english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
అనుదిన మన్నా

ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు

Thursday, 29th of August 2024
1 1 561
Categories : ఆరోగ్యం మరియు స్వస్థత (Health & Healing) ఒత్తిడి (Stress)
శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విరిగి నలిగిన సంబంధాలు మరియు అనుదిన ఎలుక పందెం లాంటి ఆధునిక సమాజమే జీవితం అని అంటారు. నేటి ఆధునిక సమాజంలో ఒత్తిడి అనేది నంబర్ 1 సంహారము - కాని ఇది అజేయమైనది కానిది. వాస్తవానికి, దేవుడు తన జ్ఞానం చోప్పున ఎలా జయించాలో, తన జీవితాన్ని ఇచ్చే వాక్యంలో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చాడు.

"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా?, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి." (మత్తయి 11::28-30)

ఆయన సన్నిదిలోకి ప్రవేశించండి


మీరు క్రమం తప్పకుండా అలసిపోయి, భారం మోస్తూనట్లు అనిపిస్తుంటే, మీరు ఎక్కువ సమయం కేటాయించి, ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. అలా చేసేవారికి ప్రభువు తన విశ్రాంతి మరియు ఓదార్పునిస్తాడని వాగ్దానం చేశాడు. కొన్ని మృదువైన ఆరాధన పాటలు వినండి, ఆ ఫోన్‌ను ఆపివేసి, ఆయన శాంతి మరియు తాజదనమైన సన్నిధిని ఆస్వాదించండి. లేఖనంలోని కొంత భాగాన్ని నెమ్మదిగా చదవండి మరియు మీతో మాట్లాడటానికి అనుమతించండి. ఇది ఆత్మకు మరియు శరీరానికి అద్భుతాలను చేస్తుంది.

సరైన దృష్టిని పెట్టండి


మీ చుట్టూ ఉన్నవారు చేస్తున్న ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నించవద్దు. మరో మాటలో చెప్పాలంటే, మీరు ప్రతిదానిలో పాల్గొనలేరు; మీరు ప్రతిదానిలో వేళ్లు పెట్టలేరు. మీరు మీ సమయాన్ని మరియు శక్తిని మీరు నిజంగా మంచి విషయాలపై మాత్రమే కేంద్రీకరించాలి. గుర్తుంచుకోండి, కేవలం కార్యాచరణ ఫలప్రదం కాదు. కాబట్టి మీరు కొన్ని ఫలించని విషయాల నుండి మిమ్మల్ని మీరు వేరుచేయవలసి ఉంటుంది. ఇది ప్రారంభంలో బాధాకరంగా ఉండవచ్చు, కానీ ఇది మీ ప్రాణాన్ని కాపాడుతుంది. ముఖ్యమైన కార్యం చేయాలి అది ఏంటంటే దేవునితో సమయాన్ని గడపడం మరియు మీ అనుదినాని బాగా నిర్వహించడానికి జ్ఞానం మీకు ఇవ్వమని ఆయనను కోరడం.

విశ్రాంతి

నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. (కీర్తనలు 116:7).

విశ్రాంతి తీసుకోవడం మంచి ఆలోచన మాత్రమే కాదు, అది దేవుని ఆలోచన - ఇది దేవుని ఆజ్ఞా:

"ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను. నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను". (నిర్గమకాండము 23:12)

ప్రభువు ఇంకా ఇలా సెలవిస్తున్నాడు "ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను" (నిర్గమకాండము 34:21)

మంచి రాత్రి విశ్రాంతి మీ జీవితం నుండి ఒత్తిడిని తొలగించడానికి అద్భుతాలు చేస్తుంది. అవసరమైన విశ్రాంతి పొందడం ద్వారా మీ వారాన్ని ప్రారంభించండి మరియు మీకు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మంచి ఫలవంతమైన వారంగా ఉంటుంది.
ప్రార్థన
1. తండ్రీ, దయచేసి నన్ను క్షమించు, ఎందుకంటే నేను ప్రతిదాన్ని నా స్వంత బలంతో చేయటానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి నీ ఆత్మ ద్వారా నన్ను శక్తివంతం చేయి.

2. తండ్రీ, యేసు నామములో, ఈ క్షణం నుండి, నా జీవితంలో నీ మార్గము ఉండును గాక. దయచేసి నీ మహిమ కోరకై నా జీవితాన్ని సరిచేయి. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● ప్రాణముకై దేవుని ఔషధం
● కోపం (క్రోధం) యొక్క సమస్య
● పరధ్యానం యొక్క గాలుల మధ్య స్థిరంగా (ఉండుట)
● ప్రేమ యొక్క నిజమైన స్వభావం
● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 3
● ప్రభువును విచారించుట (మొర్రపెట్టుట)
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 5
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్