english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. సర్పములను ఆపడం
అనుదిన మన్నా

సర్పములను ఆపడం

Sunday, 13th of August 2023
0 0 1361
Categories : ప్రలోభం (Temptation) విడుదల (Deliverance) సణుగుట (Murmuring)
మనము ప్రభువును(కొన్నిప్రాచీన ప్రతులలో-క్రీస్తును అని పాఠాంతరము) శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. (1 కొరింథీయులకు 10:9-10)

ఇశ్రాయెలు ప్రజలు, అరణ్యం చుట్టూ రెండవ పర్యటనలో, ప్రతిదాని గురించి, ఆహారం, పరిస్థితులు మొదలైన వాటి గురించి సణుగుతున్నారు మరియు ఫిర్యాదు చేశారు. ఇది దేవునికి కోపం తెప్పించింది, మరియు ఆయన వారి మధ్యలోకి విషపూరితమైన సర్పములను పంపాడు మరియు వారిలో చాలా మంది సర్పము కాటుకు గురయ్యారు. (సంఖ్యాకాండము 21:4-6 చదవండి)

ఈ బాధలో, ప్రజలు తమ తప్పును త్వరగా గ్రహించారు, వారు పాపం చేశారని వినయ పూర్వకంగా ఒప్పుకున్నారు. అప్పుడే మోషే ప్రజల కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు. (సంఖ్యాకాండము 21:7)

నిరంతరం సణగడం మరియు ఫిర్యాదు చేయడం వల్ల కలిగే ప్రమాదం ఏమిటంటే, దేవుడు మనకు ఇచ్చిన సమస్త మంచివాటిని మనం చివరికి మర్చిపోతాము. మీరు సణుగుడు, గొణుగుడు మరియు ఫిర్యాదు చేసిన క్షణం, మీరు కృతజ్ఞత లేనివారిగా ప్రారంభిస్తారు.

సణుగుట సమాధానమిచ్చే వ్యక్తి కంటే సమస్యపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. ఇది దేవుని శక్తిపై ఆధారపడకుండా మనపైనే దృష్టి పెట్టేలా చేస్తుంది.

సణుగుడు మరియు గొణుగుడు గురించి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఇది ప్రజల జీవితాల్లో వినాశనం సృష్టించే దుష్ట శక్తుల ఆత్మలకు ద్వారములు తెరుస్తుంది.

సణుగుట ఆపడం ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ మనకు బోధించాలనుకుంటాడు, అందుకే ఆయన ఫిలిప్పీయులకు 2:14-15లో అపొస్తలుడైన పౌలు ద్వారా ఇలా వ్రాశాడు:

మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును. (ఫిలిప్పీయులకు 2:14-15)

దేవుని దాసుడు మోషేకు కూడా మరొక కార్యం చేయమని ఆదేశించబడ్డాడు:

కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను. (సంఖ్యాకాండము 21:9)

ఈ దృశ్యం యొక్క అర్థాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనకు ముఖ్యమైన మూడు విషయాలు ఉన్నాయి.
 
1.లోహము, కాంస్య లేదా ఇత్తడి, పాత నిబంధన అంతటా తీర్పుతో ముడిపడి ఉంది.
 
2. హవ్వను ప్రలోభపెట్టడానికి తోటలో సాతాను తీసుకున్న రూపానికి సర్పము ఒక ప్రతీక.

3. కాంస్య సర్పాన్ని బహిరంగంగా, బయట, అందరికీ కనిపించేలా ఒక స్తంభానికి వేలాడదీయబడింది.

పాము కాటుకు గురైన వ్యక్తులు స్తంభంపై ఉన్న బొమ్మను మాత్రమే చూడవలసి ఉంటుంది, మరియు తరువాత వారు జీవిస్తారు. మీరు సణుగుతూ మరియు ఫిర్యాదు చేయాలని భావించినప్పుడల్లా, యేసు వైపు చూడండి, ఆయన ఫిర్యాదు మరియు సణుగుడు లేకుండా మన కోసం ఎలా బాధపడ్డాడు. అప్పుడు తండ్రియైన దేవుడు ఆయనను ఎంతో ఉన్నతీకరించాడు. మీకు కూడా అదేవిధంగా జరగబోతోంది.

అలాగే, మీరు ఎల్లప్పుడూ ఫిర్యాదు చేయడం మరియు సణుగుకోవడం యొక్క అలవాటు ఉన్నట్లయితే, యేసు వైపు చూసి, ఆయన కృప కోసం వెడుకోండి. గుర్తుంచుకోండి, యేసు మనకు సంపూర్ణ మాదిరి.
ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. 

వ్యక్తిగత అభివృద్ధి
తండ్రీ, నా జీవితంలోని నా పరిస్థితి గురించి ఫిర్యాదు చేసినందుకు నన్ను క్షమించు. నీ వైపు చూడటానికి మరియు ఈరోజు నేను ఎదుర్కొనే ప్రతి అడ్డంకిని అధిగమించడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.

కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి పరిచర్య చేయడానికి నాకు అధికారం దయచేయి. యేసు నామములో. ఆమెన్.

ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎవరూ మూసివేయలేని నీ తలుపులు తెరిచినందుకు నేను నీకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను. (ప్రకటన 3:8)

సంఘ ఎదుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడేలా నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించును గాక. నీ నామము మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.

దేశం
తండ్రీ, యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా, దుష్టుల శిబిరంలో నీ ప్రతీకారాన్ని విడిచిపెత్తును గాక మరియు ఒక దేశంగా మేము కోల్పోయిన మహిమ పునరుద్ధరించబడును గాక.


Join our WhatsApp Channel


Most Read
● మనుష్యుల పారంపర్యాచారము (సంప్రదాయాలు)
● లెక్కించుట ప్రారంభం
● ఎస్తేరు యొక్క రహస్యం ఏమిటి?
● ఆరాధన యొక్క నాలుగు ముఖ్యమైన అంశాలు
● రహస్యాన్ని స్వీకరించుట
● వారి యవనతనంలో నేర్పించండి
● విత్తనం యొక్క శక్తి - 3
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్