అనుదిన మన్నా
సర్వశక్తిమంతుడైన దేవునితో కలుసుకోవడం
Friday, 29th of March 2024
0
0
634
Categories :
దేవునితో సాన్నిహిత్యం (Intimacy with God)
అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. (2 కొరింథీయులకు 12:9)
దానియేలుకు ఒక దర్శనం లభించింది, అది అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. అతనికి ఈ దర్శనం గురించి అవగాహన కావాలి, కాబట్టి అతను మూడు వారాల పాటు ఉపవాసం ద్వారా దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి బయలుదేరాడు. అతని మూడు వారాల ఉపవాసం మూడు రోజుల తర్వాత, దేవుని దూత దానియేలుకు కనిపించాడు. మొదటి రోజు నుండి పరలోకం తన ప్రార్థనను విన్నదని దూత వివరించాడు, అయితే దేవదూత దానియేలు వద్దకు రాకుండా దేవుని దూతని అడ్డుకోవడానికి మరియు ఆపడానికి ప్రయత్నించిన దుష్ట దూత, పర్షియా యువరాజు రాకుండా తాత్కాలికంగా అడ్డుకున్నాడు.
మన జీవితాల్లో మన పూర్ణ హృదయాలతో దేవుణ్ణి వెదకడానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవలసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సమయాల్లోనే మనం ఇంతకు ముందెన్నడూ అనుభవించని విధంగా పరలోకం నుండి స్వరం వినబడుతుంది. ప్రార్థనలో దానియేలు యొక్క పట్టుదల పరలోకముతో వ్యక్తిగత సమావేశం యొక్క వరము పొందాడు. అయితే, దేవుని నుండి పొందడానికి, దానియేలు ఒంటరిగా ఉండవలసి వచ్చింది, అతని బలం చాలలేదు మరియు నిస్సహాయ స్థితిలో ఉంచబడ్డాడు. పరలోకాని లేదా మన చుట్టూ ఉన్న సంఘటనలను కదిలించే సామర్థ్యం మనకు లేనప్పుడు, మనం పరలోకం నుండి వినగలిగే స్థితిలో ఉంటాము. మన మానవత్వం మరియు మన బలహీనత యొక్క అంగీకారమే సజీవమైన దేవునితో వ్యక్తిగతంగా కలుసుకునే స్థితిలో మనల్ని ఉంచుతుంది.
అపొస్తలుడైన పౌలు మహాజ్ఞాని, అయినప్పటికీ అతని ద్వారా ఏమి జరుగుతుందో అది దేవుని సామర్థ్యమే అనే రహస్యాన్ని అతను అర్థం చేసుకున్నాడు. అతడు తరచూ అనుభవించాల్సిన ఇబ్బందులు మరియు వేధింపుల గురించి ఫిర్యాదు చేయలేదు, కానీ దేవుని పట్ల తనకున్న మక్కువను రగిలించడానికి వాటిని ఇంధనంగా ఉపయోగించడంలో ఆశ్చర్యం లేదు.
ఈరోజు మీకు దేవునితో వ్యక్తిగతంగా కలుసుకోవడం అవసరమా?
మీ తరపున దేవుడు కలుగ చేసుకోవడం అవసరం ఉందా? మీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకండి. మీరు గంభీరంగా ఉన్నారని ఆయనకి తెలియజేయండి. ఈ జీవితంలోని ఒత్తిళ్లు మిమ్మల్ని దేవుని నుండి దూరం చేయనివ్వకండి, కానీ అవి మిమ్మల్ని ఆయనతో మరింత ప్రేమగా అంటిపెట్టుకునేలా చేయనివ్వండి. దేవునితో మాత్రమే ఉండండి మరియు ఆయన ముందు మీ నిస్సహాయ స్థితిని గుర్తించండి. ఆయన తన శక్తివంతమైన సన్నిధితో మీకు ప్రతిఫలమిస్తాడు. మీ కన్నీళ్లే మీ అద్భుతకార్యములకు బీజం.
ప్రార్థన
తండ్రీ, నేను నిన్ను వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకుంటున్నాను. నేను శాశ్వతంగా మార్పు చెందేలా నీ యందు తాజా దర్శనం కావాలని కోరుకుంటున్నాను. నా సహాయం నీ నామమే. జీవితంలోని ఒత్తిళ్ల కారణంగా నేను నీ నుండి దూరంగా ఉండకుండా ఉండనీవు, కానీ నేను నిన్ను మరింత ప్రేమగా అంటిపెట్టుకునేలా చేయి, యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● తన్నుతాను మోసపరచుకోవడం అంటే ఏమిటి? - I● క్షమించటానికి క్రియాత్మక పద్ధతులు
● ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుట యొక్క రహస్యాలు
● మీరు ఒక ఉద్దేశ్యం కొరకై జన్మించారు
● ఒక మాదిరిగా (ఉదాహరణ) ఉండండి
● నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?
● 21 రోజుల ఉపవాసం: 16# వ రోజు
కమెంట్లు