english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. విశ్వాసంతో నడవడం
అనుదిన మన్నా

విశ్వాసంతో నడవడం

Sunday, 26th of May 2024
0 0 1122
Categories : విశ్వాసం (Faith)
"వెలి చూపువలన కాక విశ్వాసము వలననే నడుచు కొనుచున్నాము." (2 కొరింథీయులకు 5:7)

లేఖనం అనేది విశ్వాసం ద్వారా దేవునితో నడిచిన వ్యక్తుల జాబితా. హనోకు, అబ్రహాము, హన్నా, దావీదు, హిజ్కియా, దానియేలు, ముగ్గురు హీబ్రూ పురుషులు, ఇంకా చాలా మంది. వారు అసాధారణమైన వ్యక్తులు కాదు, పరిపూర్ణ విశ్వాసం మరియు లోబడటం ద్వారా దేవుణ్ణి తమ ఏకైక జీవనోపాధిగా భావించిన సాధారణ వ్యక్తులు. తమలో ఎలాంటి సందేహాల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వారు దేవుణ్ణి ఎక్కువగా విశ్వసించారు.

విశ్వాసంతో నడుచుకోవడమంటే దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచడం మరియు ఆయన చిత్తానికి మరియు ఆజ్ఞలకు కట్టుబడి ఉండడం. ఇది ఉద్దేశపూర్వకంగా మన జీవితాల మీద ఆయనకు పూర్తి నియంత్రణను ఇవ్వడం. అబ్రాహాము జీవితాన్ని గమనించనట్లైతే, విశ్వాసం మానవుడు ఎలా ఉండాలో నుండి దేవుడు కోరుకునే విధంగా ఎలా మార్చగలదు దానిని బట్టి ఆది మనకు సహాయం చేస్తుంది. అబ్రాము ఇతర బైబిలు పాత్రల మాదిరిగానే మనకు పరిచయం చేయబడ్డాడు, కానీ నిర్ణీత క్షణం వచ్చినప్పుడు: దేవుడు అతను ఉన్న చోటి నుండి అతనికి చూపించే నూతన దేశానికి వెళ్లమని అతనితో మాట్లాడాడు. నమ్మకానికి చిహ్నంగా, అతని పేరు అబ్రాహాముగా మార్చబడింది.

అతడు తనకు బాగా తెలిసిన ప్రదేశం నుండి అతనికి కూడా తెలియని ప్రదేశానికి పిలువబడ్డాడు, కానీ అతడు ఆజ్ఞను పాటించాడు!అతడు చిరునామా లేదా వివరణలను అడగలేదు; అతడు దేవుని ముందు తన ప్రణాళికలు మరియు ఆశయాలను కూడా ఉంచలేదు. అతడు కేవలం ఆజ్ఞను పాటించాడు!

ఈ రోజు దేవుడు మన నుండి ఈ స్థాయి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. మన జీవితంలో మనం నడపటం మానేసి, ఆయనకు నడపటానికి ఇచ్చే స్థితికి రావాలి! ఆయన కొందరికే మాత్రమే ప్రభువు కాదు; ఆయన అందరికీ ప్రభువు లేదా అస్సలు ప్రభవు కాదు. మనం అన్నిటికి ఆయనను విశ్వసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నా, మనం ఏమి చేస్తున్న మరియు ఎలా చేస్తున్న, విశ్వాసంతో నడవడం అంటే ఇదే. విశ్వాసం ద్వారా నడవడం అంటే సందేహాలు లేదా సంకోచం లేకుండా దేవుని సూచనలను అనుసరించడం. క్రైస్తవులకు, విశ్వాసం ద్వారా నడవడం ఒక ఎంపిక కాదు; అది ఒక అక్కర లేదా అవసరం.

హెబ్రీయులకు 11:6లో బైబిలు ఇలా సెలవిస్తుంది: "విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా." మన క్రైస్తవ నడకలో (జీవితంలో) విశ్వాసం తప్పనిసరి అనే వాస్తవానికి ఇది ఒక సూచన. దేవుడు ఇప్పుడు మనతో భౌతికంగా లేడు, కానీ ఆయన వాక్యం ద్వారా ఆయన శక్తి సామర్థ్యాల గురించి మనకు తెలుసు.

కాబట్టి, మనం దేవునిని నిజంగా వెంబడించగల ఏకైక మార్గం విశ్వాసం. మనం ఆయనను విశ్వసించకపోతే, మనం ఆయన వైపు చూడలేము; మనం ఆయన మీద ఆధారపడకపోతే, ఆయన మనకు సహాయం చేయలేడు. ఇది చాలా సులభం! మీరు దేవునితో మీ నడక మరింత స్నేహపూర్వకంగా మరియు ఫలవంతమైనదిగా చూడాలనుకుంటే, మీరు ఆయన మీద ఆధారపడాలి మరియు ఆయన వాక్యం మీద నమ్మకం ఉంచాలి. మీరు తప్పక "ధర్మశాస్త్ర గ్రంధమును పరిశోధించాలి...." మీ జీవితం ఆయన వాగ్దానాలు మరియు సిద్ధాంతాలచే పరిపాలించబడాలి.
ప్రార్థన
తండ్రీ దేవా, విశ్వాసంతో స్థిరంగా నడవడానికి నాకు సహాయం చేయండి. నీ వాక్యం మీద పూర్తిగా విశ్వసించడం మరియు నీ కృపపై ఆధారపడటం నాకు నేర్పుము. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఇవ్వగలిగే కృప – 1
● 22వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● వాక్యం యొక్క సమగ్రత
● ఉత్తమము మంచి వాటికి శత్రువు
● ఎంత వరకు?
● మీరు ఇంకా ఎందుకు వేచి ఉన్నారు?
● 21 రోజుల ఉపవాసం: 7# వ రోజు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్