ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. (యోహాను 1:17)
ఒక సర్వే ప్రకారం, నేటి ప్రపంచంలో, మతాల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలా మంది దేవుణ్ణి యెద్దకు చేరుకొవడానికి రోడ్ మ్యాప్ కోసం నిరంతరం పరిశోధిస్తున్నారు మరియు ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
మనిషిలో దేవుని వెతకాలని మరియు ఉన్నతమైన వ్యక్తిని సూచించాలనే లోతైన, సహజమైన కోరిక ఉంది. అందుకే అన్వేషకులు లోతైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు; వారు కొన్ని రకాల పూజా వస్తువులను కనుగొంటారు. నేడు ప్రతి మతం కూడా తెలియని దేవునికి తన మార్గాన్ని వివరిస్తుంది, నియమాలు మరియు ఆజ్ఞలను తెలియజేస్తుంది. వారు ప్రతి ఆజ్ఞలను పాటించటానికి ఎంతగా కృషి చేస్తారో, వారు అంతగా ఎప్పటికీ తెలియని దేవుని సంతోష పరచేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు.
పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులు దేవుని మార్గములను అర్థం చేసుకోలేదు. వారికి ఆయన క్రియలు మరియు ఆజ్ఞలు మాత్రమే తెలుసు, నిరంతరం పరిపూర్ణంగా మరియు చాలా పరిశుద్ధంగా జీవించడానికి ప్రమాణంగా కనిపించే ఈ దైవిక మార్గమును అర్థం చేసుకోగలిగే ప్రదేశానికి ఎప్పటికీ రారు. (కీర్తనలు 103:7)
పాత నిబంధన ప్రత్యక్ష గుడారపు నిర్మాణం మనిషి పరిశుద్ధ జీవితాన్ని జీవించడం అసంభవం, ఎప్పటికీ అసంపూర్ణమైనది మరియు నియమాలను పాటించడంలో సరిపోనిది. వారిని దేవునికి దగ్గరగా తీసుకురావాల్సిన ఏకైక మార్గం, వారిని ఆయన నుండి మరింత దూరం చేసి ఆయనను చేరనీయకుండా చేసింది. నియమాలు ప్రజలకు వారి లోపాలను మరియు దేవుని ప్రమాణాలకు ఎప్పటికీ కొలవలేని అసమర్థతను చూపుతూనే ఉన్నాయి. బైబిలు ధర్మశాస్త్రాన్ని బాలశిక్ష అని పిలుస్తుంది. (గలతీయులకు 3:25)
ప్రభువైన యేసు రాకడ దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్పును తెచ్చింది. యేసయ్య తనతో విశ్వాసం మరియు కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం అనేది దేవునితో అనుసంధానించడానికి ఒక సాధనం మరియు ఆ పరికరాన్ని ఉపయోగించుకోవడానికి కృప అనేది ఒక వేదిక. విశ్వాసం దేవుని వ్యక్తిత్వాన్ని గురించి అవగాహనను తీసుకొచ్చింది, ఇది చాలా ఖాళీ స్థలాలను వదిలిపెట్టిన నియమం వలె కాకుండా, దేవుని బోధలను జీవితం మరియు సమాధానం లేకుండా చేస్తుంది. గలతీయులకు 3.23 ఇలా చెబుతోంది, "విశ్వాసము వెల్లడికాక మునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి."
ప్రభువైన యేసయ్య సయోధ్య మరియు సమర్థన కోసం ఒక వేదికను అందిస్తున్నాడు, ఇక్కడ మనం ఇప్పుడు మధ్యస్థ వ్యక్తి లేకుండా ధైర్యంగా దేవుని యెద్దకు చేరుకొవచ్చు. ఇది యేసయ్య ద్వారా మాత్రమే ప్రతి మానవుడు రక్షించబడాలని మరియు పరిపూర్ణతలొకి రావాలని తెలియాజేస్తుంది.
కాబట్టి అప్పుడు, విశ్వాసం ద్వారా, మనము ఆయన శక్తిని పొందుకుంటాము మరియు కృప ద్వారా మనం ఆయన వ్యక్తిత్వం, ఆయన మార్గాల గురించి మరింత తెలుసుకుంటాము.
ప్రార్థన
ప్రభువైన యేసయ్య, నీవు మానవాళిని కొరకు తీసుకువచ్చిన కృపకై వందనాలు. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● లోకమునకు ఉప్పు● ఇతరులకు ప్రకవంతమైన దారి చూపుట
● వుని కొరకు మరియు దేవునితో
● ప్రభువులో మిమ్మల్ని మీరు ఎలా ప్రోత్సహించుకోవాలి (ధైర్యపరుచుకోవాలి)
● ప్రభువును ఎలా ఘనపరచాలి
● ఆధ్యాత్మిక గర్వము యొక్క ఉచ్చు
● మీ మానసిక స్థితిని మెరుగుపరుచుట
కమెంట్లు