english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కాపలాదారుడు
అనుదిన మన్నా

కాపలాదారుడు

Sunday, 6th of October 2024
0 0 477
Categories : ప్రవచనాత్మకమైన వాక్యం (Prophetic Word )
"మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారము లందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు, ఒకరి నొకరు చూచిపోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పు కొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు." (యెహెజ్కేలు 33:30-32)

దేవుడు యెహెజ్కేలును ఇశ్రాయేలు దేశానికి కాపలాదారుడిగా నియమించాడు. అతనిని రాబోయే తీర్పు గురించి ప్రజలకు హెచ్చరించరించుటకు మరియు ప్రజలను దేవుని వైపుకు మళ్లించుటకు నియమించబడ్డాడు. దేవుడు కోరుకున్నది యెహెజ్కేలు నమ్మకంగా చేస్తున్నప్పటికీ, చాలా మంది ఆయనను మరొక వ్యక్తిగా చూశారు. వారు ఆయన సందేశాన్ని విన్నారు మరియు వినిన తరువాత ఏమీ చేయలేదు. బదులుగా, వారు అయన ప్రవచనాత్మక సందేశాలను వినోదంగా భావించారు.

ఇప్పుడు ప్రతి వారం, ఆన్‌లైన్ సంఘ ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలలో చాలా మంది పాస్టర్లు మరియు నాయకులు ప్రభువు వాక్యాన్ని నమ్మకంగా మరియు శుద్ధముగా బోధిస్తున్నారు.

చాలా మంది బోధించిన లేదా చెప్పబడిన దేవుని వాక్యాన్ని వింటారు మరియు ఇది గొప్ప వాక్యమని అంగీకరిస్తారు. కొందరైతే 'ఆమేన్' అని కూడా అంటారు మరియు పాస్టర్ గారు చెప్పేటప్పుడు ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలను టైప్ చేసి ఉత్సాహపరుస్తారు. చాలా మంది తమ స్నేహితులు మరియు బంధువులను తమ పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని వినమని కూడా ఆహ్వానిస్తారు; తరువాత, సందేశం చాలా బాగుందని అంటారు. అయితే, వారు సందేశంతో ఏమీ చేయరు. ఇది వారికి వినోదం యొక్క మరొక రూపం వలె ఉంటుంది.

"..... వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు." (యెహెజ్కేలు 33:32)

మనలో చాల మంది అనుదినం లేఖనాలను చదివేవారికి ఇది ఒక ప్రవచనాత్మకమైన హెచ్చరిక. ఈ వాక్యం మనం ఏమి చేయాలో మనము చదువేటప్పుడు చెబుతుంది, కాని మనకు తెలిసినదాన్ని మనం స్థిరంగా చేయకపోతే, అది కేవలం వ్యర్థమైనది.

కొంతకాలం క్రితం నేను, రాత్రిపూట విపరీతమైన పొగమంచు కారణంగా బైకర్ (మోటారు సైకిలు నడిపేవాడ), రహదారిపై చమురు చిందటం చూడలేకపోయాడు మరియు దానిమీద ఎలా వెళ్లాను అనే వార్తాపత్రిక నివేదికను చదివాను. అతడి బైక్ కాంక్రీట్ కంచెను ఢీకొట్టింది. అతడు బైక్ నుండి జారీపడ్డాడు, కానీ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా రక్షించబడ్డాడు. అతడు వెంటనే లేచి, ముందుకు పరిగెత్తి, చేతులు ఊపుతూ, చమురు చిందటం గురించి ఇతర బైకర్లను హెచ్చరించాడు.

చాలా మంది అతనిని చూశారు మరియు విన్నారు మరియు రక్షించబడ్డారు, కాని కొందరు అతడు మరొక పిచ్చివాడని భావించి, తన చేతులను పిచ్చిగా ఊపుతూ వారి పతనానికి కారణమైయ్యాడని భావించారు. ఆధ్యాత్మికంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. మనము చూస్తాము మరియు వింటాము, కాని మనము పట్టించుకోము.

దేవుని హృదయం ప్రతి మానవుడు తనతో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు మరియు అందువల్ల మనల్ని హెచ్చరించడానికి మరియు మమ్మల్ని సరిదిద్దడానికి ఆయన ప్రజలను లేవనెత్తుతాడు. మనం వాటిని ఎప్పుడూ తేలికగా తీసుకోకుండును గాక.
ప్రార్థన
1. తండ్రీ, యేసు నామములో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. నీ వాక్యమును ఎల్లప్పుడూ ఆచరణలో పెట్టడానికి నాకు సహాయం చెయ్యి.

2. తండ్రీ, యేసు నామములో, నా జీవితంలో పిలుపుని నెరవేర్చడంలో నాకు సహాయపడటానికి నీవు నా జీవితంలో ఉంచిన మార్గదర్శకులకు వందనాలు. వారిని ఎప్పటికీ తేలికగా తీసుకోకుండా ఉండటానికి నాకు సహాయం చెయ్యి.

3. తండ్రీ, యేసు నామములో, ఈ రోజు నుండి మరియు రాబోయే రోజులలో నేను కలుసుకున్న వారందరికీ నీ సత్యాన్ని ప్రేమతో చెప్పడానికి నాకు నీ కృపను దయచేయి. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● దైవ క్రమము -1
● సరైన వాటి మీద దృష్టి పెట్టుట
● ఆధ్యాత్మిక గర్వము మీద విజయం పొందే 4 మార్గాలు
● ప్రార్థన యొక్క పరిమళము
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
● విశ్వాసంలో దృఢంగా నిలబడడం
● లెక్కించుట ప్రారంభం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్