english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఒక గంట మరియు దానిమ్మ
అనుదిన మన్నా

ఒక గంట మరియు దానిమ్మ

Tuesday, 25th of June 2024
0 0 1032
Categories : ఆత్మ ఫలం ( fruit of the spirit)
మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను, అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టు ఉంచిరి. (నిర్గమకాండము 39:26)

పై వచనం యాజకుడు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తున్నప్పుడు ధరించే వస్త్రాన్ని (చొక్కాయి) వివరిస్తుంది. యాజకుడు వస్త్రంలో గంట మరియు దానిమ్మ, గంట మరియు దానిమ్మ పండు అంచు మీద ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. దీనికి లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.

మోషే ప్రవక్త కనాను దేశాన్ని చూడటానికి మనుషులను పంపినప్పుడు, వారు ఇవ్వవలసిన నివేదికలలో ఒకటి భూమి యొక్క ఫలాలకు సంబంధించినది.

వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. (సంఖ్యాకాండము 13:23-24)

అది సారవంతమైనది లేదా బంజరు అయినా సరే, ఒక భూమి దాని ఫలం ద్వారా తెలుస్తుంది; అదేవిధంగా, ఒక వ్యక్తి తన జీవితంలో మరియు అతని ద్వారా ఫలించే ఫలాల ద్వారా తెలియజేయబడుతాడు.

ప్రభువైన యేసయ్య అదే అంశాన్ని చెప్పాడు:
మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు. (మత్తయి 7:18-20)

ఇప్పుడు, యేసు ప్రభువు చెట్లు మరియు ఫలాల గురించి మాత్రమే మాట్లాడలేదు, ఆయన ప్రజలను మరియు వారి స్వభావాన్ని గురించి సూచిస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రధాన యాజకుడు అంచున ఉన్న దానిమ్మ పండు ఆత్మ ఫలానికి ప్రతీకగా ఉందని మీరు గమనించగలరు.

ఒక క్రైస్తవునిగా, మనం ఆయన సాక్షులుగా ఉన్నప్పుడు, ఆత్మ ఫలాన్ని ప్రదర్శించేందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఫలాల గురించి మాట్లాడితే సరిపోదు.

"అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము" (గలతీయులకు 5:22-23). ఇవి లేకుండా నిజమైన సాక్ష్యం ఉండదు; సేవ అనేది ఉండదు.

రెండవదిగా, ప్రధాన యాజకుని వస్త్రం యొక్క అంచు మీద ఉన్న గంట పరిశుద్దాత్మ వరములకు ప్రతీక.

మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. (1 కొరింథీయులకు 13:1)

1 కొరింథీయులకు 12లో పరిశుద్ధాత్మ వరముల గురించి మాట్లాడిన వెంటనే, అపొస్తలుడైన పౌలు ప్రేమ యొక్క పునాది మీద పరిశుద్దాత్మ వరముల కార్యం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. 

యాజకుడు దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్నాడని మరియు చనిపోలేదని బయట వేచి ఉన్న ప్రజలకు గంట మోగడం గురించి సూచిస్తుంది.

ఇక్కడ అతి ముఖ్యమైన సత్యం ఏమిటంటే మనం ఒకదానిని ఎంచుకోలేము కానీ మరొకటి కాదు. మనం ఒకదానిని ఫలించి మరొక దానిని నిర్లక్ష్యం చేయలేము. అది మన జీవితంలో గంట, దానిమ్మ, గంట, దానిమ్మ ఒక భాగమై ఉండాలి.

మన జీవితం, మన పరిచర్య, మనం ఏమి చేసినా వరములు మరియు ఫలాల సంపూర్ణ సమతుల్యత ఉండాలి; మరియు రెండూ ప్రభువును సన్నుతించడానికి మరియు ఆయన ప్రజలను దీవించడానికి ఉన్నాయి. ఇది ఎల్లప్పుడూ అలా ఉండును గాక.
ప్రార్థన
తండ్రీ, నా జీవితం పరిశుద్ధాత్మ యొక్క ఫలం మరియు వరముల యొక్క పరిపూర్ణ సాదృశ్యంగా ఉండును గాక. నా జీవితం ద్వారా సమస్త మహిమ మరియు ఘనత పొందుము. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ఆరాధన యొక్క నాలుగు ముఖ్యమైన అంశాలు
● మీ విధిని మార్చండి
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
● భయపడకుము
● భాషలలో మాట్లాడుట మరియు ఆధ్యాత్మికంగా విశ్రాంతి పొందడం
● ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I
● అభిషేకం యొక్క నంబర్ 1 శత్రువు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్