అనుదిన మన్నా
07 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
Sunday, 17th of December 2023
1
1
788
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
నూతన స్థలములను పొందుకోవడం
నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను. (యెహొషువ 1:3)
విశ్వాసులు క్రీడలు, రాజకీయాలు, సాంకేతికత, వ్యవసాయం, విద్య, సైనిక, ఆరోగ్య సంరక్షణ మరియు మీడియా వంటి విభిన్న రంగాలలో నాయకత్వ స్థానాల్లో ఉండవచ్చు. ఆ స్థానాల్లో మన నాయకత్వం ద్వారా దేవుని రాజ్యం పెరుగుతుంది మరియు దైవిక విలువలు వివిధ సంస్థలు మరియు వ్యవస్థలను వ్యాప్తి చేస్తాయి.
దేవుడు ఆదామును ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి అని ఆజ్ఞాపించాడు (ఆదికాండము 1:28). దేవుని ప్రజలుగా, మనం ఆధిపత్యాన్ని కలిగి ఉండేలా మరియు స్థలములను పొందుకునేలా రూపొందించబడ్డాము. స్థలమును పొందుకోవడానికి కత్తి లేదా తుపాకీ అవసరం లేదు. ఇది భౌతికంగా ప్రజలతో పోరాడటం కూడా కాదు. స్థలమును పొందుకోవడం అనేది "ప్రభావానికి" సంబంధించినది. ఏ రంగంలోనైనా విజయం అనేది "ప్రభావానికి" దారి తీస్తుంది. సమాజంలో దైవిక సూత్రాలు మరియు విలువలను స్థాపించడానికి మన ప్రభావాన్ని ఉపయోగించాలి.
మనము లోకమునకు వెలుగు మరియు ఉప్పై ఉన్నాము; మనము దేవుని కోసం లోకమును స్వాధీనం చేసుకోవడానికి విమోచన ద్వారా రూపొందించబడ్డాము. ప్రతి రంగాన్ని ప్రభావితం చేయడానికి మరియు అవినీతి మరియు వినాశనమును దూరంగా ఉంచడానికి మనం పిలువబడి రక్షించబడ్డాము (మత్తయి5:16, 1 పేతురు 2:9). క్రైస్తవులు నాయకత్వం, నైతికత మరియు మానవత్వాన్ని పాటించేలా ఇతరులు అనుసరించడానికి ఒక మంచి ఉదాహరణను ఏర్పాటు చేయాలి. స్ఫూర్తి మరియు సూచనల కోసం లోకము మనవైపు చూడ వలసిన మార్పు యొక్క ప్రతినిధులం మనము.
స్థలములను పొందుకోవడం అంటే ఏమిటి?
1. మార్పు యొక్క ప్రతినిధులుగా మారాలని దీని అర్థం.
2. నూతన సరిహద్దులను బద్దలు కొట్టాలని దీని అర్థం.
3. మనుష్యుల హృదయాలలో దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని దీని అర్థం.
4. దేవుని రాజ్యం యొక్క సిధ్ధాంతాలతో మీ పర్యావరణాన్ని ప్రభావితం చేయాలని దీని అర్థం.
5. సానుకూల సందర్భ అంశము కావాలని దీని అర్థం.
మనం స్థలములను ఎందుకు పొందుకోవాలి?
1. చీకటి శక్తుల అధికారులను తొలగించడానికి
ఈ అపవాది అధికారులే మన సమాజాలలో అనారోగ్యం, వ్యాధి, పేదరికం, మరణం, బాధ మరియు అన్ని రకాల చెడుతనముకు కారణం. మనం వాటిని తొలగించకపోతే, అవి ఎంతకాలం ఉంటాయో అలాగే ఉండి
ఉంటాయి.
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము. (ఎఫెసీయులకు 6:12)
2. మీ ప్రయాసములో విజయం పొందడానికి
ప్రాదేశిక ఆత్మలు అనేకమంది క్రైస్తవుల ప్రయత్నాలను నిరాశపరుస్తున్నాయి. మీరు ఒక స్థలము మీద వారి పట్టును విచ్ఛిన్నం చేయకపోతే, ఆ ప్రాంతాల్లో విజయం సాధించడం మీకు కష్టంగా ఉండవచ్చు.
నేను మోషేతో చెప్పి నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చు చున్నాను. (యెహొషువ 1:3)
అనేక పరిచర్యలు పరిమిత సంఖ్యకు మించి ఎదగలేవు ఎందుకంటే చాలా మంది మనస్సులను బంధంలో ఉంచిన ప్రాదేశిక ఆత్మలు ఉన్నాయి.
స్థలములను పొందుకోవడానికి గల 5 P'లు
మీరు దేవుని కోసం స్థలములను పొందుకోవడానికి ముందు ఈ ఐదు అవసరాలు తప్పక తీర్చాలి.
1. Purpose - ఉద్దేశం
మీ కోసం లేదా దేవుని కోసం మీరు స్థలములను ఎందుకు పొందుకోవాలనుకుంటున్నారు?
మీ ఉద్దేశ్యం సరైనదైతే, దేవుడు మీకు సహాయం చేస్తాడు, కానీ మీరు స్వార్థపూరిత ఉద్దేశ్యాలతో చేస్తే, మీరు సాతాను దాడులకు గురవుతారు.
2. Prayer - ప్రార్థన
యబ్బేజు తన సరిహద్దును విస్తరించమని దేవుని ప్రార్థించాడు మరియు అది దయ చేయబడింది. సాతాను ఆటంకములను తొలగించడానికి ప్రార్థన అవసరం.
9 యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను. 10 యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొఱ్ఱపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు
మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. (1 క్రానికల్స్ 4:9-10).
మీరు ఆధ్యాత్మిక పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మీరు పోరాడకుండా స్థలమును పొందుకోలేరు.
3. Passion - ఉద్రేకం
రాజభవనంలోని రాజు భుజించు భోజనమును తిని తనను తాను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు నిశ్చయించుకున్నాడు. (దానియేలు 1:8). ఉద్దేశం లేకుండా, మీరు నిశ్చయించుకోలేరు. దానియేలు తన జీవితానికి దేవుని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకపోతే, అతడు బులోను వ్యవస్థకు లొంగిపోయి ఉండేవాడు. దేవుని దాసుడు, మైల్స్ మన్రో, "ఉద్దేశం తెలియనప్పుడు, దుర్వినియోగం అనివార్యం" అని సెలవిచ్చాడు.
4. Purity - పరిశుద్ధత
ఇకను నేను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియు లేదు. (యోహాను 14:30). ఈ లోకాధికారి క్రీస్తు జీవితాన్ని శోధించడానికి వచ్చాడు కానీ ఆయనలో అపవిత్రమైనదేదీ కనుగొనలేకపోయాడు. ఒకవేళ వాడు ఏదైనా తప్పును కనుగొంటే, క్రీస్తు శత్రువుకు చట్టబద్ధమైన బందీ అయ్యి ఉండేవాడు.
మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలకు శుభ్రంగా కనిపించవచ్చు కానీ లోపల శుభ్రంగా ఉన్నారా లేదా నటిస్తున్నారా? మీరు చేసేది కంటికి కనబడే సేవో లేక కేవలం నీతి కార్యము చేస్తున్నారో అపవాదికి బాగా తెలుసు. మీరు సంఘములో మరియు కార్యాలయంలో విభిన్న వ్యక్తిగా ఉన్నారా? శక్తి ముందు పరిశుద్ధత వస్తుంది. మీరు దేవునితో సరిగ్గా లేకుంటే, మీరు స్థలములను పొందుకోలేరు.
5. Power - బలము
ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనును. (మత్తయి 12:29)
దుష్టుడు బలవంతుడు, మరియు మీరు స్థలములను పాండుకునే ముందు, దుష్టున్ని బంధించాలి. లోకములో దేన్నైనా బంధించడానికి మనకు అధికారం ఇవ్వబడింది, కాబట్టి మనం బంధించడంలో విఫలమైతే, ఏదీ బంధించబడదు. మీరు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న ఏ ప్రాంతంలోనైనా బలమైన వ్యక్తి తప్పనిసరిగా బంధించబడాలి. ఉదాహరణకు, వ్యాపారం మరియు అధికారిక భూభాగం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటిలో బలమైన వ్యక్తి తప్పనిసరిగా బంధించబడాలి. జీవితంలోని వివిధ రంగాలకు బాధ్యత వహించే నిర్దిష్ట సిధ్ధాంతాలు ఉన్నాయి.
తదుపరి అధ్యయనం: ఆదికాండము 13:15, కీర్తనలు 2:8
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)
తండ్రీ, రాజ్యాలు, అధికారాలు, ఆధిపత్యాలు మరియు శక్తి కంటే చాలా ఉన్నతమైన పరలోక కుడిపార్శ్వమున నన్ను క్రీస్తుతో కలిసి కూర్చోబెట్టినందుకు వందనాలు. యేసు నామములో ఆమేన్. (ఎఫెసీయులకు 2:6)
యేసు నామములో, నేను నా స్వంత ప్రతి ఆస్తిని పొందుకుంటున్నాను. (యెహోషువ 1:3)
నా అభివృద్ధిని నిరోధించే ఏదైనా ప్రాదేశిక ఆత్మ, నేను నిన్ను యేసు నామములో స్తంభింపజేస్తున్నాను. (లూకా 10:19)
నా విజయాన్ని మరియు అభివృద్ధిని నిరోధించే ఏదైనా సాతాను కోట, నేను నిన్ను యేసు నామములో క్రిందికి పడవేస్తున్నాను. (2 కొరింథీయులు 10:4)
నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా ఉనికి మరియు దైవిక కార్యములను సవాలు చేసే ఏదైనా ప్రాదేశిక ఆత్మలకు వ్యతిరేకంగా దేవదూతల సైన్య సమూహము నా కోసం పోరాడడం యేసు నామములో ప్రారంభించును గాక. (కీర్తనలు 91:11)
ఓ దేవా, యేసు నామములో నా తీరాన్ని విస్తరించు మరియు నా గొప్పతనాన్ని వృద్ధిచేయుము. ఈ ఉపవాసంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఇలాగే జరుగును గాక.. (1 దినవృత్తాంతములు 4:10)
నా అభివృద్ధి మరియు మహిమతో పోరాడి నేను పరిమిత సంస్కృతులు, సంప్రదాయాలు మరియు ప్రాదేశిక ఆత్మలను యేసు నామములో విచ్ఛిన్నం చేస్తున్నాను. (గలతీయులకు 3:28)
ఓ దేశమా, ప్రభువు మాట వినుము, యేసు నామములో నా మంచి కోసం పని చేయడం ప్రారంభించు. (యెషయా 55:11)
నా లక్ష్యము మీద ఉంచబడిన ప్రతి పరిమితి, యేసు నామములో తొలగించబడి నాశనం చేయబడును గాక.. (యిర్మీయా 29:11)
నేను ఇప్పుడు నూతన స్థలములను (మీరు విజయం పొందాలనుకుంటున్న స్థలాలను పేర్కొనండి) యేసు నామములో పొందుకుంటున్నాను. (ద్వితీయోపదేశకాండము 11:24)
నేను స్వాధీనం పరచుకున్న నా దీవెనలు, మహిమ మరియు సద్గుణాలన్నింటినీ యేసు నామములో మరల మరియు తిరిగి పొందుకుంటున్నాను. (యోవేలు 2:25)
కరుణా సదన్ పరిచర్య నూతన స్థలములో విస్తరించబడాలని దయచేసి ప్రార్థించండి. (యెషయా 54:2-3)
Join our WhatsApp Channel
Most Read
● ఆయన నీతి వస్త్రమును ధరించుట● 26 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 21 రోజుల ఉపవాసం: 6# వ రోజు
● మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
● 35 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆరాధన యొక్క పరిమళము
● నిత్యమైన పెట్టుబడి
కమెంట్లు