english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. రెండవసారి చనిపోవద్దు
అనుదిన మన్నా

రెండవసారి చనిపోవద్దు

Wednesday, 7th of February 2024
0 0 1324
Categories : സ്വഭാവം (Character)
తరువాత ఎలీషా (ప్రవక్త) మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును (మనిషి యొక్క మృతదేహం) పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా (ప్రవక్త) యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను. (2 రాజులు 13:20-21)

తన పరిచర్యలో, ఏలీయా తన మీద ఉన్న దేవుని శక్తి ద్వారా 14 అద్భుతాలు చేశాడు.

ఎలీషా ప్రవక్త ఏలీయా ప్రవక్త ఆత్మ యొక్క రెండింతల భాగాన్ని పొందినట్లయితే, అతడు కనీసం 28 అద్భుతాలు చేస్తాడు. అయితే, అతడు చనిపోయినప్పుడు, అతడు కేవలం ఇరవై ఏడు అద్భుతాలు చేశాడు. అతని ఎముకలతో కూడిన ఈ పునరుత్థాన అద్భుతం 28వ అద్భుతాన్ని ప్రదర్శించింది.

కొంత మంది బైబిలు పండితులు ఈ అద్భుతం యొక్క సమాచారమును ఎలీషాపై ఆధారపడిన ఏలీయా యొక్క ఆత్మ యొక్క రెండింతల భాగపు ఏర్పాటు యొక్క ఖచ్చితమైన నెరవేర్పుగా మాత్రమే చూస్తారు.

రండి కథలోకి తిరిగి వెళ్లుదాం:
ఒక ఇశ్రాయేలీయుడు చనిపోయాడు మరియు అతని మృతదేహాన్ని నగరం వెలుపల ఉన్న సమాధి స్థలానికి తీసుకువెళ్లారు. ఈ అంత్యక్రియల ఊరేగింపు సమాధి స్థలానికి చేరుకోగానే, ఒక మోయాబీయుల దాడి బృందం దిగంతంలో కనిపించింది. భద్రత మరియు రక్షణ నగర గోడల లోపల మాత్రమే స్థాపించబడింది, కాబట్టి ఈ పురుషులు వీలైనంత త్వరగా నగరానికి తిరిగి రావడం అత్యవసరం. దీంతో వారు తీవ్ర దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారు పాతిపెట్టాలని చూస్తున్న ఈ వ్యక్తి మృతదేహాన్ని ఏమి చేయాలమీ? అతనికి సరైన సమాధి చేయడానికి వారికి సమయం లేదు, కాబట్టి వారు మృతదేహాన్ని త్వరగా పారవేసి నగరానికి పారిపోవాలని నిర్ణయించుకున్నారు.
వారి ఆతురుతలో, వారు ఆ వ్యక్తి శరీరాన్ని ఎలీషా ప్రవక్త సమాధిలోకి విసిరారు. శరీరం ఎలీషా ప్రవక్త ఎముకలను తాకినప్పుడు, అది పునరుత్థానం చేయబడింది మరియు ఆ వ్యక్తి తన పాదాలపై నిలబడ్డాడు.

ఆ వ్యక్తి తన కాళ్ళ మీద నిలబడి ఉన్నప్పుడు, అతను కూడా మోయాబీయుల దొంగల గుంపు రావడాన్ని చూసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. తను కూడా నగరం వైపు పరుగెత్తుంటాడు.

ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, అతని అంత్యక్రియలకు వచ్చిన ప్రజలు కూడా భద్రత కోసం నగరం వైపు పరుగులు తీస్తున్నారు; ఈ వ్యక్తి కూడా భద్రత కోసం నగరం వైపు పరుగుతీస్తున్నాడు. అతడు రెండవసారి చనిపోవాలని అనుకోలేదు అందుచేత ఈ వ్యక్తి మిగతా వారి కంటే వేగంగా పరిగెత్తాడని నేను నమ్ముతున్నాను.

చనిపోయిన వారి స్నేహితుడు తమ కంటే ముందు పరుగెత్తడాన్ని చూసినప్పుడు సమాధి చేసిన ప్రజల ముఖాల్లోని రూపాన్ని చూస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా?

ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలతో సంబంధంలోకి వచ్చిన తరువాత చనిపోయిన వ్యక్తి పైకి లేవడం యొక్క దేవుని సందేశం మిమ్మల్ని తాకిన తర్వాత, మీరు దేవునితో కలుసుకున్న తర్వాత రక్షణాని అనుభవించిన తర్వాత, కేవలం చుట్టూ తిరుగుతూ ఉండకండి, మీ పందెంలో పరుగెత్తండి. దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండండి.

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నియమించబడిన పందెంలో సమర్థవంతంగా పరుగెత్తడానికి నేను నీ కృపకై నిన్ను వేడుకుంటున్నాను.

యేసు నామంలో, నాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి మోసపూరిత కలవరము అగ్నితో నరికివేయబడును గాక.

నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపము విషయమై మృతుడను మరియు నీతికి సజీవులుగా ఉన్నాను.


Join our WhatsApp Channel


Most Read
● అభిషేకం పొందుకున్న తరువాత ఏమి జరుగుతుంది
● మీ ప్రపంచానికి ఆకారం ఇవ్వడానికి మీ తలంపును ఉపయోగించండి
● వాక్యంలో జ్ఞానం
● మన్నా, పలకలు మరియు చేతికఱ్ఱయు
● ఉగ్రతపై ఒక దృష్టి వేయుట
● దేవుడు ఇచ్చిన ఉత్తమ వనరు
● స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్