english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ ఆశీర్వాదాన్ని అభివృద్ధిపరిచే ఖచ్చితంగా మార్గం
అనుదిన మన్నా

మీ ఆశీర్వాదాన్ని అభివృద్ధిపరిచే ఖచ్చితంగా మార్గం

Sunday, 16th of June 2024
0 0 961
Categories : సాక్ష్యం (Testimony)
వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. (ప్రకటన 12:11)

యెహోవా మీ పట్ల చేసిన కార్యం గురించి మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలతో చెప్పినప్పుడు, మీరు మీ సాక్ష్యాన్ని వారితో పంచుకుంటున్నారు.

కొంతమంది క్రైస్తవులు పాపభరితమైన మరియు భయంకరమైన జీవనశైలి నుండి విముక్తి పొందినట్లు నాటకీయ సాక్ష్యాలను కలిగి ఉంటారు. ఇతరలు చాలా నాటకీయమైన సాక్ష్యాలు ఉండకపోవచ్చు-అయితే, అవి దేవుని దృష్టిలో అంతే ముఖ్యమైనవి.

లేఖనంలో, అపొస్తలుడైన పౌలు తన కాలపు మత నాయకులతో యేసయ్య గురించి చెప్పడానికి తన సాక్ష్యాన్ని ఉపయోగించేవాడు. అతని మాటలు కనీసం మూడు సార్లు అపోస్తలుల పుస్తకంలో సువార్త ప్రచారం కోసం ఒక సాధనంగా చెప్పబడింది.

ఆ సమరయ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరివారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. (యోహాను 4:28-30)

ఆమె సాక్ష్యం కారణంగానే చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వైపు ఆకర్షితులయ్యారు. ఇది మన సాక్ష్యము ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేస్తుంది.

వారి ప్రార్థనలకు అద్భుతమైన సమాధానాలు, దీవెనలు, అభివృద్ధి పొందిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పటికీ సాక్ష్యమివ్వలేదు. అలాంటి వారు తమను మొదట దీవించిన వ్యక్తికి మహిమ తీసుకురావడంలో విఫలమవుతారు. క్రైస్తవులుగా, దేవుడు మన జీవితంలో చేసిన దాని గురించి మాట్లాడటానికి మనం ఎప్పుడూ భయపడకూడదు లేదా సిగ్గుపడకూడదు.

యేసు ప్రభువు బయలుదేరడానికి పడవ ఎక్కబోతుండగా, దయ్యాల నుండి విడిపించబడిన వ్యక్తి యేసయ్యను ఇలా అడిగాడు, "నేను మీతో వెళ్లవచ్చా?" ఇక్కడ యేసయ్య ఇలా సమాధానమిచ్చాడు:

ఆయన వానికి సెలవియ్యక, "నీవు నీ యింటివారి యొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి." (మార్కు 5:19-20)

ఆ వ్యక్తి ప్రభువుకు విధేయత చూపినప్పుడు, అతడు పది నగరాలకు దీవెనకరంగా మారాడు - ఒక్కసారి గమనించండి. మీరు మీ సాక్ష్యాల ద్వారా ప్రభువును మహిమపరచినప్పుడు, ఆయన మీకు మరిన్ని సాక్ష్యాలను దయచేస్తాడు.
ప్రార్థన
తండ్రీ, నా జీవితంలో నీ సమస్త దీవెనలకు నేను నీకు కృతజ్ఞతస్తులు తెలుపుతున్నాను. నా చుట్టూ ఉన్న వారందరికీ నీ క్షేమము గురించి నేను తప్పకుండా సాక్ష్యమిస్తాను. దీన్ని చేయడానికి నాకు నీ కృపను దయచేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ఒక ఇవ్వగల (అవును గల) హామీ
● ఆయన ద్వారా ఏ పరిమితులు లేవు
● దేవుని సన్నిధి గురించి సుపరిచితంగా ఉండడం
● వాక్యంలో జ్ఞానం
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #1
● దేవుని ప్రతిబింబం
● మీరు ఇంకా ఎందుకు వేచి ఉన్నారు?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్