యతిరేకత ఉహించదగినదే. ప్రత్యర్థుల మీద విజయం పొందేందుకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిఘా పెట్టడమే యుద్ధతంత్రం. సంఘ నిర్మాణంలో అపొస్తలులు మరియు ప్రవక్తలు కలిసి పని చేయాలి. అపొస్తలులకు నిర్మించడంలో సహాయం చేసే ప్రవక్తలు అవసరం.

...... జనులందరు యెహోవా ఇచ్చిన ఆజ్ఞచొప్పున బయట (కావలి) ఉండవలెను. (2 దినవృత్తాంతములు 23:6)

విశ్వాసులందరూ కావలిగా ఉండవలసిందిగా ఆజ్ఞాపించబడింది.
ప్రతి క్రైస్తవుడు అతని లేదా ఆమె ప్రార్థన జీవితంలో కొంత వరకు ఆధ్యాత్మిక కావలివానిగా ఉండాలని పిలువబడ్డాడు. ఇది మీ కుటుంబ గోడల మీద కావలివానిగా ఉండవచ్చు, లేదా మీ సంఘం లేదా మీ నగరం గోడల మీద కావలివానిగా ఉండవచ్చు లేదా దేశం యొక్క గోడల మీద ఆధ్యాత్మిక కావలివానిగా దేవుడు మీకు అప్పగించవచ్చు.

ప్రభువైన యేసు కావలివాని గురించి మాట్లాడాడు.
జాగ్రత్తపడుడి; మెలకువగా నుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. (మార్కు 13:33)

బహుశా మీరు మీ కుటుంబానికి కావలివానిగా ఉండడానికి పిలవబడవచ్చు. తల్లులారా, మీరు మీ పిల్లలకు మరియు మీ జీవిత భాగస్వామికి కావలివారుగా ఉండమని ప్రభువు చేత పిలువబడ్డారు.

ప్రార్థన
ఉపవాసం మరియు ప్రార్థన దినాలుగా ప్రకటించాము. మీరు కూడా మాతో చేరి దేవుని కదలికను అనుభవించవచ్చు.

ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, ఆధ్యాత్మిక కావలివారిగా మా బాధ్యతను సంతోషంగా స్వీకరించడానికి మాకు సహాయం చేయి. మా హృదయాలలో నీ అగాపే ప్రేమను విడుదల చేయి, తద్వారా అది భారంగా కాకుండా ఆనందంగా ఉండును గాక.

మా ఆధ్యాత్మిక కన్నులను తెరువు, మాకు జ్ఞానాన్ని మరియు వివేచనను ప్రసాదించు, మరియు జాగ్రత్తగా ఉండటానికి మరియు ప్రార్థించడానికి మరియు అప్రమత్తంగా మరియు సిద్ధంగా ఉండటానికి మాకు అధికారం ఇవ్వు.

ఆర్థిక అభివృద్ధి
నేను ప్రభువు వాక్యమును బట్టి ఆనందించు వాడను; అందువలన, నేను ధన్యుడను. కలిమియు మరియు సంపదయు నా ఇంట ఉండును, నా నీతి నిత్యము నిలుచును. (కీర్తనలు 112:1-3)
తండ్రీ, పెంతెకోస్తు కూడికకు హాజరయ్యే ప్రజల ఆర్థిక మరియు ఆస్తులను కలిగి ఉన్న ప్రతి చీకటి గొలుసు యేసు నామములో విచ్ఛిన్నం అవును గాక.

KSM సంఘము
తండ్రీ, యేసు నామములో, KSM సంఘానికి అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి వాక్యము మరియు ప్రార్థనలో ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు నీ ఆత్మ యొక్క తాజా అభిషేకాన్ని పొందును గాక.

దేశం
తండ్రీ, భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో నీ ఆత్మ మరియు జ్ఞానంతో నిండిన నాయకులను లేవనెత్తు.
తండ్రీ, నీ ఆత్మ భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రం మీద కదిలింపబడును గాక. యేసు నామములో.


Join our WhatsApp Channel


Most Read
● నిత్యమైన పెట్టుబడి
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
● అశ్లీలత
● నేటి కాలంలో ఇలా చేయండి
● దయాళుత్వము చాలా ముఖ్యమైనది
● అవిశ్వాసం
● ఎత్తబడుట (రాప్చర్) ఎప్పుడు జరుగుతుంది?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్