అనుదిన మన్నా
దైవికమైన అలవాట్లు
Saturday, 17th of February 2024
1
0
736
Categories :
అలవాట్లు (Habits)
మీరు ఎప్పుడైనా భక్తిహీనమైన అలవాట్లలోకి జారుకోవడం గమనించినట్లయితే, మీరు ఒక్కరే ఆ విధంగా లేరు. సోషల్ మీడియాను నిరంతరం చూడటం లేదా Facebook, Instagram మొదలైన వాటిలో ఎక్కువ సమయం గడపడం వంటి అలవాట్లు. కొందరు గేమ్స్ కు అలవాటు పడి గంటల తరబడి గురి లేకుండా గడుపుతున్నారు. ఈ రకమైన ప్రవర్తన బంధాలను మరియు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
మీ భక్తిహీనమైన అలవాటు ఏమిటో నాకు తెలియదు, కానీ మన మందరం సాతానుచేత చిన్నచిన్న మార్గాల్లో దేవుని నుండి దూరమయ్యేలా శోధించబడుతున్నాము. కానీ 1 కొరింథీయులకు 10:13 ఇలా చెబుతోంది, "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప బడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును."
శోధనను మనపై ఆధిపత్యం చేయవలసిన అవసరం లేదు; భక్తిహీనమైన అలవాట్లను విడనాడవచ్చు మరియు వాటి స్థానంలో దైవభక్తి గల వాటిని అభివృద్ధి చేయవచ్చు.
ఒక అలవాటును విచ్ఛిన్నం చేయడం
అలవాటును మానుకోవడం అనేది మీ ఆలోచనా విధానం. మీరు చేస్తున్న పనిని చేయకపోవడం వల్ల వచ్చే గొప్ప ప్రతిఫలం ఉందని మీరు గ్రహించాలి. దేవుని వాక్యం ద్వారా మీరు మీ మనస్సును రూపాంతరం చేసుకోవాలి.
రోమీయులకు 12:2 ఇలా చెబుతోంది, "మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి."
అలాగే, మీరు ఒంటరిగా ఈ శోధనతో పోరాడలేరని మీరు గ్రహించాలి; మీరు దేవునిపై మీ నమ్మకాన్ని ఉంచాలి మరియు ఈ భక్తిహీనమైన అలవాటును అధిగమించడానికి మరియు మంచిగా మార్చడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. ఇక్కడ నుండే ప్రార్థన అనేది మొదలవుతుంది. ప్రార్థించండి మరియు జయించడానికి ఆయన కృపకై ప్రభవును వేడుకొనండి.
చెడు అలవాట్లు ఎల్లప్పుడూ అనారోగ్యకరమైనవి మరియు ప్రమాదకరమైనవి కూడా కావచ్చు. అవి మిమ్మల్ని నీతి మార్గాముల నుండి దూరం చేయడానికి సాతాను ఉపయోగించే పరికరాలుగా మారవచ్చు. కాబట్టి క్రీస్తును వెంబడించే వారిగా, ప్రతి పాపపు పద్దతి ప్రారంభమైన వెంటనే దానిని విచ్ఛిన్నం చేయడం మీ బాధ్యత.
చివరగా, మీరు కొత్త అలవాట్లను ఏర్పరచుకోకపోతే, మీరు మీ పాతవాటికి తిరిగి వస్తాయి మరియు మీరు ఇప్పుడే సాధించిన అన్ని పురోగతి తిరస్కరించబడుతుంది. ఇది బహుశా సమయానికి కార్యాలయానికి చేరుకోవడం, నిర్ణీత సమయానికి లేవడం, నిర్ణీత సమయానికి ప్రార్థించడం లేదా సమయానికి పడుకోవడం వంటి సాధారణ విషయాలు కావచ్చు.
"కాబట్టి ఆయన ప్రార్థన చేయుటకు తరచుగా (దానిని అలవాటు చేసుకున్నాడు) అరణ్యము లోనికి వెళ్లుచుండెను." (లూకా 5:16) జనసమూహంతో చుట్టుముట్టబడినప్పటికీ, దేవుని శక్తి తన ద్వారా ప్రవహించేలా ప్రార్థన కోసం తనను తాను ఉపసంహరించుకోవడం యేసయ్య అలవాటు చేసుకున్నాడు.
దైవిక అలవాట్లు మీ జీవితాన్ని మార్చివేస్తాయి మరియు మీ చుట్టూ ఉన్నవారి జీవితాలను శాశ్వతంగా ప్రభావితం చేస్తాయి.

ఒప్పుకోలు
విడుదల
మీ చెడు అలవాట్లను ప్రభువు యొద్ద ఒప్పుకోనుడి
1. తండ్రీ, యేసు నామంలో మరియు నీ పరిశుద్దాత్మ శక్తితో, ఈ చెడు అలవాటు నా జీవితంలో కలిగి ఉన్న భయంకరమైన అదుపు నుండి నన్ను విడిపించును గాక!
2. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. యేసు నామంలో, నా జీవితం మీద ప్రతి సాతాను యొక్క ప్రభావాన్ని నేను ఆజ్ఞాపిస్తునాను, నీ పట్టును నీవు కోల్పోవును గాక.
3. తండ్రీ, యేసు నామంలో, ఈ భక్తిహీన అలవాట్ల నుండి విడుదల పొందటానికి నీ అధికారాన్ని మరియు శక్తిని నాకు దయచేయి.
4. తండ్రీ, దైవిక అలవాట్లను ఏర్పరచుకోవడానికి నాకు కృపను మరియు శక్తిని దయచేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel
Most Read
● సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి● ఎంత వరకు?
● ఆయన తరచుదనానికి అనుసంధానం (ట్యూనింగ్) అవ్వడం
● సమయానుకూల విధేయత
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #1
● ఇవ్వగలిగే కృప - 3
● కాముకత్వం మీద విజయం పొందడం
కమెంట్లు