english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కొండలు మరియు లోయల దేవుడు
అనుదిన మన్నా

కొండలు మరియు లోయల దేవుడు

Wednesday, 3rd of July 2024
0 0 944
Categories : క్రీస్తు దేవత (Deity of Christ)
పాత నిబంధనలో, దేవుని ప్రజల శత్రువులు వారి యుద్ధ వ్యూహంలో తీవ్రమైన తప్పు చేశారు. ఇశ్రాయేలీయులతో యుద్ధంలో ఓడిపోయినప్పుడు, సిరియా రాజు సలహాదారులు ఇలా అన్నారు: "అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరివారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటె బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము" (1 రాజులు 20:23). 

వారు తమ నూతన యుద్ధ ప్రణాళికను ఉపయోగించి ఇశ్రాయేలీయుల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దేవుడు వారి కోసం ఒక ఆశ్చర్యాన్ని స్థిరపరుచాడు: "అప్పుడు దైవజనుడైన యొకడు వచ్చి ఇశ్రా యేలు రాజుతో ఇట్లనెను, "యెహోవా సెలవిచ్చున దేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడేగాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు; అయితే నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను'' (1 రాజులు 20:28).

సిరియనుల దేవుడు "ప్రాదేశిక" దేవుడని, తన ప్రజలను విడిపించ గల సామర్థ్యంలో ఆయన పరిమితం చేయబడాడని భావించారు. తమ దేవుడు కొండల దేవుడని మాత్రమే వారు భావించారు, అయితే ఆయన కొండలు, బయలు మరియు లోయల దేవుడు అని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు!

ఆయన మహిమను ఒక ప్రత్యేక మార్గంలో కురిపించినప్పుడు, పర్వతాలను దేవుడు దర్శించే సమయాల్లో మరియు ప్రత్యక్షత కోసం ఉపయోగించాడు. పర్వతాలు మన జీవితంలోని మంచి సమయాలను సూచిస్తాయి, ఆ సంఘటనలు మరియు అనుభవాలు మనకు శక్తినిస్తాయి మరియు దేవుని ప్రణాళికలో మనలను నడిపిస్తాయి.

కానీ మనం అన్నింటిలో పైఎత్తుగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండడు. ఆయన మైదానాల దేవుడు కూడా. మన జీవితంలోని అలవాటుగా, సాధారణ, అనుదిన అంశాలుగా మనం భావించే వాటి గురించి మైదానాలు మాట్లాడతాయి.
దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు, ఆయన తన మహిమను పూర్తిగా విస్మరించి, మానవునిగా మన లోయలో మన వద్దకు వచ్చాడు. ఆయన మన స్థానంలో మరణించాడు మరియు ఆయన విజయాన్ని మనకు కలుగజేసాడు.

మీరు ఏ సమస్య గుండా వెళుతున్నా, ఆయన కేవలం కొండల దేవుడు మాత్రమే కాదు, ఆయన కొండలు, మైదానాలు మరియు లోయల దేవుడని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన జీవితంలోని ప్రతి కాలము మరియు సమస్త సమయం యందు ఆయన దేవుడు.
ఒప్పుకోలు
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.


Join our WhatsApp Channel


Most Read
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● క్రీస్తు కేంద్రంగా ఉన్న ఇల్లును (గృహం) నిర్మించడం
● ఆయన వెలుగులో బంధాలను పెంపొందించడం
● ఐక్యత మరియు విధేయత దర్శనం
● యేసయ్య ఎందుకు గాడిద మీద ప్రయాణించాడు?
● భూపతులకు అధిపతి
● తెలివిగా పని చేయండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్