english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుని అత్యంత స్వభావము
అనుదిన మన్నా

దేవుని అత్యంత స్వభావము

Tuesday, 12th of September 2023
0 0 1006
Categories : స్వభావం (Character)
అయితే ఆత్మ ఫలమేమనగా (ఆయన సన్నిధి సమక్షంలో నెరవేర్చబడే గొప్ప కార్యము), ప్రేమ, సంతోషము (ఆనందం), సమాధానము, దీర్ఘశాంతము (సమానత్వం, సహనం), దయాళుత్వము, మంచితనము (పరోపకారం), విశ్వాసము, సాత్వికము (సౌమ్యత, వినయం), ఆశా నిగ్రహము (స్వీయ నిగ్రహం, నిర్బంధం). ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు (అది కార్యము చేయగలదు) లేదు.

ఆ తొమ్మిది లక్షణాలు, ఆత్మ ఫలం, దేవుని స్వభావం మరియు స్వరూపం. అవి మన ప్రభువైన యేసుక్రీస్తు స్వభావం మరియు స్వరూపం.

ఆయన నడిచే, మాట్లాడే విధానం ఆత్మ ఫలం యొక్క వ్యక్తీకరణం. ఆత్మ ఫలం క్రీస్తు యొక్క "సారూప్యము".

ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (రోమీయులకు 8:29)

వాస్తవానికి, దేవుని వాక్యం మరియు అభిషేకం యొక్క అంతిమ ఉద్దేశ్యం మనలను మార్చడం మరియు మన స్వభావం ఆయన వలె మార్చబడటం. 

గుర్తుంచుకోండి, ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఘనపరచబడును మరియు మహిమపరచబడును, మరియు మీరు నా నిజమైన శిష్యులగా నిరూపించబడతారు మరియు నిరూపించుకుంటారు." (యోహాను 15:8)

ప్రజలు ఆత్మ ఫలం లేకుండా పరిశుద్ధాత్మ వరముతో పనిచేయడానికి ప్రయత్నించినప్పుడు, వరము చివరికి భ్రష్టమైపోవును మరియు దాని సంపూర్ణతతో పనిచేయదు.

అలాంటి వరాలను దుర్వినియోగం చేయడం వల్ల తండ్రికి ఎలాంటి మహిమ పొందుకోడు. అందువల్ల, మీరు ఆయన సన్నిధిలో చేరి ఉండడం మరియు ఫలించడం చాలా అవసరం. పరిశుద్ధాత్మ యొక్క వరములు ఎల్లప్పుడూ ఆత్మ ఫలం యొక్క శక్తివంతమైన ప్రభావంతో సమానంగా ఉపయోగించబడతాయి.

కఱ్ఱ యొక్క కథ సంఖ్యాకాండము 17లో చదువుతాము; దేవుడు ఒక ప్రధాన యాజకుడిని ఎన్నుకున్నాడు మరియు ప్రతి గోత్రం నుండి ఒక వ్యక్తి తన కఱ్ఱను తీసుకువచ్చి ప్రత్యక్షపు గుడారం తలుపు ముందు ఉంచమని మోషేకు ఆజ్ఞాపించాడు. చిగిరించిన కఱ్ఱ యాజకుని కోసం తన ఎంపికకు సూచనగా ఉంటుందని దేవుడు చెప్పాడు.

మరునాడు మోషే సాక్ష్యపు గుడారము లోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను. (సంఖ్యాకాండము 17:8)

ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "వారి ఫలములను బట్టి మీరు వారిని తెలిసికొందురు..." (మత్తయి. 7:16). ప్రధాన యాజకుని దేవుడు ఎన్నుకున్నాడని కఱ్ఱ మీద పండు ద్వారా తెలిసింది.

ప్రార్థన
ప్రతి ప్రార్థన అంశము తప్పనిసరిగా  3  నిమిషాలు మరియు అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి.

వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధి
నేను తల (ప్రభువైన యేసు క్రీస్తు)తో అనుసంధానించబడి ఉంది. కాబట్టి, నా జీవితం మరి ఎక్కువగా ఫలిస్తుంది మరియు తండ్రికి ఘనతను తెస్తుంది.

కుటుంబ రక్షణ
తండ్రీ, రక్షణ యొక్క కృపకై కోసం నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను; తండ్రీ, నీ కుమారుడైన యేసును మా పాపాల కోసం చనిపోవడానికి పంపినందుకు వందనాలు. తండ్రీ, యేసు నామమున, (ప్రియమైన వ్యక్తి పేరును పేర్కొనండి) నీ జ్ఞానంలో ప్రత్యక్షతను  దయచేయి. నిన్ను ప్రభువు మరియు రక్షకునిగా తెలుసుకునేందుకు వారి కళ్ళు తెరువు.

ఆర్థిక అభివృద్ధి
తండ్రీ, యేసు నామములో, నా పిలుపును నెరవేర్చడానికి ఆర్థిక అభివృద్ధి కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. నీవు గొప్ప పునరుద్ధరణకర్తవి.

KSM సంఘ ఎదుగుదల
తండ్రీ, KSM యొక్క సమస్త పాస్టర్‌లు, గ్రూప్ సూపర్‌వైజర్లు మరియు J-12 లీడర్‌లు నీ వాక్యంలో మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. అలాగే, KSMతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి నీ వాక్యం మరియు ప్రార్థనలో వృద్ధి చెందేలా చేయి. యేసు నామములో.

దేశం
తండ్రీ, యేసు నామములో, మా దేశ సరిహద్దులలో శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. మా దేశంలోని ప్రతి రాష్ట్రంలో శాంతి మరియు గొప్ప అభివృద్ధి కోసం మేము ప్రార్థిస్తున్నాము. మా దేశంలో నీ సువార్తకు ఆటంకం కలిగించే ప్రతి శక్తిని నాశనం చేయి. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● సంసిద్ధత లేని లోకములో సంసిద్ధముగా ఉండడం
● ప్రవచన ఆత్మ
● మంచి శుభవార్త చెప్పుట
● అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 1
● మీ బాధలో దేవునికి లోబడియుండుట గురించి నేర్చుకోవడం
● యజమానుని యొక్క చిత్తం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్