అనుదిన మన్నా
కావలివారు (ద్వారపాలకులు)
Monday, 1st of July 2024
0
0
386
Categories :
కావలివారు (Gatekeepers)
ద్వారము (Gates)
బైబిలు ద్వారాల గురించి చాలా మాట్లాడుతుంది. అవి సహజ రంగంలో కావలివారిగా ఉన్నట్లే, ఆధ్యాత్మిక రంగంలో కూడా కావలివారిగా ఉండమని దేవుడు మనలను పిలిచాడు.
నేను మీకు సహజ రంగంలో కావలివాని గురించి ఉదాహరణ ఇస్తాను. మీరు విమానంలో ప్రయాణించినప్పుడు, మీరు విమానంలో నేరుగా ఎక్కలేరు. వెళ్ళడానికి చాలా ద్వారాలు ఉన్నాయి. వారు మీ ప్రతి పత్రాలను వివిధ ద్వారము వద్ద తనిఖీ చేస్తారు, ఆపై మాత్రమే మీరు విమానం ఎక్కగలరు.
ఈ కావలివారు ప్రజలను తనిఖీ చేస్తారు, తద్వారా విమానంలో ప్రయాణించే వ్యక్తులు సురక్షితమైన విమాన ప్రయాణం కలిగి ఉంటారు. ఈ కావలివారు రక్షణ గోడలా పనిచేస్తారు.
ద్వారపాలకులు ఎవరనగా షల్లూము అక్కూబు టల్మోను అహీమాను అనువారును వారి సహో దరులును. వీరిలో షల్లూము పెద్ద. (1 దినవృత్తాంతములు 9:17)
మీరు గమనించండి, బైబిలు ద్వారపాలకులను ఎంతగానో గుర్తిస్తుంది, వారి పేరు కూడా ప్రస్తావించబడింది. దీన్ని బట్టి ద్వారాలకు కాపలాగా ఉండేందుకు దేవుడు ఎంత ప్రాముఖ్యతనిస్తాడో అర్థం చేసుకోవచ్చు.
ద్వారమును కాపాడటం యొక్క ప్రాముఖ్యతను దావీదు మహారాజుకు తెలుసు. దావీదు, "భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారము నొద్ద (ద్వారపాలకుడిగా) నుండుట నాకిష్టము." (కీర్తనలు 84:10).
మనకు మూడు ద్వారాలు ఉన్నాయి, అవి మన జీవితానికి పొందుపరచబడింది. మనకు కంటి ద్వారము, చెవి ద్వారము మరియు నోటి ద్వారము ఉన్నాయి.
చెవి ద్వారము మరియు కంటి ద్వారము మన జీవితంలోకి రెండు ప్రధాన ద్వార అంశములు మాత్రమే. మనం కళ్లతో చూసేది, చెవులతో వినేది మన హృదయాల్లోకి వెళ్లి చివరికి మన నోటి నుంచి బయటకు వస్తుంది.
మన చెవి ద్వారము మరియు కంటి ద్వారమునకు కావలిగా ఉండమని ప్రభువు మనలను పిలుస్తున్నాడు, అలా చేస్తే, మన హృదయాన్ని కాపాడుకుంటాము, ఆపై మన నోటి ద్వారమును కూడా మనం కాపాడుకోవచ్చు.
అలా చేయడం ద్వారా, మీరు మీ ప్రపంచాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారి ప్రపంచాన్ని మార్చగలరు.

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నేను నీతి భాగములుగా నా కళ్ళు మరియు నా చెవులను నీకు అప్పగిస్తున్నాను. యెహోవా, నా నోటికి కావలి యుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● కృప వెల్లడి అగుట● మన ఎంపికల ప్రభావం
● మన్నా, పలకలు మరియు చేతికఱ్ఱయు
● క్షమించకపోవడం
● దేవుని యొక్క 7 ఆత్మలు: బలము గల ఆత్మ
● రెండవసారి చనిపోవద్దు
● అపరాధ యొక్క ఉచ్చు నుండి విడుదల పొందడం
కమెంట్లు