అనుదిన మన్నా
మాదిరి కరంగా నడిపించబడుట
Thursday, 10th of August 2023
0
0
658
Categories :
నాయకత్వం (leadership)
ప్రభావం (Influence)
నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. (1 తిమోతికి 4:12)
తిమోతి ఒక యువనస్థుడు, దీని కారణంగా చాలా మంది సంఘ పెద్దలు అతనిని పెద్దగా పట్టించుకోలేదు మరియు అతని నాయకత్వ సామర్థ్యాలను పట్టించుకోలేదు. అతనికి అవసరమైన అనుభవం లేదని వారు భావించుండాలి.
కానీ తిమోతి వయస్సు మరియు అనుభవంతో సంబంధం లేకుండా, అపొస్తలుడైన పౌలు అనుదినం మంచి మాదిరిని ఉంచడం ద్వారా తన వయస్సుకు మించిన ప్రజలను నడిపించగలడని అతనికి గుర్తుచేశాడు. ఇది అతని విశ్వసనీయతను పెంచుతుంది.
క్రైస్తవులుగా, మనమందరం ఒక నెల లేదా పది సంవత్సరాలు రక్షింపబడినా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి పిలువబడ్డాము. మీ వ్యక్తిత్వం ఏ రకంగా ఉన్నా, మనమందరం మన చుట్టూ ఉన్నవారి పట్ల విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ మరియు పవిత్రతకు మాదిరి కరంగా ఉండడానికి పిలువబడ్డాము.
బైబిలు గురించి తెలుసుకోవడం మంచిది, కానీ ఇంకా మంచిది ఏమిటంటే, మనం మాట్లాడే విధానం, ప్రవర్తించడం, ప్రేమించడం, నమ్మడం మరియు దేవునికి నచ్చని విషయాలను ముఖ్యంగా విశ్వాసం లేకుండా ఉన్నవారి ప్రజల ముందు మనం క్రీస్తుపై మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి.
చాలా సంవత్సరాల క్రితం, ఒక దేవుని దాసుడు ఇలా చెప్పడం విన్నాను, "లోక ప్రజలు మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలను చదవకపోవచ్చు, కానీ వారు ఖచ్చితంగా ఐదవ సువార్తను చదువుతారు. ఎందుకంటే నీవు ఐదవ సువార్తవి."
ఇది ఎంతవరకు నిజం! కొందరికి, వారి జీవితకాలంలో క్రీస్తుతో మనకు మాత్రమే నిజమైన సాంగత్యము ఉండవచ్చు, మరియు మనం ఆయనకు మంచిగా ప్రాతినిధ్యం వహించేలా చూసుకోవాలి.
1 తిమోతి 4:16లో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను మనం నిజంగా పాటిస్తే అది మనందరికీ చాలా మేలు చేస్తుంది.
నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 2 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
తండ్రీ, యేసు నామములో, నీ మార్గంలో ఎదగడానికి నాకు సహాయం చేయి, తద్వారా నేను ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాను, మరియు తద్వారా నేను సంప్రదించి ప్రతి ఒక్కరిని నీ కోసం వారిని గెలుచుకుంటాను. ఆమెన్.
కుటుంబ రక్షణ
నా స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు నేను సిగ్గుపడను: మరియు కరువు దినములలో, నేను మరియు నా కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా సంతృప్తి పొందుదుము. (కీర్తనలు 37:18-19)
ఆర్థిక అభివృద్ధి
నా దేవుడు క్రీస్తుయేసు ద్వారా మహిమలో తన ఐశ్వర్యాన్ని బట్టి నా అవసరాలన్నీ తీర్చును. (ఫిలిప్పీయులకు 4:19) నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచికి లోటు ఉండదు. యేసు నామములో.
KSM సంఘము
తండ్రీ, మమ్ములను కాపాడుటకు మరియు మా మార్గములలో మమ్మును కాపాడుటకు నీ దేవదూతలకు మాపై ఆజ్ఞాపించాలని నీ వాక్యము చెప్పుచున్నది. యేసు నామములో, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం, బృంద సభ్యులు మరియు కరుణా సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉన్న నీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. వారికి వ్యతిరేకంగా చీకటి యొక్క ప్రతి పనిని నాశనం చేయి.
దేశం
తండ్రీ, నీ శాంతి మరియు నీతి మా దేశాన్ని నింపును గాక. మన దేశానికి వ్యతిరేకంగా చీకటి మరియు విధ్వంసం యొక్క అన్ని శక్తులను నాశనం చేయును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలో వ్యాప్తి చెందును గాక. యేసు నామములో.
Join our WhatsApp Channel
Most Read
● ధారాళము యొక్క ఉచ్చు● శాంతి (సమాధానం) మన వారసత్వం
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు -2
● విశ్వాసంతో వ్యతిరేకతను ఎదుర్కొనుట
● మీ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి క్రియాత్మక పద్ధతులు
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 4
● చేదు (కొపము) యొక్క వ్యాధి
కమెంట్లు