english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. అద్భుతాలలో పని చేయుట: కీ#1
అనుదిన మన్నా

అద్భుతాలలో పని చేయుట: కీ#1

Wednesday, 19th of June 2024
0 0 928
Categories : అద్భుతాలలో పని చేయుట (Operating in the Miraculous) అధికారం (Authority)
జీవితంలో సాధించాల్సిన ప్రతి లక్ష్యం తయారీ, ప్రణాళిక మరియు ఆ కలను నెరవేర్చడానికి అవసరాలను తీర్చడంతో ప్రారంభమవుతుంది. అదేవిధంగా, దేవుని శక్తి మీ ద్వారా ప్రవహించాలని లేదా మీ తరపున పనిచేయాలని మీరు కోరుకుంటే, ఈ విషయంలో ఆయన వాక్యానికి ఏమిచెప్పాలో మీరు నేర్చుకోవాలి.

ఒక అద్భుతం కోసం సిద్ధపడడానికి కొన్ని పద్ధతులు అవసరమని మరియు ఒక అద్భుతాన్ని స్వీకరించడానికి కూడా అవసరమైన పద్ధతులు ఉన్నాయని నేను సంవత్సరాలుగా అర్థం చేసుకున్నాను. 

సూర్యుని క్రింద కొత్తగా ఏమీ లేదు. (ప్రసంగి1:9)

ప్రభువైన యేసు, ఆ అద్భుతమైన అద్భుతాలను చేయటానికి మన పరిపూర్ణ ఉదాహరణ తీసుకోవలసిన పద్ధతులు ఇవి. అపొస్తలులుతీసుకోవలసిన అదే పద్ధతులు ఇవి మరియు అద్భుతాలలో పనిచేయడానికి మరియు ఒక అద్భుత కారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నుండి అద్భుతాలను స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవటానికి మీరు మరియు నేను తీసుకోవలసిన పద్ధతులు ఇవి.

మీ జీవితంలో ఇచ్చిన అద్భుతాన్ని చూడటానికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని అర్థం చేసుకోవడం మరియు ఉపయోగించడం చాలా కీలకం.

అపొస్తలులు, పేతురు మరియు హానును ఒక మధ్యాహ్నం మూడు గంటలకు ప్రార్థనకాలమున పాల్గొనడానికి దేవాలయమునకు వెళ్ళారు. వారు దేవాలయమునకు చేరుకోగానే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను.

దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్దఉంచుచువచ్చిరి. పేతురునుయోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా,
పేతురునుయోహానును వానిని తేరి చూచి "మాతట్టుచూడుమనిరి". వాడు వారియొద్దఏమైనదొరుకుననికనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. అంతట పేతురు "వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైనయేసు క్రీస్తు నామముననడువుమనిచెప్పిను"
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములునుచీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచువారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను. (అపొస్తలుల కార్యములు 3:1-8)

గమనించండి, పేతురు ఈ మనిషి కోసం ప్రార్థించలేదు. శిలువ యొక్క పూర్తయిన ప్రత్యక్షత పనిని వెల్లడిస్తూ పేతురు పనిచేస్తున్నాడు.ప్రభువు అప్పటికే సిలువపై తన వంతు కృషి చేశాడని మరియు ఆ శక్తిని తనలో ఉంచాడని అతను గట్టిగా నమ్మాడు. ఇప్పుడు ఆ శక్తిని విడుదల చేయడం పేతురు యొక్క బాధ్యత, మరియు అతను అదే చేశాడు.

ఒక సన్నగా ఉన్న పోలీసు అధికారి కూడా ఒక భారీ ట్రక్కు ముందు నిలబడి చేయి పైకి లేపి, "ఆపు!" అనిఅన్నాడు మరియు మీకు తెలుసు; ఆ భారీ ట్రక్ ఖచ్చితంగా ఆపబడాలి. పోలీసు తన సొంత శారీరక శక్తితో ఆ ట్రక్కును ఆపారా? లేదు! అతను దానిని - దేశం యొక్క చట్టం సమర్థించే అధికారంతో చేశాడు.

తోటి మానవులకు మనం మానవులకు అప్పగించే ఈ విధమైన అధికారాన్ని సహజ అధికారం అంటారు. ప్రభువు తన శిష్యులకు (మీకు మరియు నాకు) ఇచ్చిన అధికారాన్ని ఆధ్యాత్మిక అధికారం అంటారు. సహజ మరియు ఆధ్యాత్మిక అధికారం రెండింటి సిద్ధాంతం ఒకే విధంగా ఉంటుంది - ఎవరైనా ఆ అధికారాన్ని అప్పగించాలి.

"ఆయన (ప్రభువైన యేసు) తన పండ్రెండు మంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగ ములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను." (లూకా9:1-2)

గమనించండి, ప్రభువైన యేసు తన అధికారాన్ని మరియు శక్తిని శిష్యులకు ఇచ్చాడు. శిష్యుడు ఎవరు? శిష్యుడు తన యజమాని యొక్క అన్ని బోధలను అనుసరించే వ్యక్తి. కాబట్టి, ఈ అధికారాన్ని స్వీకరించడానికి, మీరు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలి.

అందుకే బైబిలు ఈ విధంగా సెలవిస్తుంది, "అపవాదినిఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును." మీరు అపవాదికంటే శారీరకంగా బలంగా ఉన్నందున కాదు, కానీ ఆయన వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనినందునా. (కొలొస్సయులు3:16)

యోహాను8:31 ప్రకారం, "యేసు తనను నమ్మిన ప్రజలతో, "మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నా శిష్యులగుదుర", అని అన్నారు. ఈ అధికారం మరియు శక్తి అసలు పన్నెండు మంది శిష్యులకు మాత్రమే కాదని, ఆయనను విశ్వసించి ఆయన వాక్యంలో నడిచిన వారందరికీ అని ఈ వచనం స్పష్టంగా చెబుతుంది.

ఈ రోజు, ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకోండి, నేను దేవుని వాక్యాన్ని చదువుతాను మరియు ధ్యానం చేయబోతున్నాను. నేను ఏది ఏమైనా దాన్ని ఆచరణలో పెట్టబోతున్నాను. మీరు ఇలా చేసిన్నప్పుడు, మీరు దేవుని అధికారంలో మిమల్ని ఎదుగుతున్నట్లు చూస్తారు.
ప్రార్థన
యేసు నామంలో, నాకు మరియు నా కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి శక్తులను నేను మీకు ఆదేశిస్తున్నాను విడిచి వెళ్లిపో. (మీకు విడుదల అనిపించే వరకు ఇలా చెప్పడం కొనసాగించండి.)

Join our WhatsApp Channel


Most Read
● దేవుని కృపకై ఆకర్షితులు కావడం
● యేసయ్య యొక్క అధికారమును ఒప్పుకోవడం
● ఏడంతల ఆశీర్వాదములు (దీవెనలు)
● మీ లక్ష్యాలను సాధించే శక్తిని పొందుకోండి
● ఆందోళనను అధిగమించుట, ఈ విషయాలపై ఆలోచించుట
● మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
● మాదిరి కరంగా నడిపించబడుట
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్