అనుదిన మన్నా
మీరు ప్రభువును వ్యతిరేకిస్తున్నారా?
Sunday, 8th of September 2024
0
0
193
Categories :
గర్వము (Pride)
విడుదల (Deliverance)
ఒకసారి సంఘ సభ్యుడు ప్రవచనాత్మక వరములలో బాగా ఉపయోగించబడుతున్న తన పాస్టర్ గారి దెగ్గరికి వెళ్ళాడు మరియు ఇలా అడిగాడు "పాస్టర్ గారు, ఏ ఆత్మ నన్ను వ్యతిరేకిస్తుందో మీరు నాకు చెప్పగలరా?" పాస్టర్ గారి జవాబు కోసం ఆ సంఘ సభ్యుడు చాలా ఆకర్షియమైన సమాధానం కోసం ఎదురు చూస్తూనప్పుడు, అప్పుడు పాస్టర్ గారు ఇలా సమాధానము ఇచ్చారు, "దేవుని ఆత్మ మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మీరు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు"
దయచేసి కింది లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించండి:
కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదినిఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. (యాకోబు4:7)
విశ్వాసమందు స్థిరులై వానిని (అపవాదిని) ఎదిరించుడి. (1పేతురు5:9)
ఒక క్రైస్తవుడు మొదట దేవునికి లోబడాలి, అప్పుడు అపవాదిని ఎదిరించాలని పై లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. శత్రువు యొక్క ప్రతి చెడు పథకాన్ని మనం ఈ విధంగా అధిగమించగలము.
మంచి శుభవార్త ఏమిటంటే, క్రైస్తవులలో చిన్నవాడు కూడా క్రీస్తులో బలంగా నిలబడటం ద్వారా శత్రువు యొక్క అత్యంత చీకటి శక్తులను విజయవంతంగా ఎదుర్కోగలడు. ఏదేమైనా, తరచుగా పట్టించుకునే ఒక అంశం ఉంది మరియు అక్కడే అన్ని సమస్యలు తలెత్తుతాయి.
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. (యాకోబు4:6)
.....మీరందరుఎదుటివానియెడలదీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మునుఅలంకరించుకొనుడి; "దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును." (1పేతురు5:5)
దేవుని బలంతో మనం అపవాదినిఎదిరించాలనేది వాస్తవం. అయినప్పటికీ, చాలా సార్లు క్రైస్తవులు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు. గర్వము అనేది దేవునికి, ఆయన మార్గాలకు ఆటంకము. ప్రభువు స్వయంగా మనల్ని వ్యతిరేకించినప్పుడు ఇది జరుగుతుంది.
సంఖ్యకాండము22బిలాము అనే వ్యక్తి గురించి చెబుతుంది.
స్పష్టంగా బిలాము గొప్ప ఖ్యాతిని నెలకొల్పాడు! అతడు ఒక వ్యక్తిని శపించినట్లయితే, అతను శపించబడుతాడు మరియు అతడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడుతారు. బిలాముకుప్రభువు గురించి తెలుసు, ఆయన చేశాడని అందరికీ తెలుసు. మోయాబీయులతో వెళ్లవద్దని యెహోవాబిలాముతో స్పష్టంగా చెప్పాడు, అయినా బిలాము వెళ్ళాడు. (సంఖ్యాకాండము22:21)
అప్పుడు అతడు వెళ్ళినందున దేవుని కోపం (బిలాముకు వ్యతిరేకంగా) రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అంతలో యెహోవాబిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్నయెహోవా దూతను అతడు చూచెను… (సంఖ్యాకాండము22: 22,31)
మనం దేవుణ్ణి ఎదిరించినప్పుడు, ఆయన మనలనుఎదురిస్తాడు. అటువంటి పరిస్థితులలో మన ఆటంకము పూర్తిగా వ్యర్థం. వినయము గర్వానికి వ్యతిరేకం.
మీ జీవనశైలిలోని కొన్ని ప్రదేశాలను మార్చడం గురించి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు మరియు మీరు మార్పును నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. ఒక ప్రత్యేకమైన ఆర్థిక పరమైన విత్తనాన్ని విత్తాల్సిన అవసరము ఉందేమో, ఒకరిని క్షమించాల్సిన అవసరం ఉందేమో లేదా ప్రార్థన కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించడం వంటివి ప్రభువు మీపై ఆకట్టుకుంటాడు. ఏమైనప్పటికీ, ఇకపై ఆయనను ఎదురించకుండా దేవుని యందు మీకు మిరైలోబడియుండుడి.
మీరు అభివృద్ధిని చూడకపోవచ్చు మరియు గర్వం సమస్యల కారణంగా వ్యతిరేకం ప్రభువు నుండే రావచ్చు కాబట్టి మీరు దాని కోసం అపవాదిని నిందిస్తున్నారు. మీరు ఏ విధంగానైనా ప్రభువును వ్యతిరేకిస్తున్నారా?
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీ వాక్యానికి శ్రద్ధ చూపకుండా నిన్ను వ్యతిరేకిస్తూనందుకు నన్ను క్షమించు. నీ వాక్యాన్ని వెంటనే పాటించే మనసు నాకు దయచేయి. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● గతం యొక్క ఏకాంతగృహమును తెరుచుట● ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)
● ఇది సాధారణ అభివందనము కాదు
● ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు: పరిశుద్దాత్మ
● విధేయత ఒక ఆధ్యాత్మిక గుణము
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
కమెంట్లు