english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. లైంగిక శోధనపై ఎలా విజయం పొందాలి - 1
అనుదిన మన్నా

లైంగిక శోధనపై ఎలా విజయం పొందాలి - 1

Sunday, 6th of August 2023
0 0 1259
Categories : ప్రలోభం (Temptation) విడుదల (Deliverance)
దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. 
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.

నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.

నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. (కీర్తనలు 51:1-5)

51వ కీర్తనను దావీదు అనే వ్యక్తి రచించాడు, అతను లైంగిక శోధనలతో కూడిన తీవ్రమైన అవమానాన్ని అనుభవించాడు. మంచి శుభవార్త ఏమిటంటే, అతను దేవునికి అప్పగించుకొనినప్పుడు అతనికి కూడా అత్యంత స్వాతంత్రయము లభించింది.

దావీదు తన తండ్రి గొర్రెలను మేపుకునే గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అతని కుటుంబం అతని గురించి పెద్దగా ఆలోచించలేదు మరియు అతని మరింత శక్తివంతమైన మరియు సమర్థులైన సోదరుల కోసం పనులు చేయడానికి సంరక్షణ పిల్లవానిగా ఉపయోగించుకునేవారు. ప్రభువు యొక్క కృప ద్వారా, అతడు ప్రభువు కోసం యుద్ధాలు చేసే యోధుడు అయ్యాడు. అతడు చివరికి ఇశ్రాయేలీయుల పాలకుడయ్యాడు.

హాస్యాస్పదంగా, అతని జీవితం యొక్క ఎత్తులో, అతడు తన కింది స్థాయి క్షణాలను అనుభవించాడు. అతడు లైంగిక పాపంలో పడిపోయాడు. తన పాపాన్ని దాచుకునేందుకు తారుమారు చేసి హత్య చేశాడు. అతని యొద్ద సమస్త వైఫల్యాలు ఉన్నప్పటికీ, చివరికి, దావీదు గురించి ప్రభువు ఏమి చెప్పాడో చూడండి:

"మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు" (అపొస్తలుల కార్యములు 13:22)

ప్రతి వ్యక్తి జీవితం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో, అలాగే ఉంటుంది కూడా, మనలో ప్రతి ఒక్కరూ లైంగిక శోధనలతో పోరాడాలి. నేను ఇటీవల ఒక యువకుడి నుండి పొందుకున్న ఇమెయిల్ ఇక్కడ ఉంది దయచేసి గమనించండి:
ప్రియమైన పాస్టర్ మైఖేల్ గారు,

నా యవ్వన కోరికల నుండి విడుదల పొందాలనే ప్రగాఢమైన కోరిక నాకు నిజంగా ఉంది, కానీ దీన్ని నుండి బయట పడే మార్గం నాకు ఎప్పుడూ చెప్పబడలేదు. దయచేసి! మీరు సహాయం చేయగలరా? 

గొప్ప బోధకుడైన పరిశుద్ధాత్మ, మన వినోదం కోసం దావీదుకు జరిగినదంతా ప్రస్తావించలేదు. ఆయన ఒక కారణం చేత బైబిల్లో వ్రాయడానికి అనుమతించాడు.

ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకైవ్రాయబడెను. (1 కొరింథీయులకు 10:11)

లేఖనాల యొక్క ఉద్దేశ్యం

మనకు దృష్టాంతములుగా వ్రాయబడెను

మనకు మందలింపుగా (హెచ్చరికగా) వ్రాయబడెను

తెలివి గల వ్యక్తి లేదా తెలివైన స్త్రీ అనుభవం ద్వారా నేర్చుకోరు; ఇది నేర్చుకోవడానికి చాలా బాధాకరమైన మార్గం. అతడు ఇతరుల విజయాలు మరియు వైఫల్యాల నుండి నేర్చుకుంటాడు.

చాలా స్పష్టంగా, దావీదు మహారాజు నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. దేవుడు దావీదుకు ఏమి నేర్పించాడో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, మనం కూడా దేవుని హృదయానుసారులై యోధులుగా మారవచ్చు మరియు లైంగిక శోధనలపై విజయం పొందగలమని నేను నమ్ముతున్నాను.

దావీదు యొక్క ప్రయాణం అంత సులభమైనది కాదు, కానీ మనం ఆత్మ ఖడ్గాన్ని - దేవుని వాక్యాన్ని ఎంచుకొని, మన స్వాతంత్రయము కోసం పోరాడాలని నిశ్చయించుకుని యుద్ధానికి దిగితే, విజయం యేసు నామంలో మనదే అవుతుంది.

 "చాలు ఇక చాలు, అని మీరు చెబుతున్నట్లైతే. ఈ అవమానపు గొలుసులు నా జీవితాన్ని వృధా చేసి పిలుస్తున్నాయి", ఆపై నాతో ప్రార్థించండి

ప్రార్థన

తండ్రీ, యేసు నామంలో, నాకు సహాయం చేసే నీ శక్తిని నేను అంగీకరిస్తున్నాను. నీ ప్రియా కుమారుడైన యేసును నా పాపానికి బలిగా ఇవ్వడానికి నీవు అనుమతించినందుకు నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను.


తండ్రీ, యేసు నామంలో, క్రీస్తులో నేను ఉండాలని నీవు కోరుకునే స్వేచ్ఛ కోసం పోరాడే శక్తిని, జ్ఞానాన్ని మరియు భావావేశము నాకు దయచేయి.

తండ్రీ, యేసు నామంలో, నాలో నీ మార్గాన్ని కలిగి ఉండటానికి నేను నీకు అనుమతి ఇస్తున్నాను, తద్వారా నీవు నన్ను నీ స్వరూపంలో పునర్నిర్మాణం చేయుదువు గాక.


Join our WhatsApp Channel


Most Read
● ఆరాధనకు ఇంధనం
● ప్రేమ - విజయానికి నాంది - 2
● ఈ నూతన సంవత్సరంలో అనుదినము సంతోషమును ఎలా అనుభవించాలి
● పెంతేకొస్తు కోసం వేచి ఉండడం
● మతపరమైన ఆత్మను గుర్తించడం
● దేవుడు భిన్నంగా చూస్తాడు
● తలుపులను మూయండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్