english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ
అనుదిన మన్నా

ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ

Saturday, 9th of March 2024
0 0 991
Categories : జ్ఞానం (Wisdom) ప్రేమ (Love)
మనల్ని ప్రేరేపించే అనేక అంశాలు ఉన్నాయి, కానీ అత్యంత శక్తివంతమైన ప్రేరణలలో ఒకటి భయం. కానీ భయం నిజంగా మంచి ప్రేరేణా? మరియు ప్రజలను ప్రేరేపించడానికి భయాన్ని ఉపయోగించడం అవసరమా?
"అగ్ని మరియు గంధకం" మీద సందేశం చెప్పడం వలన ప్రజలు మొదట పరిగెత్తవచ్చు, కానీ దీర్ఘకాలంలో, ఇది నిజంగా ప్రజలు పరిపక్వతకు కారణం కాకపోవచ్చు. బదులుగా, వారు భయం కారణంగా మాత్రమే వెనకడుగు వేయవచ్చు.

తల్లిదండ్రులుగా, అనిత మరియు నేను చాలా మంది తల్లిదండ్రుల మాదిరిగానే తరచూ సవాళ్లను ఎదుర్కొంటాము. అయితే, మేము ఇటీవల దేవుని ఆత్మచే ప్రభావితమైనట్లు భావించిన విషయం ఏమిటంటే, దీర్ఘకాలంలో మంచి ఎంపికలు చేసుకునేలా మన పిల్లలను ప్రేరేపించాలని మనం చూస్తున్నట్లయితే, భయం అనేది నిజంగా పని చేయదు.

మనం మన పిల్లలను భయం ఆధారంగా మాత్రమే ఖండిచినట్లైతే, చివరికి ఆ భయం అనేది పోవచ్చు. ఇంకా కలుపుతూ, మానవ స్వభావం ఎల్లప్పుడూ మనం ఏమి చేయకూడదని హెచ్చరించినా సరిగ్గా అదే చేయడానికి ఆసక్తిగా ప్రయత్నిస్తాడు. ఉదాహరణకు, వేడి ఇనుమును తాకవద్దని పిల్లలకి చెప్పండి; అతడు లేదా ఆమె చివరికి వెళ్లి దానినే ముట్టుకుంటారు. నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని మీరు పొందుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను?

మరోవైపు, భయం కంటే జ్ఞానం లేదా బుద్ది చాలా మెరుగైన ప్రేరణ. నేను సంఘానికి లేదా నా పిల్లలకు కూడా బోధించేటప్పుడు, ఒక నిర్దిష్ట పనిని ఎందుకు చేయాలి అనే దానిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను. దీనికి కొంత సమయం మరియు కృషిని తీసుకున్నప్పటికీ, ప్రజలు తమను తాము చూసుకునప్పుడు వినే అవకాశం ఉందని నేను తెలుసుకున్నాను. భయం స్వల్పకాలిక లాభాలను తీసుకురావచ్చు, కానీ జ్ఞానం ఎల్లప్పుడూ దీర్ఘకాలిక మరియు శాశ్వత లాభాలను తీసుకు వస్తుంది.

భయం, మరోవైపు, ఒక వ్యక్తిని హింసిస్తుంది మరియు తరచుగా ఖండిస్తుంది. అలాగే, మనము భయాన్ని ప్రేరేపణగా ఉపయోగించినప్పుడు, మీరు చూస్తున్న సమయం వరకు ప్రజలు మీ సూచనలను పాటించచవచ్చు, కానీ మీరు దాని నుండి నిష్క్రమించిన తర్వాత, వారు ముఖ్యమైనదిగా భావించే కార్యానికి తిరిగి వెళ్తారు.

2 తిమోతి 1:7 మనకు ఒక క్రైస్తవునిగా, దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నియ్యలేదు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును అని 1 యోహాను 4:18 చెబుతోంది. మీరు దేవుని ప్రేమ మరియు ఆయన నియమముపై ఎంత ఎక్కువగా దృష్టి సారిస్తే, మీరు భయాన్ని అంత మెరుగ్గా అధిగమించగలుగుతారు.

లేఖనం ఇలా సెలవిస్తుంది, "దేవుని ప్రేమికులు ఉత్తమ సలహాదారులను తయారు చేస్తారు. వారి మాటలు జ్ఞానాన్ని కలిగి ఉంటాయి మరియు అవి సరైనవి మరియు నమ్మదగినవి. (కీర్తనలు 37:30 TPT) మీరు దేవుని ప్రేమను వెంబడిస్తున్నప్పుడు, దైవ జ్ఞానం మీలో పనిచేయడం ప్రారంభిస్తుంది, అలాంటి జ్ఞానాన్ని దాటవేయలేము.

ఒప్పుకోలు
ప్రభువు నాకు వెలుగును రక్షణయు నైయున్నాడు. భయం నా మీద పనిచేయదు, ఎందుకంటే ప్రభువే నా ప్రాణదుర్గము. నేను ఇక భయపడను. యేసు నామంలో. (కీర్తనలు 27:1)


Join our WhatsApp Channel


Most Read
● మీ వైఖరి మీ ఔన్నత్యాన్ని నిర్ణయిస్తుంది
● రాజ్యంలో వినయం మరియు ఘనత
● ప్రార్థించకపోవడం యొక్క పాపం
● ఉపవాసం యొక్క జీవితాన్ని మార్చే ప్రయోజనాలు
● యేసయ్య ఎందుకు గాడిద మీద ప్రయాణించాడు?
● సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి
● 21 రోజుల ఉపవాసం: 10# వ రోజు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్