english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఒక విషయం: క్రీస్తులో నిజమైన ధనమును కనుగొనడం
అనుదిన మన్నా

ఒక విషయం: క్రీస్తులో నిజమైన ధనమును కనుగొనడం

Friday, 3rd of November 2023
0 0 1418
Categories : Choices Discipleship Following Jesus Priorities Transformation
ప్రతి వ్యక్తి హృదయంలో మరియెక్కువగా ఏదో కోసం తపన ఉంటుంది, జీవితం మన ముందు స్పష్టంగా ఉన్న దానికంటే లోతైన అర్థాన్ని కలిగి ఉండాలి. ఈ అన్వేషణ ప్రభువైన యేసు మరియు ధనిక యువ అధికారికి మధ్య జరిగిన సంభాషణలో స్పష్టంగా వివరించబడింది. యువకుడు సంపద, హోదా మరియు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, అయినప్పటికీ అతనికి ఏదో కొరత తెలుసు - అతనికి నిత్య జీవము లేదు.

మనిషి యొక్క అన్వేషణకు యేసు యొక్క ప్రతిస్పందన లోతైనది, "నీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను" (లూకా 18:22). మార్కు 10:21లో, ప్రేమతో నిండిన చూపులతో యేసు ఈ సవాలుతో కూడిన ఆజ్ఞను అందించడం మనం చూస్తాము. ఇది పేదరికానికి పిలుపు కాదు, నిజమైన సంపదలకు పిలుపు - ఈ ప్రపంచానికి కాదు, హృదయం మరియు పరలోకము యొక్క సంపద.

మనిషి ప్రపంచ ప్రమాణాల ప్రకారం విజయం సాధించాడు కానీ అతని విజయం శూన్యంగా ఉంది. ఒక గొప్ప వ్యక్తి ఒకసారి ఇలా సెలవిస్తూ, "మన ప్రభువు మన సహజ ధర్మాలను ఎన్నడూ సరిద్దిదడు, ఆయన సమస్తము మానవుని లోపలి నుండి మారుస్తాడు." యువ అధికారి ధర్మానికి బాహ్యంగా కట్టుబడి ఉండటం అతని అంతర్గత పేదరికాన్ని కప్పిపుచ్చలేకపోయింది. యేసు తన శిష్యత్వానికి అడ్డంకిగా ఉన్న ఒక విషయాన్ని ఎత్తి చూపాడు - అతని సంపద, అతని హృదయంలో విగ్రహంగా మారింది.

యేసు యువకుని అడ్డంకిని గుర్తించినట్లే, మన హృదయాలను పరిశీలించి, పూర్తి శిష్యత్వానికి అడ్డుగా ఉన్న వాటిని గుర్తించమని ఆయన మనలను పిలుస్తున్నాడు. అది సంపద కాకపోవచ్చు; అది ఆశయం, బంధాలు, భయం లేదా సౌకర్యం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఈ అడ్డంకులను బహిర్గతం చేయడానికి మరియు తొలగించడానికి రక్షకుని ప్రేమతో కూడిన చూపు మరియు ఆయన మృదువైన ఇంకా దృఢమైన హస్తం అవసరం.

విగ్రహాల గురించి బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది - మన జీవితాల్లో దేవుని స్థానాన్ని ఆక్రమించే ఏదైనా. "నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును" (మత్తయి 6:21). అపొస్తలుడైన పౌలు కొలొస్సయులు 3:2లో "మీ మనస్సులను పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి" అని గుర్తు చేస్తున్నాడు. ఈ లేఖనాలు మన ప్రాధాన్యతలను మరియు ఆప్యాయతలను అంచనా వేయమని ప్రోత్సహిస్తాయి.

శిష్యత్వాన్ని స్వీకరించడం అంటే యేసును వెంబడించడానికి సమస్తమును అప్పగించడం. ఇది లోపల ప్రారంభమయ్యే పరివర్తన మరియు మన విశ్వాసాన్ని మనం ఎలా జీవిస్తున్నామో తెలియజేస్తుంది. యాకోబు 2:17 చెప్పినట్లు, "ఆలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును." నిజమైన శిష్యత్వం అనేది కేవలం విశ్వాసం మాత్రమే కాకుండా క్రియను కలిగి ఉంటుంది - క్రీస్తు ప్రేమ మరియు దాతృత్వాన్ని ప్రతిబింబించే జీవితం.

ధనిక యువ అధికారికి యేసు ఇచ్చిన ఆహ్వానం మనకు ఇవ్వబడింది: "నీవు వచ్చి నన్ను వెంబడింపుము." ఇది వ్యక్తిగతమైన విశ్వాస యాత్రకు పిలుపు. మనకోసం కాకుండా మనకోసం తనను తాను అప్పగించిన ఆయన కోసం జీవించాలనే పిలుపు.

శిష్యత్వ ప్రయాణం జీవితాంతం మరియు లోబడే తత్వముతో నిండి ఉంటుంది. మన "ఒక విషయం" గుర్తించడములో మనం క్రీస్తులో నిజమైన జీవితాన్ని కలిగి ఉంటాము.
ప్రార్థన
తండ్రీ, నిబద్ధత కలిగిన శిష్యత్వం నుండి మమ్మల్ని నిరోధించే అడ్డంకులను వేయడానికి మాకు సహాయం చేయి. అన్నింటికంటే మిన్నగా నిన్ను అధికంగా వెతకడం మాకు నేర్పుము మరియు నీ అడుగుల్లో మమ్మల్ని నిజమైన జీవిత మార్గంలో నడిపించు. యేసు నామములో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మునుపటి సంగతులను మరచిపోండి
● వరుడిని కలవడానికి సిద్ధపడుట
● 21 రోజుల ఉపవాసం: 16# వ రోజు
● అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
● అంతిమ రహస్యము
● 29 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ప్రభవు శాశ్వతకాలము ఉండును
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్