అనుదిన మన్నా
విశ్వాసంలో దృఢంగా నిలబడడం
Thursday, 30th of May 2024
0
0
466
Categories :
విశ్వాసం (Faith)
మరియు అబ్రాహాము విశ్వాసము నందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్య మైనట్టును, శారాగర్భమును మృతతుల్య మైనట్టును ఆలోచించెను గాని, అ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమ పరచెను. (రోమీయులకు 4:19-20)
విశ్వాసం యొక్క ప్రతి పరీక్ష యొక్క సారాంశం విశ్వాసాన్ని పెంచడం. దేవుడు మనుష్యులను పరీక్షిస్తాడు, తద్వారా ఆయన వారిని విశ్వాసంలో బలపరుస్తాడు, వారిని స్థిరంగా ఉంచడానికి మరియు పరిస్థితులలో సులభంగా పడిపోకుండా చేస్తాడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మరియు తుఫానుల వల్ల మీరు తరచుగా అల్లాడిపోతున్నారా? మీరు కష్టాలు మరియు సవాళ్ల గుండా వెళుతున్నప్పుడు, ఆయన మీద మీ విశ్వాసం బలపడుతుందని దేవుడు ఆశిస్తున్నాడు.
అబ్రాహాము ఎదుర్కొన్న సవాళ్లు మరియు లోకం అతని మీద నిరుత్సాహం చూప్పినప్పటికీ అతడు తన జీవితంలో దేవుని వాగ్దానాన్ని వమ్ము చేయలేదని మన ముఖ్య వచనం మాట్లాడుతుంది. అతడు దేవుని పట్ల తన విశ్వాసంలో బలంగా ఉండి, స్తుతి మహిమ ఆయనకే చెల్లించాడు. యోబు కూడా అందుకు భిన్నంగా లలేడు. తన పిల్లలు, ఆస్తులు మరియు సంపదను కోల్పోయిన తరువాత, అతడు ఇప్పటికీ తన కష్టాలు ముగిసే వరకు విశ్వాసంలో స్థిరంగా నిలబడి దేవుణ్ణి ఆరాధించాడు. (యోబు 1:20-22)
దేవుని వాగ్దానాలు ఖచ్చితమైనవి మరియు అవి వెనకడుగు వేయలేవు, కానీ మనం మన విశ్వాసాన్ని కోల్పోతే లేదా నిరుత్సాహపడినట్లయితే అవి మన జీవితంలో నెరవేరకుండా పోతాయి. ఈ రోజు నిరుత్సాహపడటానికి నిరాకరించండి. మీరు దుష్టుడు చెప్పిన విధంగా మీరు మీ జీవితాన్ని ముగియరు. వాని అబద్ధాలను నమ్మడానికి నిరాకరించండి మరియు వాక్యం మీద ధ్యానం పెట్టండి. వానిని మరియు వాని కార్యాలను ఎదిరించుడి. సందేహాలకు తావు ఇవ్వొదండి. (యాకోబు 4:7)
ప్రభువైన యేసు తన శిష్యులను వారి అవిశ్వాసానికి ఎల్లప్పుడూ సున్నితంగా మందలించాడు. అవిశ్వాసం అనే పాపంలా ఏదీ దేవునికి కోపం తెప్పించదు. దేవుడు అనుమానించడాన్ని అసహ్యించుకుంటాడు. మనుష్యులందరూ ఆయన యందు అనుదిన జీవనం మరియు సరఫరా కోసం ఆయనను విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నాడు.
విశ్వాసంలో స్థిరంగా నిలబడాలంటే, దేవుని వాగ్దానాలను ఆయన వాక్యంలో నిరంతరం గుర్తుచేసుకోవాలి. వాక్యం ద్వారా మీ విశ్వాసాన్ని పెంచుకోండి మరియు విషయాలు కొత్త మలుపు తీసుకుంటాయని గమనించండి. దేవుని వాక్యం మీ హృదయంలో ఆనందంతో స్వీకరించబడినప్పుడు మీ విశ్వాసం బలపడుతుంది. దేవుని విషయాలు మరియు ఆయన వాక్యం కోసం ఆకలిని కలిగి ఉండండి. మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ ఆర్థిక విషయాల గురించి, మీ పిల్లలు, మీ వ్యాపారం మరియు మీ పరిస్థితి గురించి ఏమి చెప్పబడిందో ఆ వాక్యంలో తెలుసుకొని, దానిని నమ్మండి. దేవుని వాక్యం కంటే ఎక్కువ హామీలు ఇచ్చే భద్రత స్విచ్ లేదా లైఫ్ జాకెట్ లేదు. ఆయన వాక్యం అవునన్నట్టుగానే మరియు ఆమెన్ యున్నవి. (2 కొరింథీయులకు 1:20)
దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలకై వేచి ఉండడాన్ని ఎంచుకోండి, ఆయన చేసిన దానికి ఆయనను స్తుతించండి. మీ పరిస్థితుల ద్వారా మీ ఆరాధన ప్రభావితం కాదని నిర్ధారించుకోండి మరియు మీ జీవితంలో దేవుని కార్యమును చూడండి. మీరు విశ్వాసంలో దృఢంగా నిలబడి, శక్తిగల వ్యక్తిగా మారడం నేను చూస్తున్నాను.

ప్రార్థన
తండ్రీ, నా విశ్వాసాన్ని ఎల్లప్పుడూ పెంచే నీ వాక్యముకై నేను నీకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాగ్దానాలన్నిటిపై ఆధారపడటానికి మరియు రాజీపడకుండా ఉండటానికి నేను నీ కృపకై వేడుకుంటున్నాను. ఓ దేవా, స్థిరంగా నిలబడటానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో.
Join our WhatsApp Channel
Most Read
● ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క నిశ్శబ్ద నిరోధకము● సర్వశక్తిమంతుడైన దేవునితో కలుసుకోవడం
● జీవితపు హెచ్చరికలను పాటించడం
● నిరాశ పై ఎలా విజయం పొందాలి
● సహనాన్ని లేదా ఓర్పును హత్తుకోవడం
● ప్రభావం యొక్క గొప్ప పరుధులకు మార్గం
● పరిశుద్ధత యొక్క ద్వంద్వ కోణాలు
కమెంట్లు