english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కృప యొక్క సమృద్ధిగా మారడం
అనుదిన మన్నా

కృప యొక్క సమృద్ధిగా మారడం

Sunday, 18th of February 2024
0 0 991
Categories : కృప (Grace)
కృప యొక్క సరళమైన నిర్వచనం ఏమిటంటే, దేవుడు మనకు అర్హత లేని వాటిని మనకు దయచేయడం. మనము నరకము యొక్క శిక్షకు అర్హులం, కానీ దేవుడు కృపతో తన కుమారుని బహుమానంగా మనకు ప్రసాదించాడు.

"మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే" (ఎఫెసీయులకు 2:8). రక్షణ, మరియు దేవుని క్షమాపణ, ఒక ఉచిత వరము! మనము దానికి అర్హులు కాదు.

ఒకప్పుడు మనం దేవునికి శత్రువులమైనప్పటికీ, కొలొస్సయులకు 1:21,22 ప్రకారం, ఇప్పుడు, ఆయన చిందించిన రక్తం ద్వారా, మనం విడుదల చేయబడ్డాము, ఆయనతో సమాధానపరచబడ్డాము. ఆయన సిలువపై చిందించిన రక్తం ద్వారా మనకు వ్యతిరేకంగా శిక్ష మరియు మరణ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేశాడు.

ఒకరోజు, ఒక యవ్వనాడు నా దగ్గరకు వచ్చి, "నాకు ప్రభువు యొక్క సేవ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలను నేను ఇష్టపడను; అందుకే నేను దేవుని సేవించడం మానేశాను." ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే మాటలు పునరావృతమవుతున్నాయి. కానీ, ప్రభువును అంతగా ప్రేమించే వ్యక్తులు ఈ విధంగా ఎందుకు ఉంటారు అని మీరు ఆలోచిస్తున్నారా?

మనము మొదటి సారిగా ఉచితంగా పొందిన అదే కృపను ఇతరులకు అందించడంలో వైఫల్యం కారణంగా ఇది జరిగిందని నేను నమ్ముతున్నాను.

2 పేతురు 1:2 ఇలా చెబుతోంది, "మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక."

దేవుని రాజ్యంలో, ఇతరులకు పంచి ఇవ్వడం, వ్యాపించడం లేదా కుమ్మరించడం తప్ప ఏదీ విస్తరించబడదు. అది మన ప్రభువు పంచి ఇచ్చిన చేపలు మరియు రొట్టెలు కావచ్చు లేదా ఎలీషా ప్రవక్త కాలంలో విధువరాలి పాత్రలలో పోసిన నూనె కావచ్చు.

లూకా 6:38 అనేది చాలా సాధారణమైన వచనం, ఇది సాధారణంగా ఇవ్వడం గురించి వర్తించబడుతుంది. "ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను." కృపకు కూడా ఇది వర్తిస్తుంది.

ధర్మశాస్త్రం ఇలా సెలవిస్తుంది, "ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తన యొద్ద నుంచు కొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును." (నిర్గమకాండము 21:16)

ధర్మశాస్త్రం ప్రకారం, యోసేపు సహోదరులు అతన్ని బంధించి ఐగుప్తునకు అమ్మివేసినందున వారు మరణానికి అర్హులు, కానీ యోసేపు వారికి జీవితాన్ని ఇచ్చాడు.

ఆత్మ చెప్పుచున్న మాట నేను విన్నాను, "ప్రజలకు వారు అర్హులైన వాటిని ఇవ్వకండి; వారికి కావలసినవి లేదా ఆవరమయ్యే వాటిని ఇవ్వుడి." మీరు ప్రజలకు ఇవ్వాల్సిన వాటిని ఇస్తే, మీరు ధర్మశాస్త్రానికి లోబడి వ్యవహరిస్తున్నారు. కానీ మీరు ప్రజలకు అవసరమైన వాటిని ఇస్తే, మీరు కృపతో వ్యవహరిస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం క్షమాపణ అనేది లేదు. కృప ద్వారా క్షమాపణ ఉంది.

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో నీ కృప యొక్క సమృద్ధిని నా జీవితంలో విడుదల చేయి.


Join our WhatsApp Channel


Most Read
● మీ మార్గములోనే ఉండండి
● విత్తనం గురించిన భయంకరమైన నిజం
● దేవుని యొక్క 7 ఆత్మలు: యెహోవా యెడల భయభక్తులు గల ఆత్మ
● ఎవరికీ రోగనిరోధక శక్తి లేదు
● మీరు యేసు వైపు ఎలా చూచు చున్నారు?
● ప్రేమ యొక్క నిజమైన స్వభావం
● 35 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్