అనుదిన మన్నా
మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు?
Tuesday, 2nd of July 2024
0
0
197
Categories :
భావోద్వేగాలు (Emotions)
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యాకాండము 23:19)
"మీ మనసు (హృదయం) మాట వినండి", "మంచిది అనిపిస్తే అదే చేయండి" పిల్లల కార్టూన్‌ల నుండి లౌకిక పాటల వరకు సినిమాల వరకు ఇలాంటి సందేశాలను మనం నిరంతరం వింటుంటాము. ఈ రోజు మనం జీవిస్తున్న సమాజం మనల్ని బాగా ప్రోత్సహిస్తుంది మరియు మనం ఎలా భావిస్తున్నామో దాని ఆధారంగా మన ఎంపికలు మరియు జీవిత-నిర్ణయాలను తీసుకోవాలనే వాస్తవాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇవన్నీ మంచివిగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, అలాంటి మనస్తత్వాన్ని అవలంబించడం మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకు వినాశకరమైనది. బైబిలు మనల్ని ఇలా హెచ్చరిస్తోంది, "హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?" (యిర్మీయా 17:9)
మన భావాలు మరియు భావోద్వేగాలు మన జీవితాలను శాసించటానికి అనుమతించినప్పుడు, మనం చాలా తెలివితక్కువ, భక్తిహీనమైన, వ్యక్తిగత-కేంద్రీకృత నిర్ణయాలు తీసుకుంటాము మరియు మన జీవితాలను గందరగోళానికి గురిచేస్తాము. మన హృదయాను సారంగా నడుచుకోవడం ద్వారా లొంగిపోవడానికి బదులుగా స్వార్థపూరిత వైఖరిని మాత్రమే అది పెంపొందిస్తుంది.
మన భావాలు మరియు భావోద్వేగాలచే మనం నియంత్రించబడితే మనం క్రీస్తుకు నిజమైన దాసులు కాలేము. యాకోబు 1:6-8 తన జీవితాన్ని పూర్తిగా భావోద్వేగాలు మరియు భావాలతో నడిపించే వ్యక్తి గురించి స్పష్టంగా వివరిస్తుంది. "అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు."
భావాలు మరియు భావోద్వేగాలచే నడిపించబడిన వ్యక్తి ఎప్పటికీ స్థిరత్వాన్ని సాధించలేడు. అలాంటప్పుడు దానికి పరిష్కారం ఏమిటి?తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును (సామెతలు 28:6). ఈ రోజు నుండి, దేవుని జ్ఞానంలో (అది ఆయన వాక్యాను సారంగా) నడవడానికి ప్రతి ప్రయత్నం చేయండి.
మీ జీవితం దీవించబడుతుంది మరియు అతి త్వరలో, మీరు చాలా మందికి దీవెనకరంగా అవుతారు.

ప్రార్థన
యెహోవా, నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. యేసు నామంలో. (కీర్తనలు 5:8 ఆధారంగా)
Join our WhatsApp Channel
Most Read
● మర్చిపోయిన ఆజ్ఞా● మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
● మనం దేవదూతలకు ప్రార్థించవచ్చా
● వ్యసనాలను ఆపివేయడం
● 39 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 40 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● నేటికి కనుగొనగలిగే అరుదైన విషయం
కమెంట్లు