అనుదిన మన్నా
మీ బాధలో దేవునికి లోబడియుండుట గురించి నేర్చుకోవడం
Wednesday, 4th of September 2024
0
0
185
Categories :
లోబడుట (Surrender)
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము,అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. (సామెతలు 3:6)
పై లేఖనం మనం ఆత్మతో పరిపూర్ణ అమరికలోకి ఎలా రాగలమొ చాలా స్పష్టంగా చెబుతుంది. సులభమైన సత్యం ఏమిటంటే దీన్ని చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది; మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనూట.
దేవునికి లోబడియుండుట గురించి ఒకరు మాట్లాడినప్పుడు, మన జీవితంలోని ఆధ్యాత్మిక పరిధిలో మాత్రమే దానితో సంబంధం కలిగి ఉంటాము. మన అనుదిన ప్రార్థనలు, ఆరాధన, బైబిల్ పఠనం, ఉపవాసం మొదలైన వాటి ద్వారా దేవునికి లోబడియుంటాము. అయితే కుటుంబం, వివాహం, కార్యాలయం మరియు సాధారణ జీవితం వంటి మన జీవితంలోని ఇతర రంగాల గురించి ఏమిటి?
నేను ఇక్కడ మీతో నిజాయితీగా ఉండాలి. నా ప్రాధాన్యతలు మరియు అనుదిన దినచర్యల విషయానికి వస్తే దేవునికి పూర్తిగా సమర్పించడానికి నేను వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డాను. ఇది అంత ఆహ్లాదకరమైన అనుభవం కాదు మరియు చాలా సార్లు చాలా బాధాకరమైనది. అలాంటి సమయాల్లో, నా బలహీనతలు మరియు వైఫల్యాలతో నేను ముఖాముఖికి కలుసుకున్నాను. పరీక్ష (శోధన) సమయంలో మీ ఇష్టాన్ని దేవునికి లోబడియుండుట తరచుగా పరీక్ష కంటే చాలా కష్టం.
మన పడిపోయిన స్వభావం యొక్క 'మనస్సు' గురించి బైబిల్ చెబుతుంది:
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. (రోమీయులకు 8:7 NKJV)
శరీరం చేత పరిపాలించబడే మనస్సు దేవునికి విరోధమైయున్నది; ఇది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడి ఉండదు, ఏమాత్రమును లోబడనేరదు. (రోమీయులకు 8:7 NIV)
ఇందుకోసం మన మనస్సును క్రీస్తుకు విధేయులుగా ఉండుట ఎంచుకోవాలి. మనము ఆత్మతో సమకాలీకరించాలంటే మనం ఆత్మలో ఉండటానికి ఎంచుకోవాలి.
దేవుడు ఆత్మ పరిధిలో నాకు చాలా అద్భుతమైన అనుభవాలను ఇచ్చాడు మరియు దాని కోసం నేను ఆయనకు కృతజ్ఞతస్తుతులు తెలుపుతున్నాను. ఏదేమైనా, నేను జీవితంలో బిజీగా చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయని మరియు ఆర్భాటము మధ్య దేవుని స్వరాన్ని విస్మరించిన సందర్భాలు ఉన్నాయని నేను స్పష్టంగా అంగీకరించాలి. చాలా సార్లు, ఆయన నన్ను చేయమని చెప్పినప్పుడల్ల నాకు అనిపిస్తు ఉంటుంది, నేను నిజంగా చేయటానికి చాలా కష్టపడ్డాను. నా పరీక్షా క్షణాలు చాలా వరకు అల జరిగాయి.
వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కన బడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. (హెబ్రీయులకు 12:10-11)
మీ బాధ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మీరు కనుగొన్నప్పుడు, దేవునికి లోబడియుండుట అనేది చాలా సులభం అవుతుంది. విక్టర్ ఎమిల్ ఫ్రాంక్ల్ ఒకసారి ఇలా అన్నాడు, "కాంతిని ఇవ్వడం అంటే దహనాన్ని భరించాలి"
నేను వెనక్కి తిరిగి చూస్తే, నేను ఆయన నిశ్చలమైన, చిన్నదైన, సున్నితమైన స్వరాన్ని విన్నట్లయితే మాత్రమే ఎంత బాధ మరియు వేదనను నివారించవచ్చో నాకు తెలుసుకోగలుగుతున్నాను.
చాలా మంది మనస్సులలో తరచుగా పెరిగే ప్రశ్న ఏమిటంటే, "దేవుడు నా జీవితంలో చిన్న విషయాల గురించి పట్టించుకుంటాడా?" సహజమైన సమాధానం "అవును". దేవుడు మన జీవితంలోని అతిచిన్న వివరాల గురించి చింతిస్తాడు ఎందుకంటే ఆయన మన తలపై ఉన్న వెంట్రుకలను లెక్కించి యున్నాడు (లూకా 12:7). మరొక కోణం నుండి, జనులు"త్రాసుమీది ధూళిలా" ఉంటే, దేవునికి అసాధ్యమైనది ఏది? (యెషయా 40:15 చూడండి.)
దేవుడు మన జీవితంలోని ప్రతి రంగం గురించి గొప్ప విషయాలు మరియు చిన్న విషయాల గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాడు. గంటలు, రోజులు, వారాల ఉత్పాదకత లేని ప్రయత్నాలను మనం ఆదా చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు, కాని ఇది జరగాలంటే మనం ఆయనతో నడవడం నేర్చుకోవాలి.
ఒప్పుకోలు
తండ్రీ, యేసు నామములో మరియు నీ చిత్తానికి విధేయత చూపిస్తూ, నాలో నివసించడానికి మీరు పంపిన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు నేను లోబడియుంటాను. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● 10 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన● సహనాన్ని లేదా ఓర్పును హత్తుకోవడం
● యుద్ధం కోసం శిక్షణ - II
● దైవ క్రమము - 2
● 16 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ ఆశీర్వాదాన్ని అభివృద్ధిపరిచే ఖచ్చితంగా మార్గం
● కోపాన్ని (క్రోధాన్ని) అర్థం చేసుకోవడం
కమెంట్లు