విజ్ఞాపన పరులకు ఒక ప్రవచనాత్మక సందేశం
ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి. (కొలొస్సయులకు 4:2)
1. కొనసాగించండి
సమాధానం రావడానికి చాలా సుదీర్ఘమై అనిపించునట్లుగా మీరు ప్రార్థిస్తున్న దేనినైనా వదులుకోవాలని మీరు శోధింపబడిన కాలాన్ని మీ జీవితంలో ఎప్పుడైనా అనుభవించారా?
విజ్ఞాపనపరునిగా ఉండటం కృతజ్ఞత లేని ఉద్యోగంలా అనిపిస్తుంది. ఆరాధికులు మరియు బోధకుల వలె కాకుండా ఎవరో కొద్ది మంది మిమ్మల్ని గుర్తించ ఉండవచ్చు. అయినా విజ్ఞాపనపరుడు దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉంటాడు. విజ్ఞాపనపరునికి విజ్ఞాపన ప్రార్థన విడిచిపెట్టడానికి మరియు పచ్చని పచ్చిక బయళ్లకు వెళ్లడానికి వారు శోదించబడిన కాలం గుండా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి.
దుష్టుని యొక్క గొప్ప అబద్ధాలలో ఒకటి మీ విజ్ఞాపన ప్రార్థన ఫలించలేదు; అది ప్రభావం చూపడం లేదు. నిజం పూర్తిగా భిన్నంగా ఉంది.
పరిశుద్ధాత్మ మీతో ఇలా అంటున్నాడు, "నిలుకడగా ఉండి మరియు విజ్ఞాపన ప్రార్థనను కొనసాగించండి. మీరు ఆత్మ యొక్క పరిధిలో శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతున్నారు." మీరు ఆపివేస్తే, విషయాలు మరింత దిగజారిపోవచ్చు మరియు చేయి దాటిపోవచ్చు.
2. ప్రార్థనలో నిలకడగా ఉండటం
ప్రార్థనలో నిలకడగా ఉండటం అంటే కేవలం కర్తవ్యం లేదా భారం అనే భావనతో ప్రార్థించడం కాదు, మీరు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారని తెలుసుకోవడం.
3. ప్రార్థనలో మెలకువగా ఉండటం
విజ్ఞాపన ప్రార్థన తరచుగా లేఖనాల్లో ప్రాకారముల మీద కావలివానితో పోల్చబడింది. (యెషయా 62:6 చదవండి) ఒక కావలివాడు నిద్రపోతున్నట్లయితే, అతడు చూడలేడు లేదా వినలేడు, అందువలన అతడు ఎవరి కోసం కావలియున్నాడో వారిని హెచ్చరించలేడు.
ఒక మెలకువ గల విజ్ఞాపనపరుడు దేవునికి చాలా ముఖ్యం. ఒక మెలకువ గల విజ్ఞాపనపరుడు విజ్ఞాపన సమయంలో ప్రార్థన చేయడమే కాకుండా వ్యక్తిగత ప్రార్థన ద్వారా తన ఆధ్యాత్మిక కండలను ముందుగా ప్రతి రోజు పదును పెడుతుంటాడు. అటువంటి విజ్ఞాపనపరులు ప్రార్థన యొక్క భవిష్య కోణాన్ని నమోదు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు, అక్కడ అతడు లేదా ఆమె ప్రభువు చెప్పేది మరియు చేస్తున్నది చూడగలరు మరియు వినగలరు.
4. కృతజ్ఞతగలవారై
కృతజ్ఞత అనేది ఒక విజ్ఞాపనపరునికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ప్రభువు హృదయాన్ని తాకడమే కాకుండా కృతజ్ఞతలు తెలిపే విజ్ఞాపనపరుని హృదయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కృతజ్ఞత ఒక విజ్ఞాపనపరుని గర్వము నుండి కాపాడుతుంది మరియు ప్రభువుకు మహిమను ఇస్తుంది.
విజ్ఞాపన ప్రార్థనకి కట్టుబడి ఉండమని ఆత్మ తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నోహ్ యాప్ ద్వారా విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనండి. విజ్ఞాపన ప్రార్థన జలాలలో మీ పాదాలను ఇంకా తడి చేయని వారు, దయచేసి చేయండి, ఈ సమయంలో క్రీస్తు దేహానికి మీ సహాయం కావాలి. మీరు ఆత్మ యొక్క పిలుపును పాటిస్తారా (లోబడుతారా)?
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా కనీసం 3 నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.
వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. (కీర్తనలు 141:1-2)
కుటుంబ రక్షణ
పరిశుద్దాత్మ, నా కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఎలా పరిచర్య చేయాలో ప్రత్యేకంగా నాకు చూపించు. ప్రభువా నాకు అధికారం దయచేయి. సరైన సమయంలో నీ గురించి పంచుకోవడానికి అవకాశాలను బహిర్గతం చేయి. యేసు నామములో. ఆమెన్.
ఆర్థిక అభివృద్ధి
నేను విత్తిన ప్రతి విత్తనమును యెహోవా జ్ఞాపకముంచుకొనును గాక. కాబట్టి, నా జీవితంలో అసాధ్యమైన ప్రతి పరిస్థితిని యెహోవా తిప్పిస్తాడు. యేసు నామములో.
KSM చర్చి పెరుగుదల
తండ్రీ, యేసు నామములో, ప్రతి మంగళ/గురు & శనివారాల్లో వేలాది మంది KSM ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. వారిని మరియు వారి కుటుంబాలను నీ వైపు మళ్లించు. వారు నీ అద్భుతాలను అనుభవించుదురు గాక. నీ పేరు మహిమపరచబడునట్లు వారికి సాక్ష్యమివ్వుము.
దేశం
తండ్రీ, యేసు నామములో, భారతదేశంలోని ప్రతి నగరం మరియు రాష్ట్రంలోని ప్రజల హృదయాలు నీ వైపు మళ్లాలని నేను ప్రార్థిస్తున్నాను. వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడి యేసును తమ ప్రభువు మరియు రక్షకునిగా ఒప్పుకుందురు.
Most Read
● 12 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన● మీ ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి క్రియాత్మక పద్ధతులు
● దేవుని 7 ఆత్మలు : ఆలోచన గల ఆత్మ
● ప్రార్ధనలేనితనం (చేయకపోవడం) వలన దేవదూతల కార్యాలకు ఆటంకం కలిగిస్తుంది
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 1
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 1
● మీరు ఇంకా ఎందుకు వేచి ఉన్నారు?