english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఎల్లప్పుడూ పరిస్థితుల దయతో కాదు
అనుదిన మన్నా

ఎల్లప్పుడూ పరిస్థితుల దయతో కాదు

Wednesday, 14th of February 2024
0 0 1220
Categories : ప్రార్థన (Prayer)
యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. (1 దినవృత్తాంతములు 4:9)

యబ్బేజుకు ఎదగడం అంత తేలికైన పని కాదు. అతనికి చాలా మంది సహోదరులు ఉన్నారు మరియు అతని పేరు కారణంగా వారు అతనిని పదే పదే ఎగతాళి చేసేవారు.

యబ్బేజు యాకోబు ద్వారా ప్రేరణ పొందాడని నేను నమ్ముతున్నాను. అతని తల్లిదండ్రులు కూడా అతనికి యాకోబు అని పేరు పెట్టారు, అంటే 'మోసగాడు'. తన జీవితమంతా, అతడు ఆ కళంకాన్ని మోశాడు. అయితే ఒకరోజు, యాకోబు రాత్రంతా ప్రార్థనలో దేవునితో పోరాడుతుండగా, అతని జీవితంలో ఒక మలుపు తిరిగింది. ప్రభువు స్వయంగా తన పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చాడు, అంటే 'దేవునితో ఉన్న యువరాజు'. ఆ రోజు నుండి, యాకోబు జీవితం ఎప్పుడూ ఒకేలా లేదు. (ఆదికాండము 32)

దేవుడు యాకోబు కోసం చేయగలిగితే, దేవుడు అతని కోసం కూడా చేయగలడని యబ్బేజు బహుశా ప్రత్యక్షతను కలిగి ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు పక్షపాతము చూపే దేవుడు కాదు. (యోబు 34:19) మీరు మరియు నేను కూడా ఈ సత్యాన్ని మన ఆత్మలలో లోతుగా గ్రహించాలి.

ఒకరోజు యబ్బేజు ఇకా చాలని నిర్ణయించుకున్నాడు. అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, అతడు ఎప్పుడైనా తన జీవితంలో మార్పును చూడబోతున్నట్లయితే, అది దేవుడు మాత్రమే ఆ మలుపును తీసుకురాగలడు.

అప్పుడు యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొఱ్ఱపెట్టెను (1 దినవృత్తాంతములు 4:10)
  • దేవునికి మొఱ్ఱపెట్టడం అంటే ప్రార్థన.
  • దేవునితో సహవాసం అంటే ప్రార్థన.
  • దేవునితో ప్రభు బల్ల అంటే ప్రార్థన.
నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. (యిర్మీయా 33:3)

నిజమైన ప్రార్థన మీకు గొప్ప మరియు శక్తివంతమైన విషయాలను వెల్లడిస్తుంది, మీరు కలలో కూడా ఊహించని విషయాలు. యబ్బేజు తన అభివృద్ధిని పొందడంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు మరియు మీరు కూడా అలా చేయాలి.

ప్రార్థన అనేది దైవత్వం మరియు మానవత్వం మధ్య కలిసే సమావేశం స్థానం. ప్రార్థించడానికి స్త్రీ లేదా పురుషుడు ఉంటే, సమాధానం చెప్పడానికి దేవుడు ఉన్నాడు. యుద్ధభూమిలో కంటే మోకాళ్లపై ఎక్కువ విజయాలు సాధించగలరు.

31కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. 32ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి 6:31-33)

ప్రభువును శ్రద్ధగా వెదకే పురుషుడు లేదా స్త్రీ ఎప్పటికీ పరిస్థితుల దయతో ఉండరు.

గమనిక: దయచేసి మీరు వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులతో ఈ అనుదిన మన్నాని షేర్ చేయడానికి షేర్ బటన్‌ను ఉపయోగించగలరా, తద్వారా వారు కూడా వారి అభివృద్ధిని పొందుకోగలరు?
ప్రార్థన
1. తండ్రీ, యేసు నామంలో, నా జీవితంలో ప్రతిరోజూ మీ వాక్యమును స్వీకరించే శక్తిని నేను పొందుకుంటున్నాను.

2. నేను ఏమై యున్నానని దేవుని వాక్యం చెబుతుందో నేను అదే అయియున్నాను. నేను భూమిపై ప్రభువైన యేసుక్రీస్తును వ్యక్తపరిచే ప్రతిబింబాన్ని. ప్రతి రోజు నేను దేవునితో నా సంబంధాన్ని పెంచుకుంటున్నాను.

3. తండ్రీ, యేసు నామంలో, నేను నీ సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా నా నిస్థిరత్వం ద్వారా నింపబడాలని ప్రార్థిస్తున్నాను.(ఎఫెసీయులకు 3:19)

Join our WhatsApp Channel


Most Read
● దేవుని ఆలయములో స్తంభం
● ఆందోళనను అధిగమించుట, ఈ విషయాలపై ఆలోచించుట
● అలాంటి శోధనలు ఎందుకు?
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 1
● మీ రక్షణ దినాన్ని జరుపుకోండి
● దుష్ట ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం
● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 2
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్