అనుదిన మన్నా
0
0
102
సాధారణ పాత్రల ద్వారా గొప్ప కార్యము
Tuesday, 15th of July 2025
Categories :
విధేయత (Obedience)
న్యాయాధిపతుల పుస్తకమంతా, మనం సమయాన్ని చూస్తాము, మరియు దేవుడు తనకు విధేయత చూపే బలహీనులు మరియు అప్రధాన వ్యక్తుల ద్వారా అత్యంత శక్తివంతమైన నిరంకుశులను క్రిందకు దించేయడం మనం చూస్తాము. కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు ఎడమ చేతి ఎగ్లోను, గిద్యోను మరియు యాయేలు, గుడారమునకు పారిపోయిన గృహిణి.
న్యాయాధిపతుల పుస్తకం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయనకి మన సామర్థ్యం అవసరం లేదు; ఆయనకి మన అందుబాటులో ఉండడం అవసరం.
సామర్థ్యం మరియు అందుబాటుల మధ్య చాలా తేడా ఉంది. ఎవరైనా ఏదైనా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, కానీ తన ప్రతిభను మరియు వరములను ఒక నిర్దిష్ట అవకాశంతో పని చేయడానికి అందుబాటులో ఉండలేరు.
ఏదో చేయమని దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మరియు మీరు ఆ పనికి పూర్తిగా సరిపోరని భావించి ఉండవచ్చు మరియు మీరు ఇలా అని ఉండవచ్చు:
• "నాకు తగినంత అర్హత లేదు..."
• "నేను సమర్థుడిని కాదు..."
• "నాకు సరైన శిక్షణ లేదు..."
• "నేను అందంగా కనిపించను మరియు చురుకైన వాని కాదు..."
• "ప్రజల ముందు నేను తగినంత నమ్మకంగా ఉండలేను..."
• "నేను బాగా మాట్లాడలేను..."
బైబిల్ ఏమి చెబుతుందో దయచేసి గమనించండి:
సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.(1 కొరింథీయులు 1:26-28)
దేవుడు అప్పుడు చేసాడు, మరియు నేడు ఆయన చేస్తాడు - మీ ద్వారా.
మనం సంపాదించగలిగే దానికన్నా మన విధేయత ద్వారా మనం ఎక్కువ నష్టపోతామని విశ్వసించినప్పుడు విధేయత నిజమైన పోరాటం అవుతుంది.
ఏదేమైనా, మనం ప్రభువుతో ఏకీభవించాలంటే, విధేయత చాలా అవసరం - కేవలం శోధన సమయంలోనే కాదు, ప్రతి సమయంలోను. (ఆమోసు 3:2) అవిధేయత దేవుని పట్ల ఒక సందేశాన్ని ప్రసారం చేస్తుంది, ఆయన కంటే మనకు బాగా తెలుసు అని ప్రకటింస్తుంది.
ప్రియమైన దేవుని సంతానమా, దేవుడు మీ సామర్థ్యడు. ఆయన మీ పట్ల తగినంతగా యోగ్యతా కలిగి ఉంటాడు. ముందుకు సాగండి, ఆయనకు లోబడుడి. మీరు ఎన్నటికీ చింతించబడరు.
Bible Reading: Proverbs 7-11
ఒప్పుకోలు
నా జీవిత ధ్యేయం నా దగ్గర ఉన్నదంతతో దేవునికి సేవ చేయడం, కాబట్టి ఈ రోజు నుండి, నేను ప్రభువుకు అందుబాటులో ఉంటాను. వాక్యం సెలవిచ్చిన ప్రకారం నేను ఏమై యున్నానో నేనే అదే విధంగా ఉన్నాను మరియు ఆయన వాక్యం సెలవిచ్చిన ప్రకారం నా జీవితంలో అది వాస్తవికం అవుతుంది. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel

Most Read
● మీ జీవితాన్ని మార్చుకోవడానికి బలిపీఠానికి ప్రాధాన్యత ఇవ్వండి● తండ్రి హృదయం బయలుపరచబడింది
● 15 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● యూదా జీవితం నుండి పాఠాలు - 2
● వివేచన v/s తీర్పు
● విజయానికి పరీక్ష
● ప్రవక్త ఎలీషా జీవితం- ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క నాలుగు ప్రదేశాలు - III
కమెంట్లు