అనుదిన మన్నా
ప్రార్థించకపోవడం యొక్క పాపం
Saturday, 17th of August 2024
0
0
191
Categories :
ప్రార్థన (Prayer)
ఎవరైనా మీ ఆప్త మిత్రుడు అని చెప్పుకుంటున్నారు కానీ మీతో ఎప్పుడూ మాట్లాడకపోవడం మీరు ఉహించగలరా? ఇప్పటికే ఉన్న స్నేహం ఏదేమైనా ఖచ్చితంగా దెబ్బతింటుంది.
అదేవిధంగా, దేవునితో సంబంధం సంభాషణ లేకుండా చాలా దరిద్రంగా ఉంటుంది.
ప్రార్థించకపోవడం అనేది పాపం. దీని గురించి మనం నిజాయితీగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు వారి కోసం ప్రార్థిస్తానని వాగ్దానం చేసినప్పుడు సమూయేలు ప్రవక్త ఈ విషయాన్ని స్పష్టం చేశాడు:
నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును (1 సమూయేలు 12:23)
దేవుని ప్రజల కోసం ప్రార్థించడంలో వైఫల్యం దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమని సమూయేలు గుర్తించాడు. మీరు పాస్టర్, గ్రూప్ సూపర్‌వైజర్, ఒక J-12 నాయకుడు అయితే, నేను మీకు ముందస్తుగా చెప్తాను, దేవుడు మీకు ఇచ్చిన ప్రజల కోసం ప్రార్థించడంలో వైఫల్యం మీరు చేయదగినిది పాపం.
నాయకులు దేవుని ప్రజల కోసం ప్రార్థన చేయనప్పుడు, మనం నడిపించే ప్రజల కోసం మనము నిజంగా తీసుకువెళ్ళని ఆత్మ పరిధిలో ఒక సంకేతాన్ని పంపుతున్నాము. ప్రభువైన యేసు అలాంటి వారిని "గొర్రెల కాపరి లేని గొర్రెలవలె" చూశాడు (మత్తయి 9:36) పరిసయ్యులు దేవుని ప్రజల గురించి నిజంగా బాధపడటానికి తమ సొంత విషయాలతో చాలా బిజీగా ఉన్నారు.
ప్రార్థన చేయడంలో విఫలమవడం ప్రభువు పట్ల ప్రేమ లేకపోవటానికి సూచిన. ప్రాపంచికత నెమ్మదిగా గుర్తించబడని లోపలికి ప్రవేశించిందని ప్రార్థించకపోవడం అనేది సూచిస్తుంది.
స్వస్థత, విడుదల మరియు ప్రవచనాత్మక సమావేశాలు అత్యధిక జనాన్ని ఆకర్షిస్తాయని నేను తరచుగా చూశాను, ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వస్థత, విడుదల, ప్రవచనం మొదలైనవాటిని ఆశిస్తున్నారు (దానిలో తప్పు ఏమీ లేదు). ఏదేమైనా, మధ్యస్థానికి హాజరు కమని ప్రజలను అడగండి మరియు వారు ఏదో కోల్పోతారని సాధారణ భావన.
నేను మీకొక విషయం చెప్పనా? మన జీవితంలో ప్రార్థించకపోవడం అనేది ప్రబలంగా ఉన్నప్పుడు, ఒకరినొకరు ప్రేమించడంలో విఫలమైనందుకు మనం కూడా దోషిగా ఉన్నాము మరియు ఇది ఒకరికొకరు ప్రార్థన పూర్వకంగా లేకపోవటంలో ఎక్కువగా ప్రదర్శించబడుతుంది.
ప్రభువైన యేసు మత్తయి 26:41 లో మనకు హెచ్చరించాడు: "మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి." ప్రార్థించకపోవడం అనేది శోధనలో బాణాలు మనలను కొట్టడానికి అనుమతిస్తుంది, ఇది పాపం యొక్క బురదలో మనల్ని లోతుగా మరియు లోతుగా నడిపిస్తుంది
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నేను ప్రార్థన చేయడంలో విఫలమైన సమయాలకు నన్ను క్షమించు.
తండ్రీ, యేసు నామంలో, నా జీవితంలో ప్రార్థించకపోవడంకు ప్రతి అవరోధం మరియు అడ్డంకి నిర్మూలించబడును గాక.
తండ్రీ, యేసు నామములో, నా జీవితంలో ప్రార్థించకపోవడంకు అనే ఆత్మను నీ అగ్ని ద్వారా దగ్ధం అవును గాక.
తండ్రీ, యేసు నామములో, యేసు రక్తం ద్వారా నా ప్రార్థన జీవితానికి ఆటంకం కలిగించే విధంగా తెరిచిన ప్రతి అపవాది తలుపును మూసివేస్తున్నాను.
Join our WhatsApp Channel
Most Read
● మీరు యుద్ధంలో ఉన్నప్పుడు: పరిజ్ఞానము● మీ గురువు (బోధకుడు) ఎవరు - I
● మానవుని ప్రశంసల కంటే దేవుని ప్రతిఫలాన్ని కోరడం
● మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు?
● 10 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● దేవుని హెచ్చరికలను విస్మరించవద్దు
● 21 రోజుల ఉపవాసం: 9# వ రోజు
కమెంట్లు