english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించాము
అనుదిన మన్నా

ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించాము

Monday, 20th of November 2023
0 0 1270
Categories : ఉద్దేశ్యము (Purpose) మధ్యస్త్యం (Intercession)
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. (కీర్తనలు 139:14)

దేవుడు ఈ భూమిపై ఉన్న ప్రతి మానవుని ఎవరూ సాధించలేని నిర్దిష్టమైనదాన్ని సాధించడానికి సృష్టించాడు. మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

మీరు మరియు నేను ఏదో ఒక ప్రత్యేకత కోసం ప్రసిద్ధి చెందేలా రూపొందించబడ్డాము. మనము మరచిపోలేని విధముగా మీరు మరియు నేను కార్యములు చేయడానికి రూపొందించబడ్డాము. లోకము విస్మరించలేని కార్యములు చేయడానికి మీరు మరియు నేను జన్మించాము.

లోకాన్ని నిలబెట్టి, గమనించేలా చేసిన సాధారణ వ్యక్తుల చిన్న చిన్న కార్యములను బైబిలు నమోదు చేసింది. తనకు తెలియని వ్యక్తుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన రాహాబు అనే వేశ్య ఒక ఉదాహరణ. ఇశ్రాయేలీయులు యెరికోను ఓడించడానికి ఆమె యెహొషువ మనుష్యులను దాచడానికి జన్మించింది. (యెహొషువ 2:6 చూడండి)

ఇది విజ్ఞాపన ప్రార్థనకు సంబంధించిన ప్రవచనాత్మక కార్యము. మీరు కూడా విజ్ఞాపన ప్రార్థన బృందంలో భాగం కావచ్చు. మీరు ప్రతిరోజూ నా కోసం విజ్ఞాపన ప్రార్థన చేయచవచ్చు. ఇది విసుగుగా అనిపించవచ్చు మరియు ఆకర్షణీయంగా లేదని నాకు తెలుసు, కానీ దేవుని దృష్టిలో దీనికి చాలా గొప్ప విలువ ఉంది.
మత్తయి వంశావళి ప్రకారం (మత్తయి 1:5), రాహాబు తర్వాత యూదాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది మరియు ఆమె బోయాజుకు తల్లి అయ్యింది. రాహాబు మన ప్రభువైన యేసు వంశంలో ఉన్నదని మీకు తెలుసా? అయితే దానిని నేను కనికరము అని అంటాను.

కొత్త నిబంధనలో, ఒక స్త్రీ సుగంధ పరిమళాన్ని తీసుకొని దానితో యేసయ్య తలపై అభిషేకం చేసిన కథను గురించి మనం చదువుతాము.

భోజనానికి గుమిగూడిన మనుష్యులను అడ్డం పెట్టుకుని ఆనాటి సామాజిక సంప్రదాయాలకు అతీతంగా దూసుకెళ్లింది ఈ స్త్రీ. అయినప్పటికీ, ఎలాంటి పరిణామాలు ఎదురైనా యేసయ్యకు కృతజ్ఞతగా తన జీవితాన్ని సమర్పించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.

అక్కడ ఉన్నవారిలో కొందరు ఆమెను తీవ్రంగా విమర్శించారు, ఎందుకంటే ఆమె విలువైన పరిమళాన్ని బీదల ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు కానీ ఆమె యేసుపై "వ్యర్థం" చేసింది. అయినప్పటికీ యేసు వారితో ఇలా అన్నాడు: "ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు?... సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను" (మార్కు 14: 6,9).

ఎంత చిన్న కార్యము అయినా, మీరు మీ జీవితమంతా దానిలో దారపోసినట్లయితే, అది విస్మరించబడదు. దాని కోసం పరలోకము మిమ్మల్ని ఘనపరుస్తుంది.

ఒప్పుకోలు
నేను యెహోవాను బట్టి సంతోషించుచున్నాను, మరియు ఆయన నా హృదయ వాంఛలను తీర్చును. క్రీస్తులో, నేను తలగా ఉంటాను గాని తోకగా ఉండను.


Join our WhatsApp Channel


Most Read
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #15
● వరుడిని కలవడానికి సిద్ధపడుట
● మాదిరి కరంగా నడిపించబడుట
● లోబడే స్థలము
● సరైన వ్యక్తులతో సహవాసం చేయుట
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 1
● లోబడుటలో స్వేచ్ఛ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్