english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3
అనుదిన మన్నా

వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3

Sunday, 28th of April 2024
0 0 809
Categories : వాతావరణం (Atmosphere)
మనము వాతావరణాల గురించి నేర్చుకుంటున్నాము. ఈ రోజు, మనము వాతావరణంలో అంతర్దృష్టులను పొందేందుకు మన అన్వేషణలో కొనసాగుదాం.

తరచుగా నన్ను అడిగే ప్రశ్నలలో ఒకటి, "మనం వాతావరణాన్ని సిద్ధం చేయగలమా?" సమాధానం "అవును". దీని కోసం, మన ముందున్న మరియు ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసయ్య నుండి మనం నేర్చుకోవాలి. (హెబ్రీయులకు 6:20, 1 పేతురు 2)

ప్రభువైన యేసయ్య, తన కుమార్తెను స్వస్థ పరిచేందుకు యాయీరు ఇంటికి వెళుతుండగా, ఆమె ఇక లేదనే వార్త అందుకున్నాడు. "యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో (యాయీరుతో)చెప్పెను. యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. (లూకా 8:50-54)

యేసయ్య చిన్న అమ్మాయిని తిరిగి బ్రతికించకముందే, అపహాస్యం చేసే వారందరినీ బయటకు పంపివేసాడు. ఆయన ఒక అద్భుతం కోసం వాతావరణాన్ని సిద్ధం చేశాడు.

అపహాస్యం చేసే వారందరినీ మనం మౌనం చేయలేకపోయినా, మన జీవితం నుండి మనం ఖచ్చితంగా గర్వం, క్షమించరానితనం మొదలైనవాటిని బయట పెట్టగలము. ఒకరి కోసం ప్రార్థించే ముందు, మీరు వారిని పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలోకి నడిపించాలి మరియు యేసయ్యను వారి రక్షకునిగా స్వీకరించారని నిర్ధారించుకోండి. అలాగే, మీరు ఎవరితోనైనా కలిసి ప్రార్థించినప్పుడు, మీరు ఆరాధనలో కొంత సమయాన్ని వెచ్చించాలని నిర్ధారించుకోండి మరియు దాని తరువాతే విజ్ఞాపన ప్రార్థనలో ప్రారంభించండి, ఇది మీ హృదయాలను ఆయన ఆత్మతో ఏకం చేస్తుంది.

అపొస్తలుడైన పేతురు తన ప్రభువు మరియు స్వామి అయినా - ప్రభువైన యేసుక్రీస్తు నుండి అద్భుతాలకు వాతావరణాన్ని సిద్ధం చేసే రహస్యాన్ని నేర్చుకున్నాడు.

దొర్కా అనే స్త్రీ కోసం ప్రార్థించమని అతన్ని పిలిచినప్పుడు,"పేతురు అందరిని (ప్రజలను) వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థన చేసి శవమువైపు తిరిగి "తబితా, లెమ్మనగా" ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను." (అపొస్తలుల కార్యములు 9:40)

పేతురు, యేసుప్రభువు వలె, ఆటంకాలను తొలగించడం ద్వారా అద్భుతాల కోసం వాతావరణాన్ని సిద్ధం చేశాడు. మనం కూడా దీని నుండి నేర్చుకుని, స్వామి నుండి మరియు ఆయన గొప్ప అపొస్తలుల అడుగుజాడల్లో నడవగలము.

మరో సత్యాన్ని పంచుకోవడానికి నన్ను అనుమతించండి.
"పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీ కిచ్చెదను, నీవు భూలోక మందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోక మందు దేని విప్పుదువో అది పరలోక మందును విప్పబడును." (మత్తయి 16:19)

పరలోకపు ప్రదేశాలలో ఉన్న దుష్టాత్మలను బంధించే శక్తిని దేవుడు మనకు ఇచ్చాడు. ఒక ప్రదేశంలో ప్రార్థించే ముందు, మనం యేసు నామంలో అధికారాన్ని తీసుకోవాలి మరియు ప్రతి అవరోధాన్ని, ప్రతి అడ్డంకిని మరియు అద్భుతాలను వ్యక్తపరచకుండా నిరోధించే ప్రతి దుష్ట శక్తిని బంధించాలి. ఈ విధంగా మీరు అద్భుతాల కోసం వాతావరణాన్ని సిద్ధం చేయగలరు.
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నేను నాకు మరియు నా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మా అభివృద్ధిని పొందుకోకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకార శక్తులను బంధిస్తాను. నేను నా జీవితం మరియు కుటుంబం మీద విడుదల మరియు కృపను పలుకుతున్నాను. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● మీ మనసును పోషించుడి
● 24వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మోసపూరిత లోకములో విచక్షణ సత్యం
● ప్రాణముకై దేవుని ఔషధం
● జీవన నియమావళి
● లోకమునకు ఉప్పు
● ఆయన దైవ మరమ్మతు దుకాణం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్