అనుదిన మన్నా
ముందుగా యూదా వంశస్థులను వెళ్లనివ్వండి
Friday, 22nd of March 2024
1
0
818
Categories :
స్తుతి (Praise)
యూదాలో దేవుడు ప్రసిద్ధుడు (కీర్తనలు 76:1)
యూదా (లేదా హీబ్రూలో యెహూదా) యాకోబు యొక్క నాల్గవ కుమారుడు, అతని వారసులలో ఒకరు మెస్సీయ (ఆదికాండము 29:35; 49:8-12)
ఆసక్తికరంగా, యూదా అనే పదానికి అర్థం 'స్తుతి'. యూదాలో (స్తుతి) దేవుడు ప్రసిద్ధుడు లేదా ప్రకటించడ్డాడు.
యూదాలో దేవుడు ఆదరించబడ్డాడు (కీర్తనలు 76:1 NLT)
మనం స్తుతించినప్పుడు దేవుడు ఆదరించబడుతాడు.
యాకోబు భార్య, లేయా తన నాల్గవ కుమారుడికి యూదా అని పేరు పెట్టింది. ఎందుకొ మీకు తెలుసా?
తన భర్త యాకోబుకు ముగ్గురు కుమారులను కన్నప్పటికీ అతడు తనను ప్రేమించలేదని ఆమెకు తెలుసు. ఈ సమయంలో, ఆమె లోబడి యుండాలని నిర్ణయించుకుంది మరియు యాకోబు తన పట్ల ప్రేమ లేకపోవడాన్ని బట్టి విలపించలేదు; ఆమె ఇలా అంది: "కనిఈ సారి యెహోవాను స్తుతించెదననుకొనెను" (ఆదికాండము 29:35). ఇది యూదా పుట్టినప్పుడు జరిగింది.
యూదా దేవుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినట్లే, నేడు దేవుని హృదయంలో స్తుతి కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. స్తుతి శక్తివంతమైనది, దేవుని ఆశీర్వాదాలకు అవసరమైనది మరియు కీలకమైనది.
యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో, "యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది" యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా, యెహోవా "ఆ దేశమును యూదా వంశస్థుల కిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను." (న్యాయాధిపతులు 1:1-2)
ఇదే విషయాన్ని న్యాయాధిపతులు 20:18లో గమనించగలము, యుద్ధం జరిగినప్పుడు యూదా ముందుగా వెళ్ళాడు. ఇది మనం యుద్ధానికి ఎలా వెళ్లాలనే ప్రవచనాత్మక చిత్రము. మీరు ఎలాంటి యుద్ధంలో నాకు తెలియదు. మీరు ఒంటరిగా యుద్ధం చేయకూడదని నేను మీకు ప్రవచనాత్మకంగా సెలవిస్తున్నాను, ముందుగా యూదా వెళ్లడానికి మనము అనుమతించాలి; ముందుగా ప్రభువును స్తుతించాలి.
మీ సమస్య లేదా పరిస్థితి గురించి ప్రభువుకు ఫిర్యాదు చేస్తూ మరియు సణుగుతూ గొణుగుతూ ప్రార్థనలో ప్రవేశించవద్దు. ముందుగా యూదాను వెళ్లనివ్వండి; ముందుగా ఆయనను స్తుతించండి. మీరు గమనించండి, యూదా అతని కుటుంబంలో నాల్గవవాడు, అయినప్పటికీ దేవుని క్రమంలో, అతడు మొదటివాడు.
బహుశా మీకు దేవుణ్ణి స్తుతించాలని అనిపించకపోవచ్చు. బహుశా మీ జీవితంలో దేవుణ్ణి స్తుతించడానికి ఏమీ లేకపోవచ్చు. ఏదేమైనా ఆయనను స్తుతించండి. ఆయన సమస్త స్తుతులకు అర్హుడు.
2 దినవృత్తాంతములు 20లో, యెహోషాపాతు రాజు, ఇసుక వంటి సమూహము వంటి సైన్యాలను ఎదుర్కొన్నప్పుడు. ఈ యుద్ధం తన శక్తికి మించినదని అతనికి తెలుసు. అతడు దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఇది జరిగింది. గెలవడం అసాధ్యం అనిపించిన యుద్ధంలో ఎలా ప్రవేశించాడో తెలుసా?
వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. (2 దినవృత్తాంతములు 20:22)
మీరు ఏ యుద్ధంలో నాకు తెలియదు. బహుశా ఏదైనా అనారోగ్యం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, క్లయింట్ సమస్య కావచ్చు, కొంత సమాజపు సమస్య కావచ్చు లేదా కొన్ని దీర్ఘకాల కుటుంబ వివాదాలు కావచ్చు, మీ నోటి నుండి దేవుని స్తుతులు ముందుగా వెళ్లనివ్వండి. దేవుని స్తుతులు మీ కడుపులో నుండి జీవజల నదుల వలె పారును గాక (యోహాను 7:38). మీరు మీ పెదవుల మీద పాటతో 2024లోకి ప్రవేశిస్తారు.
దేవుని కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా క్రిస్మస్ రాత్రి ఈ భూమిపై స్తుతులతో పరిచయం చేయబడ్డాడు.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీకానవాలు; .... వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. (లూకా 2:11,13)

ప్రార్థన
తండ్రి, కుమారా మరియు పరిశుద్ధాత్మను స్తుతించడానికి NOAH యాప్‌లోని స్తుతుల విభాగాన్ని దయచేసి ఉపయోగించండి. తదుపరి 21 రోజులు ఇలా ప్రతిరోజూ చేయండి. (ఇది భవిష్యాత్మక సూచన, దీనిని విస్మరించవద్దు)
Join our WhatsApp Channel
Most Read
● మీరు ఆధ్యాత్మికంగా యుక్తముగా ఉన్నారా?● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 1
● దూరం నుండి వెంబడించుట
● 17 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీ వైఖరి మీ ఔన్నత్యాన్ని నిర్ణయిస్తుంది
● వారు చిన్న రక్షకులు
● భాషలలో మాట్లాడుట మరియు ఆధ్యాత్మికంగా విశ్రాంతి పొందడం
కమెంట్లు