అనుదిన మన్నా
దర్శనం మరియు ప్రత్యక్షతకి మధ్య
Sunday, 14th of April 2024
1
0
418
Categories :
దైవ దర్శనం (Divine Visitation)
యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారానుగూర్చి చేసెను. (ఆదికాండము 21:1)
"ఆయన (యెహోవా) చెప్పిన ప్రకారముగా", "ఆయన (యెహోవా) తానిచ్చిన మాట చొప్పున" అనే పదబంధాలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను.
లేఖనాలు దేవుని లక్షణాన్ని గురించి సూచిస్తున్నాయి, "దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?" (సంఖ్యాకాండము 23:19) దేవుడు ఏదైనా చేయడం గురించి మాట్లాడినప్పుడు ఆయన దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడని మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
అయితే, మీరు తెలుసుకోవలసిన ఒక విషయం ఉంది. ఇది మీరు తెలుసుకోవాలని నేను కోరుకునే చక్కటి పాఠము. దర్శనం మరియు ప్రత్యక్షత మధ్య, ఎల్లప్పుడూ ఒక కాల వ్యవధి ఉంటుంది. కొందరికి ఈ కాల వ్యవధి తక్కువగా ఉండవచ్చు మరియు కొందరికి కొంచెం ఎక్కువ సమయం ఉండవచ్చు. నేను వివరిస్తాను.
శారా గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆలోచనలు ఆమె మనసును మబ్బుగా మార్చేందుకు ప్రయత్నించాయి. "చాలా కాలం తర్వాత నాకు ఈ బిడ్డ పుట్టాడు, ఒకవేళ నేను బిడ్డను పోగొట్టుకున్నట్లైతే ఏమి జరుగుతుంది?" ఆమె అద్భుతకార్యము ఇంకా ప్రత్యక్షత పరచబడలేదు మరియు ఆమె ఇంకా ప్రక్రియలో ఉంది. దీనినే కనిపెట్టుకొని ఉండే కాల వ్యవధి అంటారు. ఎవరూ కనిపెట్టుకొని ఉండటానికి ఇష్టపడరు.
కనిపెట్టుకొని ఉండే ఈ కాల వ్యవధిలో మనం ఏమి చేయగలము?
"ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము." (కీర్తనలు 27:14 NLT) ఇలా శారా కూడా చేసి ఉంటుందని నేను నమ్ముతున్నాను మరియు మనం కూడా ఇలా చేయాలి.
మనమందరం కనిపెట్టుకొని ఉండే సమయాలను అనుభవిస్తాము. ఆ సమయాలలో, మనకు ఒక ఎంపిక ఉంటుంది: మన గురించి మనం జాలిపడవచ్చు మరియు భయం మరియు నిరాశ మనల్ని నియంత్రించడానికి అనుమతించవచ్చు, లేదా మనం దేవుణ్ణి విశ్వసించవచ్చు మరియు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన ఏమి చేస్తున్నాడో చూడవచ్చు.
శారా లాగా మనం కనిపెట్టుకొని ఉండే కాలంలో దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. హెబ్రీయులకు 11:11 ఇలా సెలవిస్తుంది, "విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను."
లేఖనం విశ్వాసం గురించి మాట్లాడినప్పుడల్లా, అది ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి సంబంధించి ఉంటుంది. శారా యెహోవా చెప్పిన మాటకు కట్టుబడి ఉంది. యెహోవా చెప్పిన దాని గురించి ఆమె పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండేది. మనం చేయవలసింది కూడా ఇదే.

ప్రార్థన
తండ్రీ, నీవు నమ్మదగినవాడవు. నా అవసరాలను తీర్చడంలో నీ సృజనాత్మకత మరియు వనరులను నేను ఎప్పటికీ అనుమానించనని అందుకు నాకు నీ కృపను దయచేయి. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● ఆరాధన యొక్క పరిమళము● ప్రారంభ దశలో దేవుణ్ణి స్తుతించండి
● ఆత్మలో తీవ్రతతో ఉండుట
● రాజ్యానికై మార్గాన్ని స్వీకరించడం
● ఆధ్యాత్మిక విధానాలు: సహవాస విధానము
● శీర్షిక: కొంత మట్టుకు రాజి పడటం
● 25 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
కమెంట్లు