అనుదిన మన్నా
దోషానికి సంపూర్ణ పరిష్కారం
Wednesday, 13th of March 2024
0
0
584
Categories :
పాపం (Sin)
తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. (కీర్తనలు 32:1-2)
ఒక వ్యక్తికి ఒకసారి ఒక కల వచ్చింది, అందులో అతడు యేసయ్యను ఒక స్తంభానికి కట్టి, కనికరం లేకుండా కొరడాతో కొట్టడం చూశాడు. కొరడా దెబ్బతో యేసు దేహాన్ని ఎలా ముక్కలు చేస్తున్నారో ఆ వ్యక్తి చూసి తట్టుకోలేక మన ప్రభువును కొరడాతో కొట్టే వ్యక్తిని ఆపడానికి పరుగెత్తాడు. కొరడా ఝులిపిస్తున్న వ్యక్తి చేతిని పట్టుకుని, అతని ముఖం చూడటానికి తన ముఖమును ఇటు తిప్పాడు, కలలు కనే వ్యక్తికి అతని ముఖం కనిపించింది.
మన మందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు
మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను
యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. (యెషయా 53:6)
దోష సమస్యకు పరిష్కారం ఏమిటి? సమస్త దోషాలకు యేసయ్యే పరిష్కారం. "యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను" అనే మాటలను గమనించండి. మన దోష అంతటికి ఆయన సమస్తమైన మూల్యం చెల్లించాడు.
కేవలం త్యాగమే కాదు. ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని సంపూర్ణముగా మూల్యం చెల్లించడానికి పరిపూర్ణ త్యాగం అవసరం. అందుకే యేసయ్య బలిగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఇది చాలా అసంపూర్ణ వ్యక్తులను పరిపూర్ణం చేయడానికి ఒక పరిపూర్ణ వ్యక్తి చేసిన పరిపూర్ణ త్యాగం. (హెబ్రీయులకు 10:14-25)
మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను
మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. (యెషయా 53:5)
మన అతిక్రమాల కోసం యేసయ్య గాయపరచబడెను. గాయం అనేది మీ శరీరంపై సులభంగా కనిపించే విషయం. నలుగగొట్టబడటం అనేది లోపల లోతైనది. ప్రభువైన యేసయ్య మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు.
నమ్మశక్యం కాని వ్యక్తిగత మూల్యంతో, తండ్రి మన పాపల సమస్యకు పరిష్కారాన్ని కలిగి ఉన్నాడు. కానీ, ఆయన పరిష్కారాన్ని పొందడానికి లేదా తిరస్కరించడానికి మనకు ఎంపిక అనేది ఉంది. దేవుని పరిష్కారాన్ని మన జీవితాలకు అన్వయించడంలో యేసయ్య బలి పట్ల మన వ్యక్తిగత ప్రతిస్పందన చాలా కీలకమైనది.
మీరు మీ జీవితానికి దేవుని పరిష్కారాన్ని అంగీకరించి, వర్తింపజేస్తే, ఈ క్రింది వచనం మీ జీవితంలో వ్యక్తమవుతుంది.
కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్త వాయెను. (2 కొరింథీయులకు 5:17)

ప్రార్థన
ప్రభువైన యేసయ్య, నీవు దేవుని కుమారుడివని నేను నమ్ముతున్నాను. నువ్వు నా కోసం మరణించి, తిరిగి మూడో రోజు లేచావు. నన్ను కరుణించు. నా పాపాలన్నిటినీ క్షమించు. నన్ను నీ రక్తంతో శుద్దీకరించు. నా హృదయంలోకి వచ్చి నా జీవితంలోని ప్రతి రంగంపై పూర్తి బాధ్యత వహించు.
యేసుక్రీస్తు రక్తం ద్వారా, నా కుటుంబం మరియు నేను దుష్టుని చేతుల నుండి విమోచించబడ్డాము.
నా జీవితంలో, నా కుటుంబంలో పనిచేసే ప్రతి చెడు కార్యము యేసు నామంలో విచ్ఛిన్నమవును గాక.
నా అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రతి దుష్ట శక్తి యేసు నామంలో అగ్నితో కాలిపోవును గాక.
దేవుని అగ్ని, యేసు నామంలో నాకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్ట శక్తిని చెదరగొట్టబడును గాక.

Join our WhatsApp Channel
Most Read
● నమ్మే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు
● దేవుని యొక్క 7 ఆత్మలు: బలము గల ఆత్మ
● 20 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దేనికి కాదు డబ్బు
● దేవుని 7 ఆత్మలు: ప్రభువు యొక్క ఆత్మ
● విధేయత ఒక ఆధ్యాత్మిక గుణము
కమెంట్లు