అనుదిన మన్నా
ప్రవచనాత్మకంగా అంత్య దినాలను విసంకేతనం చేయడం
Wednesday, 10th of April 2024
0
0
520
Categories :
అంత్య దినాలు (Endtimes)
క్రీస్తు విరోధి అంటే ఏమిటి?
"విరోధి" అనే పదానికి విరుద్ధమైన లేదా వ్యతిరేకం అని అర్థం. కాబట్టి క్రీస్తుకు సంబంధించిన దేనినైనా పాకులాడి విరోధించే వాడు క్రీస్తు విరోధి; అతని సందేశం, అతని వ్యక్తిత్వం, అతని స్వభావం, అతని పనులు మొదలైనవి.
'క్రీస్తు విరోధి (The Anti-Christ)' మరియు 'ఒక క్రీస్తు-విరోధి (an anti-Christ)' మధ్య తేడాలు.
చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి యున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము. (1 యోహాను 2:18)
ఇప్పుడు 'క్రీస్తు విరోధి (The Anti-Christ)' మరియు 'ఒక క్రీస్తు-విరోధి (an anti-Christ)' మధ్య వ్యత్యాసం ఉంది
మొదటిదానిలో పెద్ద 'A' మరియు రెండవదానిలో చిన్న 'a'ని గమనించండి.
ఇక్కడ అపొస్తలుడైన యోహాను 'క్రీస్తు విరోధి (The Anti-Christ)' మరియు 'ఒక క్రీస్తు-విరోధి (an anti-Christ)' మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపాడు. "ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి యున్నారు" అనే వాక్యాన్ని గమనించండి.
అపొస్తలుడైన యోహాను ఇంకా చెబుతూ, "యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి." (1 యోహాను 2:22)
కాబట్టి, యేసు క్రీస్తు (దేవుని అభిషిక్తుడు) అని ఒప్పుకొనని వ్యక్తి 'క్రీస్తు విరోధి' యొక్క సామాన్యమైన లక్షణం.
అపొస్తలుడైన యోహాను ఇంకా చెబుతూ, ఎవరైతే యేసయ్యను క్రీస్తుగా లేదా మెస్సీయగా ఒప్పుకున్నరో, తండ్రిని కుమారుని ఒప్పుకొనని ఈ వ్యక్తి మరియు అలాంటి వ్యక్తులు క్రీస్తు విరోధులు. యోహాను కాలంలో ఉన్నట్లే ఈనాడు కూడా అనేక క్రీస్తు విరోధులు ఉన్నారు. ఈ విషయంలో మనం మోసపోకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు: హిట్లర్ 'క్రీస్తు విరోధి'.
ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "నా పక్షమున నుండనివాడు నాకు విరోధి (వాడే విరోధి)" (మత్తయి 12:30) మీరు క్రీస్తు కోసం కాకపోతే, మీరు క్రీస్తుకు విరోధి - 'ఒక క్రీస్తు విరోధి'.
కాబట్టి 'ఒక క్రీస్తు-విరోధి (an anti-Christ)' అనేవాడు 'క్రీస్తు విరోధి (The Anti-Christ)' తో సమానం కాదని స్పష్టమవుతుంది.
క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. (2 థెస్సలొనీకయులకు 2:3)
అపొస్తలుడైన పౌలు ఆ వ్యక్తి 'పాప పురుషుడు' లేదా ధర్మ విరోధి’ మరియు 'నాశన పాత్రుడు లేదా భ్రష్టత్వము సంభవించిన నాశన పురుషుడు' అని చెప్పాడు. క్రీస్తు విరోధి అనేవాడు భూమి మీద ప్రతి ఒక్కరి సమాచారము కలిగి ఉన్న సూపర్ కంప్యూటర్ అని కొందరు బోధిస్తారు. ఇది సరిదిద్దవలసిన లోపం. క్రీస్తు విరోధి ఒక మనిషి అని బైబిలు స్పష్టంగా చెబుతోంది.
అపొస్తలుడైన పౌలు మనలను "ధర్మ విరోధి" గురించి హెచ్చరించాడు, వాడే క్రీస్తు విరోధి (2 థెస్సలొనీకయులకు 2:3, 8-9). ఈ పురుషుడు తప్పుడు సూచకక్రియలు మరియు మహత్కార్యములు చేస్తాడు మరియు భవిష్యత్తు ప్రతిక్రియ కాలంలో చాలా మందిని మోసం చేస్తాడు (2 థెస్సలొనీకయులకు 2:9-10). అపొస్తలుడైన యోహాను ఈ పురుషుడుని ప్రకటన గ్రంథంలో "క్రూరమృగము" అని వర్ణించాడు. (ప్రకటన 13:1-10)
ఈ సాతాను-ప్రేరేపిత పురుషుడు ప్రతిక్రియ కాలంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటాడు, ప్రారంభంలో ఇశ్రాయేలుతో శాంతి ఒప్పందం చేసుకుంటాడు (దానియేలు 9:27). కానీ అతడు ప్రపంచాన్ని ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తాడు, అబద్దాలు చెప్పి, యూదులను నాశనం చేయడానికి, విశ్వాసులను హింసించడానికి మరియు తన స్వంత రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తాడు (ప్రకటన 13). అతడు తనకు తానే తాను మహిమపరచుకోవడంలో హెచ్చించుకొనుచు మరియు తాను దేవుడనని తన్ను కనుపరచుకొంటాడు (2 థెస్సలొనీకయులకు 2:4).

ప్రార్థన
తండ్రీ, నీ ఆత్మ మరియు వాక్యము ద్వారా నన్ను శారీరికంగా మరియు ఆత్మీయంగా అంత్య దినానికి సిద్ధం చేయి.
Join our WhatsApp Channel
Most Read
● దేవుని వాక్యాన్ని చదవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు● మీ నిజమైన విలువను కనుగొనండి
● భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - I
● సంఘానికి సమయానికి ఎలా రావాలి
● శీర్షిక: అదనపు సామాను వద్దు
● మూల్యం చెల్లించుట
● దేవదూతల సైన్యం మన పక్షమున ఉన్నారు
కమెంట్లు