english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మంచి ధన నిర్వహణ
అనుదిన మన్నా

మంచి ధన నిర్వహణ

Wednesday, 11th of September 2024
0 0 394
Categories : డబ్బు నిర్వహణ (Money Management)
సంపన్నమైన జీవితాన్ని గడపడానికి నిధుల మంచి నిర్వహణ చాలా అవసరం. శత్రువుకు ఈ సత్యాం బాగా తెలుసు మరియు వారి డబ్బును తప్పుగా నిర్వహించడానికి ప్రజలను మోసం చేయడానికి వీలైనంతవరకు ప్రయత్నిస్తాడు.

ఆదికాండము 41 లో, కలలు మరియు దర్శనాలను వివరించే అద్భుతమైన వరమును కలిగి ఉన్న దేవుని దాసుడు అయిన యోసేపును మనము చూడగలుగుతాము. కాబట్టి ఐగుప్తులోని ఫరో తన కలలు కన్నప్పుడు, అతని అగ్రశ్రేణి ఇంద్రజాలికులు ఎవరూ అర్థం చెప్పలేక పోయారు, ఆ పనిని పూర్తి చేయడానికి యోసేపును పిలిచారు.

సామెతలు 18:16 స్పష్టంగా చెబుతుంది, "ఒక మనుష్యుని ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి యెదుటికి వానిని రప్పించును." యోసేపుకు ఇదే జరిగింది. ఒక రోజులో, అతను ఒక ఖైదీ నుండి చివాట్లు నుండి ఐగుప్తుకు ప్రధాన మంత్రి అయ్యాడు.

యోసేపుకు జ్ఞానం యొక్క అద్భుతమైన వరము ఉంది. ఐగుప్తుపై రాబోయే తీవ్రమైన కరువును నిర్వహించడంలో చాలా ప్రభావవంతంగా నిరూపించే వనరులను నిర్వహించడానికి ఆయనకు అద్భుతమైన జ్ఞానం ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐగుప్తుతో సహా అన్ని దేశాలు ఏడు సంవత్సరాల సమృద్ధిగా మరియు కరువును అనుభవించాయి. ఐగుప్తు మరియు ఇతర దేశాల మధ్య ఉన్న తేడా ఏమిటంటే, ఐగుప్తు కలిగి ఉన్న నిర్వహణ వ్యూహం, ఇతర దేశాలు అలా చేయలేరు. కరువు వచ్చినప్పుడు, ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు సహాయం కోసం ఐగుప్తు తలుపు వద్ద వరుసలో ఉన్నాయి.

మీరు మీ ఆర్ధిక పరిస్థితిని చక్కగా నిర్వహించగలిగితే, మీ జీవితానికి కలిగి ఉన్న దేవుని ఉద్దేశ్యం మరియు ప్రణాళికను మీరు నెరవేర్చగలుగుతారని శత్రువుకు బాగా తెలుసు, అందువల్ల వాడు ఈ విషయంలో మిమ్మల్ని నిరాశపరిచేందుకు పుస్తకంలోని ప్రతి ఉపాయాన్ని ప్రయత్నిస్తాడు.

ఉదాహరణకు: మీ జీతం నెలకు రూ .30,000/- అని అనుకుందాం. మీ మొత్తం నెలవారీ ఖర్చులు సుమారు 27,000/- వరకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీకు మంచి రూ.3000/- ఆదా అవుతుంది.

ఒక రోజు మీరు ఈ మాల్ గుండా వెళుతున్నారు, మరియు మీరు ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ను చూసారు. మీరు ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ను కలిగి ఉండాలని శత్రువు మిమ్మల్ని ఒప్పించడం ప్రారంభిస్తాడు (మీకు ఇప్పటికే మంచి ఫోన్ ఉందని వాస్తవాని పట్టించుకోకండి). మీ ఆఫిస్ లో, మీరు మాత్రమే తాజా స్మార్ట్ఫోన్ను కలిగి లేరనే వాస్తవాన్ని కూడా వాడు మీకు చూపిస్తాడు.

మీ క్రెడిట్ కార్డును స్వైప్ చేయడం ద్వారా త్వరలో మీరు వాని ఉచ్చులో పడ్డారు. కొన్ని రోజుల తరువాత, వాస్తవం మీ ముఖంలో కనబడుతుంది మరియు మీరు ఏమి తప్పు చేశారో మీరు గ్రహిస్తారు. మీరు మీ శాంతిని కోల్పోతారు. ఇప్పుడు మీరు అప్పుల గొయ్యిలో ఉన్నారు. ఇప్పుడు ఈ రుణాన్ని తీర్చడానికి, మీరు రుణాలు తీసుకోవడం, అబద్ధం ఆడడం మరియు తారుమారు చేయడం ప్రారంభిస్తారు. మీరు ఇప్పుడు దుర్మార్గపు చక్రంలో చిక్కుకున్నారు.

దేవునికి ఇవ్వడానికి కూడా మీ దగ్గర ఏమీ మిగలలేదు.

మనం అనుకరించాల్సిన ఒక సిద్ధాంతం ఉంది. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. (సామెతలు 21:20)

సరళంగా చెప్పాలంటే, " జ్ఞానవంతుల ఇంట్లో సమృద్ధిగా మిగిలిపోతుంది ఎందుకంటే వారు సంపాదించిందంతా ఖర్చు చేయరు. మరోవైపు, చాలా మంది తమకు లభించేదంతా (మరియు ఇంకా ఎక్కువ) ఖర్చు చేస్తారు"

సరళమైన సిద్ధాంతం ఏమిటంటే, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఒకరి ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయాలి. దురదృష్టవశాత్తు, ఎంత డబ్బు వచ్చినా, కొంత మంది ఎప్పుడూ అప్పుల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వారు తమ ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేసే ఈ సిద్ధాంతాన్ని ఉల్లంఘిస్తున్నారు. బుద్ధిమంతునిగా ఉండండి మరియు దేవుని వాక్యం యొక్క సలహాను గమనించండి.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, మంచి వనరులను నిర్వహించడానికి జ్ఞానం మరియు వివేచన నాకు దయచేయమని అడుగుతున్నాను. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● కాపలాదారుడు
● సర్పములను ఆపడం
● మీకు సలహాదారుడు (మార్గదర్శకుడు) ఎందుకు అవసరము
● ప్రభువా, కలవరము నుండి నన్ను విడిపించు
● దొరికిన గొఱ్ఱెపిల్ల యొక్క ఆనందం
● 33 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● అరణ్య మృగం గల మనస్తత్వంపై విజయం పొందడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్