english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఇవ్వగలిగే కృప - 3
అనుదిన మన్నా

ఇవ్వగలిగే కృప - 3

Tuesday, 21st of May 2024
0 0 649
Categories : ఇవ్వడం (Giving)
4. ఇవ్వడం వల్ల ఆయన పట్ల మనకున్న ప్రేమ పెరుగుతుంది
ఒక వ్యక్తి క్రీస్తును తన రక్షకునిగా స్వీకరించినప్పుడు, అతడు ప్రభువు పట్ల "మొదటి ప్రేమ" యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడు. అతడు దేవుని బిడ్డ అని దేవుని ఆత్మ తన ఆత్మతో సాక్ష్యమిస్తుంది (రోమీయులకు ​​8:16 చూడండి), మరియు ఈ కొత్త సాంగత్యం గొప్ప ఆనందాన్ని మరియు స్వేచ్ఛను తెస్తుంది.

దురదృష్టవశాత్తు, చాలా మంది క్రైస్తవులు తమ అనుదిన అవసరాలను తీర్చుకోవడానికి దేవుని మీద ఆధారపడనప్పుడు ఈ మొదటి ప్రేమ నుండి దూరమైపోయారు. తమ సామర్థ్యాలు, ప్రతిభే తమకు విజయాన్ని అందిస్తున్నాయని వారు భావిస్తుంటారు.

ప్రభువైన యేసయ్య ఎఫెసులో ఉన్న సంఘంతో మాట్లాడినప్పుడు ఈ సమస్యను గురించి ప్రస్తావించాడు. యేసు ఇలా అన్నాడు: "అయినను మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము" (ప్రకటన 2:4-5).

మూడింతల ఆదేశాన్ని గమనించండి
1. జ్ఞాపకము చేసుకొని
2. మారు మనస్సు పొంది
3. మొదటి క్రియలను చేయుము

మారు మనస్సు పొందుకోవడం అనేది మనస్సు, హృదయం మరియు దిశలో మార్పును కలిగి ఉంటుంది. దేవుని పట్ల పూర్ణ హృదయపూర్వకమైన ప్రేమ నుండి మీ దృష్టిని మళ్లించిన ఆలోచనలు, వైఖరులు మరియు కార్యములను విడిచిపెట్టండి. దేవుని క్షమాపణ పొందుకోండి మరియు మీ విశ్వాసం యొక్క "మొదటి క్రియలను" చేయడానికి మీ నిబద్ధతను పునరుద్ధరించండి.

మొదటి క్రియలు అంటే ఆరాధన, ప్రార్థన, బైబిలు అధ్యయనం చేయడం, ఇవ్వడం, ఉపవాసం మరియు ఇతరులకు సేవ చేయడం వంటి అనేక "ముఖ్యమైన ప్రయత్నాలను" సూచిస్తాయి. ఈ ప్రతి క్రియలు ప్రభువుతో మన సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది.

మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎప్పటికీ మారదు కానీ అవును, ఇవ్వడం వల్ల ఆయన పట్ల మనకున్న ప్రేమ పెరుగుతుంది. ఒకటే సిధ్ధాంతం, "నీ ధన మెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును." (మత్తయి 6:21)

5. ఇవ్వడం వల్ల మీ యెడల కృప పెరుగుతుంది
"మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు" (2 కొరింథీయులకు 9:8)

పొందుకునే వారి కంటే ఇచ్చేవారి వారి యెడల కృప ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ ఇస్తే, మీరు మంచి పనులలో ఎదగడానికి దేవుడు తన కృపను మీ యెడల ఎక్కువగా విస్తరింపచేయగలడు.

6. ఇవ్వడం వల్ల మీ నీతిఫలములను స్థిరపరుస్తుంది
మీరు ఇవ్వడం వల్ల మరొక కార్యం జరుగుతుంది అది ఏమిటంటే, అది మీ నీతిఫలములను స్థాపించడానికి సహాయపడుతుంది: "విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగల వారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధి పొందించును" (2 కొరింథీయులకు 9:10).

క్రైస్తవులుగా మన జీవితాలు మన పరలోకపు తండ్రి స్వభావమును వర్ణించాలి, ఆయన తన అద్వితీయ కుమారుడు యేసయ్యను మన రక్షణ కొరకు ఇచ్చాడు: "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16).

ఈ దీవెనలను పరిగణనలోకి తీసుకోండి, పొందుకోవడం కంటే ఇవ్వడం ఎక్కువ ఆశీర్వాదం అని మీరు నాతో ఏకీభవిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను (అపొస్తలుల కార్యములు 20:35).
ప్రార్థన
విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయ చేయు దేవుడు నాకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, నా ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగల వారగునట్లు, నా నీతిఫలములు వృద్ధి పొందును గాక. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఎంత వరకు?
● మీరు అసూయను ఎలా నిర్వహిస్తారు
● రక్తంలోనే ప్రాణము ఉంది
● గొప్ప క్రియలు
● ఐదు సమూహాల ప్రజలను యేసు అనుదినము కలుసుకున్నారు #3
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #2
● ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్