english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. తేడా స్పష్టంగా ఉంది
అనుదిన మన్నా

తేడా స్పష్టంగా ఉంది

Saturday, 22nd of June 2024
0 0 851
Categories : ప్రేమ (Love)
నీతి మంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. (రోమీయులకు 5:7-8)

ప్రతిఫలంగా ఏదో ఆశించకుండా మానవుడు సహజంగా వేరొకరి గురించి శ్రద్ధ వహించడం చాలా అరుదైన మరియు అసాధ్యమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ప్రతిఫలంగా వాటిని అందించడానికి ఏమీ లేని వ్యక్తికి ప్రజలు "ప్రేమ" వ్యక్తం చేయడం చాలా అరుదు. ధోరణి ఏమిటంటే, ప్రజలు తమకు మంచి చేసేవారికి లేదా వారికి మంచి చేయగలవారికి మంచి చేస్తారు. ఈ ప్రపంచంలో ఇది ఎలా పనిచేస్తుంది. 

కారణం చాలా సులభం - మానవ ప్రేమ షరతులతో కూడుకున్నది. ప్రజలు అందంగా కనిపించేవారిని, గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్నవారిని   లేదా ఏదో ఒకవిధంగా చాలా ఆకర్షణీయంగా ఉన్నవారిని మాత్రమే ఇష్టపడతారు. మానవులు ఈ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు "ఈ వ్యక్తి లేదా ఈ వస్తువు నా ప్రేమకు అర్హమైనది." ఒకవేళ ఆ వస్తువు లేదా వ్యక్తి మారినట్లయితే, వారు ప్రేమించే విధానం కూడా మారుతుంది. కొంతమంది మంచి సంజ్ఞను ఏదో ఒక విధంగా తమకు మంచిగా ఉన్నవారికి మాత్రమే పరస్పరం ఇస్తారు.

ఏదేమైనా, నిజమైన ప్రేమకు నిజమైన నిర్వచనం అయిన దేవుడు మనకు పూర్తిగా భిన్నమైన నమూనాను చూపించాడు. మనం పాపులుగా ఉన్నప్పుడే మనకోసం చనిపోయేలా తన కుమారుని పంపడం ద్వారా దేవుడు తన ప్రేమను మనకు చూపించాడని రోమీయులకు 5:8 లో చూశాము. లోకము వాస్తవానికి దేవునికి అవిధేయతతో ఉంది. దేవునికి అర్పించడానికి లోకము దగ్గర ఏమీ లేదు. లోకము తన ఆజ్ఞలను పాటించడం ప్రారంభించినందున దేవుడు తన కుమారుడిని లోక పాపాల కోసం చనిపోయేలా పంపలేదు.

బైబిల్ యొక్క మెసెజ్ అనువాదం ఆ వాక్యం ఈ విధంగా ఉంది: "కానీ దేవుడు తన కుమారుడిని బలి మరణంలో అర్పించడం ద్వారా తన ప్రేమను మనకోసం ఉంచాడు, అయితే మనం ఆయనకు ఏ విధంగానైనా ఉపయోగ కరంగా  లేము." నిజంగా, ఇది తేడా గల నిజమైన ప్రేమ! ఈ రోజు లోకములో ప్రేమ ఎలా ప్రదర్శించబడుతుందో దానికి మైళ్ళ దూరంలో ఉంది.

స్పష్టంగా, నీవు పాపిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించగలిగితే, ఇప్పుడు నీవు అయన బిడ్డవి ఇంకెంత ప్రేమించగలిగాలి. నీ గురించి నీవు ఏమనుకున్నా, నిన్ను అనర్హులుగా భావించడానికి దుష్టుని అనుమతించవద్దు. భావాలు దేవుని ప్రేమ యొక్క సత్యాన్ని కోల్పోతాయి. దేవుని గొప్ప దాసుడు ఒకసారి ఇలా అన్నాడు, "మన భావాలు వచ్చి వెళ్లినప్పటికీ, దేవుని ప్రేమ అలా చేయదు." పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు.

నీ పట్ల దేవుని అపారమైన ప్రేమ గురించి ఎల్లప్పుడూ తెలుసుకోండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, లోకం ప్రేమించే విధంగా కాదు. నీవు మొదటి అబద్ధం చెప్పే ముందు ఆయన నిన్ను ప్రేమిచాడు. పాపం ఏమిటో నీకు  తెలియక ముందే నీ పాపానికి ఉపశమనం కలిగించే సదుపాయాన్ని ఆయన కల్పించాడు. వావ్! ఆయన అద్భుతమైన తేడాతో ప్రేమిస్తాడు. అవన్ నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించడానికి ఎనుకొన్నాడు. ఆయన గొప్ప ప్రేమను కొనసాగించు మరియు దీనికి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయి.

ఒప్పుకోలు

ప్రభువైన తండ్రి, నా పట్ల నీకున్న గొప్ప ప్రేమకు వందనాలు. నా పట్ల నీకున్న ప్రేమను నేను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. నన్ను బేషరతుగా ప్రేమించిన వ్యక్తిగా నిన్ను విశ్వసించటానికి నాకు సహాయం చేయి. నీ ప్రేమలో ఉండటానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● 17 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● అనుకరించుట (పోలి నడుచుకొనుట)
● చెడు వైఖరి నుండి విడుదల
● ప్రార్థన యొక్క పరిమళము
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
● ప్రజలు సాకులు చెప్పే కారణాలు – భాగం 2
● సమాధానము కొరకు దర్శనం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్