అనుదిన మన్నా
ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
Thursday, 29th of August 2024
1
1
286
Categories :
ఆరోగ్యం మరియు స్వస్థత (Health & Healing)
ఒత్తిడి (Stress)
శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విరిగి నలిగిన సంబంధాలు మరియు అనుదిన ఎలుక పందెం లాంటి ఆధునిక సమాజమే జీవితం అని అంటారు. నేటి ఆధునిక సమాజంలో ఒత్తిడి అనేది నంబర్ 1 సంహారము - కాని ఇది అజేయమైనది కానిది. వాస్తవానికి, దేవుడు తన జ్ఞానం చోప్పున ఎలా జయించాలో, తన జీవితాన్ని ఇచ్చే వాక్యంలో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చాడు.
"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా?, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి." (మత్తయి 11::28-30)
ఆయన సన్నిదిలోకి ప్రవేశించండి
మీరు క్రమం తప్పకుండా అలసిపోయి, భారం మోస్తూనట్లు అనిపిస్తుంటే, మీరు ఎక్కువ సమయం కేటాయించి, ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. అలా చేసేవారికి ప్రభువు తన విశ్రాంతి మరియు ఓదార్పునిస్తాడని వాగ్దానం చేశాడు. కొన్ని మృదువైన ఆరాధన పాటలు వినండి, ఆ ఫోన్‌ను ఆపివేసి, ఆయన శాంతి మరియు తాజదనమైన సన్నిధిని ఆస్వాదించండి. లేఖనంలోని కొంత భాగాన్ని నెమ్మదిగా చదవండి మరియు మీతో మాట్లాడటానికి అనుమతించండి. ఇది ఆత్మకు మరియు శరీరానికి అద్భుతాలను చేస్తుంది.
సరైన దృష్టిని పెట్టండి
మీ చుట్టూ ఉన్నవారు చేస్తున్న ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నించవద్దు. మరో మాటలో చెప్పాలంటే, మీరు ప్రతిదానిలో పాల్గొనలేరు; మీరు ప్రతిదానిలో వేళ్లు పెట్టలేరు. మీరు మీ సమయాన్ని మరియు శక్తిని మీరు నిజంగా మంచి విషయాలపై మాత్రమే కేంద్రీకరించాలి. గుర్తుంచుకోండి, కేవలం కార్యాచరణ ఫలప్రదం కాదు. కాబట్టి మీరు కొన్ని ఫలించని విషయాల నుండి మిమ్మల్ని మీరు వేరుచేయవలసి ఉంటుంది. ఇది ప్రారంభంలో బాధాకరంగా ఉండవచ్చు, కానీ ఇది మీ ప్రాణాన్ని కాపాడుతుంది. ముఖ్యమైన కార్యం చేయాలి అది ఏంటంటే దేవునితో సమయాన్ని గడపడం మరియు మీ అనుదినాని బాగా నిర్వహించడానికి జ్ఞానం మీకు ఇవ్వమని ఆయనను కోరడం.
విశ్రాంతి
నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. (కీర్తనలు 116:7).
విశ్రాంతి తీసుకోవడం మంచి ఆలోచన మాత్రమే కాదు, అది దేవుని ఆలోచన - ఇది దేవుని ఆజ్ఞా:
"ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను. నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను". (నిర్గమకాండము 23:12)
ప్రభువు ఇంకా ఇలా సెలవిస్తున్నాడు "ఆరు దినములు నీవు పనిచేసి యేడవ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను" (నిర్గమకాండము 34:21)
మంచి రాత్రి విశ్రాంతి మీ జీవితం నుండి ఒత్తిడిని తొలగించడానికి అద్భుతాలు చేస్తుంది. అవసరమైన విశ్రాంతి పొందడం ద్వారా మీ వారాన్ని ప్రారంభించండి మరియు మీకు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మంచి ఫలవంతమైన వారంగా ఉంటుంది.

ప్రార్థన
1. తండ్రీ, దయచేసి నన్ను క్షమించు, ఎందుకంటే నేను ప్రతిదాన్ని నా స్వంత బలంతో చేయటానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి నీ ఆత్మ ద్వారా నన్ను శక్తివంతం చేయి.
2. తండ్రీ, యేసు నామములో, ఈ క్షణం నుండి, నా జీవితంలో నీ మార్గము ఉండును గాక. దయచేసి నీ మహిమ కోరకై నా జీవితాన్ని సరిచేయి. ఆమెన్.

Join our WhatsApp Channel
Most Read
● దేవుని ప్రతిబింబం● దేవుని యొక్క 7 ఆత్మలు: బలము గల ఆత్మ
● మీరు అసూయను ఎలా నిర్వహిస్తారు
● ఇవ్వగలిగే కృప – 1
● నమ్మే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి
● పులియని హృదయం
● శపించబడిన వస్తువును తీసివేయుడి
కమెంట్లు