english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఉత్తమము మంచి వాటికి శత్రువు
అనుదిన మన్నా

ఉత్తమము మంచి వాటికి శత్రువు

Wednesday, 1st of May 2024
0 0 855
Categories : పిలుపు (Calling)
ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; అయితే మేము ప్రార్థన యందును వాక్యపరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. (అపొస్తలుల కార్యములు 6:1-4)

ఆదిమ సంఘం వేగంగా విస్తరిస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఏదైనా సంస్థ వలె, పరిపాలన సమస్యలను క్రమబద్ధీకరించడం చాలా అవసరం. ఈ విషయంలో విధవరాండ్రలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు.

ఇక్కడ విధవరాండ్రలకు భోజనం పెట్టడం మంచి విషయమే. కాబట్టి అపొస్తలులు దానికి కట్టుబడి ఉన్నారా? లేరు! వారు దేని కోసమైతే పిలువబడ్డారో అది వారికి ఖచ్చితంగా తెలుసు. సువార్తను వ్యాపింప జేయడం - జీవితంలో వారి ఉద్దేశ్యం వారికి ఖచ్చితంగా బాగా తెలుసు. వారు తమ సమయాన్ని ఉత్తమమైన విషయానికి కేటాయించారు - వాక్యం మరియు ప్రార్థన మరియు వారికి బాధ్యతలను అప్పగించారు లేదా వారి కోసం చేయగలిగిన వారిని కోరుకున్నారు.

ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది? "దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి." (అపొస్తలుల కార్యములు 6:7) మంచి విషయాలు మిమ్మల్ని ఉత్తమ విషయాల నుండి దూరంగా ఉంచుతున్నాయా? గుర్తుంచుకోండి, మంచి విషయాలు ఉత్తమమైన వాటికి శత్రువు. 

ఒక దీపస్తంభ రక్షకుడు లైట్‌హౌస్‌లో దీపమును మండేలా చేయడానికి ప్రతి నెలా కొత్త నూనెను సరఫరా చేసేవాడు. ఒక రాత్రి, ఒక పేద స్త్రీ అతనిని కొంచెం నూనె అడిగింది. ఈ పద్ధతిలో, ఎవరైనా లేదా మరొకరు నూనె కోసం అడగటానికి వచ్చారు. ప్రతి విన్నపము మంచివి మరియు చట్టబద్ధమైనవిగా అనిపించినందున, దీపస్తంభ రక్షకుడు ఎవరినీ తిరస్కరించలేదు మరియు అందరికీ నూనెను అందించాడు.

ఒక సాయంత్రం అరుదుగా నూనె మిగిలిపోయింది, రాత్రికి అంతా అయిపోయింది. ఆ రాత్రి అనేక ఓడలు ధ్వంసమయ్యాయి మరియు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఈ కేసును విచారించినప్పుడు, ఆ వ్యక్తి క్షమించమని చెప్పాడు, అయితే 'నేను ఆ నూనెతో మంచి పనులు చేసాను' అని చెబుతూనే ఉన్నాడు. ప్రధాన న్యాయమూర్తి ఏం సమాధానం చెప్పాడో తెలుసా? "ఆ దీపము వెలింగిచబడటానికి - నీవు ఒక ప్రయోజనం కోసం నూనెను ఇచ్చావు. నీవు విఫలమయ్యావు."

మీ పిలుపు ఏమిటి? మీరు మీ పిలుపును కడ ముట్టిస్తున్నారా లేదా మీరు ఏదో చేయవలసి ఉన్నందున మీరు ఏదో చేస్తున్నారా? ఈ జీవితంలో మీ ఉద్దేశ్యం ఏమిటి - జీవించడం మాత్రమేనా? కుక్కలు, పిల్లులు కూడా జీవిస్తున్నాయి. ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్దేశ్యం ఉండాలి.

"అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు" అని యేసు ప్రభువు చెప్పాడు. (లూకా 10:42)

ప్రార్థన
ప్రభువా, నా జీవితంలోని ప్రతి రోజు నిన్ను వెతకడానికి, నీ సౌందర్యమును చూడడానికి మరియు నీ ఆలయంలో నివసించడానికి నాకు నీ కృపను దయచేయాలని నేను నిన్ను వేడుకుంటున్నాను. యేసు నామంలో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● ఉగ్రతపై ఒక దృష్టి వేయుట
● ప్రార్థన యొక్క పరిమళము
● ప్రభువు యొద్దకు తిరిగి వెళ్దాం
● నూతనముగా మీరు
● విత్తనం యొక్క శక్తి - 3
● మిమ్మల్ని అడ్డుకునే పరిమిత నమ్మకాలు
● ప్రేరేపించే జ్ఞానం (బుద్ది) మరియు ప్రేమ
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్