english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. హామీ గల సంతృప్తి
అనుదిన మన్నా

హామీ గల సంతృప్తి

Saturday, 31st of August 2024
0 0 239
Categories : తృప్తి (Contentment) శిష్యత్వం (Discipleship) సంతృప్తి (Satisfaction)
అందుకు యేసు, "ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను."

ఆ స్త్రీ ఆయనను చూచి, "అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా, యేసు "నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను." 

ఆ స్త్రీ, "నాకు పెనిమిటి లేడనగా", యేసు, "ఆమెతొ నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను." (యోహాను 4:13-18)

మీడియా వాక్చాతుర్యంగా మనపై అరుస్తూ, మన దృష్టిపై పోటీ పడుతూ, ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్, ఈ మంచి కారు, ఈ వయసును తగ్గించే సౌందర్య శ్రేణి మొదలైనవి ఉంటేనే మనం సంతోషంగా, సంతృప్తిగా ఉండగలమని చెబుతుంది. విషయం యొక్క వాస్తవికత ఏమీటంటే విషయాలు ఒక వ్యక్తిని ఎప్పుడూ సంతృప్తిపరచలేవు. ఎవరో ఒకసారి ఇలా అన్నారు, "ఎవరికైతే తక్కువైనది సరిపోదో, వారికి ఏమీ సరిపోదు."

పై లేఖనంలో, ఐదుగురు భర్తలున్న మరియు ఇప్పుడు మరో పురుషుడితో నివసిస్తున్న ఒక స్త్రీ గురించి బైబిలు చెబుతుంది. స్పష్టంగా, ఈ స్తు సంతృప్తి చెందని కోరికతో నడపబడింది. ఆమె సంతృప్తి మరియు ఆనందం కోసం అన్వేషణ ఆమెను పురుషుడి నుండి పురుషుడి వరకు తీసుకువెళ్ళింది మరియు ఇప్పటికీ, ఆమె సంతృప్తి చెందలేదు.

ఆమెకు అవసరమైనది నూతనమైన భర్త (లేదా మరొక వ్యక్తి) కాదు, క్రొత్త జీవితం అని ప్రభువైన యేసు ప్రవచనాత్మకంగా ఆమెకు ఎత్తి చూపాడు మరియు ఆ క్రొత్త జీవితానికి ఆయనే మూలం.

ఈ స్త్రీ మాదిరిగానే, మనలో చాలా మంది అనుభవం నుండి అనుభవానికి మరియు ఇది మనకు ఎంతో కావలసిన సంతృప్తిని ఇస్తుందని ఆశతో తదుపరి దశకు వెళతారు. తదుపరి సంబంధం, తదుపరి ఉద్యోగం, తదుపరి ఇల్లు, తాజా స్మార్ట్‌ఫోన్ మాకు ఎంతో ఆశించిన సంతృప్తిని మరియు ఆనందాన్ని ఇస్తాయని మనము తీవ్రంగా ఆశిస్తుంటాము.

నిజమైన సంతృప్తి అనేది విషయాలలో లేదా ప్రజలలో కాదు, కానీ దేవునితో ఎప్పటికీ అంతం కాని సంబంధం. దేవుడు సంపదను ఖండించడు. మనం సంమృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు, కాని సంపద యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే, అది మనలను ఆయన నుండి శక్తివంతంగా దూరం చేయగలదని ఆయన మనకు తెలియజేయా లనుకుంటున్నాడు. డబ్బుపై ప్రేమ సంతృప్తిని ఇవ్వదు, కాని ప్రభువును ప్రేమించడం వల్ల మానవ పరంగా వర్ణించలేని సంతృప్తి లభిస్తుంది.

చాలా సార్లు మన అసంతృప్తి మనకు ఎక్కువ కావాలి కాని వేరొకరి కంటే ఎక్కువ కావాలి అనే వాస్తవం నుండి తలెత్తదు. ఈ పోటీ స్ఫూర్తి మన అసంతృప్తికి మూలంగా ఉంటుంది. దీనిని జయించడానికి, మనం నిరంతరం ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పే వైఖరిని పెంపొందించుకోవాలి.

సరికొత్త మరియు ఉత్తమమైన పందెం ఖచ్చితంగా మనలను అణచివేయగలదు మరియు నిరుత్సాహపరుస్తుంది. మనకు అవసరమైనది మనకు తెలుసు అని మనం తరచుగా అనుకుంటాం కాని దేవునికి ఉత్తమమైనది తెలుసు. దేవుడు మాత్రమే తప్ప మరేది మనలను సంతృప్తిపరచలేదని గ్రహించే వరకు, మనం నిరంతరం భయం మరియు అసంతృప్తి భావాలతో బాధపడుతుంటాము.

ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు. (కీర్తనలు 107:8-9)

మీరు ప్రతిరోజూ చేయవలసినది ఇక్కడ ఉన్నాయి. కొన్ని మృదువైన ఆరాధన పాటలను వినండి మరియు ప్రతి రోజూ ప్రభువుతో నాణ్యమైన సమయాన్ని గడపండి. మీ కోరికలను పవిత్రం చేయమని ఆయనను వెడుకో. మీ ప్రాణము ఆయన శాంతి మరియు సన్నిధితో సంతృప్తి చెందుతుంది. దేవుని వాక్యాన్ని మీకు వీలైనంత తరచుగా చదవడానికి ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించండి.

మీరు ప్రభువుతో మీ సంబంధాన్ని లోతుగా పెంచుకున్నప్పుడు, మీకు హామి గల సంతృప్తి ఖచ్చితంగా లభిస్తుంది.
ప్రార్థన
పరలోకపు తండ్రీ, నేను నీ చేత సంతృప్తి చెంద లనుకుంటున్నాను కేవలం నీ చేత. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. పొంగిపొర్లుతున్నతో నన్ను నింపు. ప్రభువా, నీవు నా గొర్రెల కాపరి. నాకు ఏ కోదువై ఉండదు. పరలోకపు చల్లదనముతో మరియు భూమి యొక్క ఐశ్వర్యముతో నీవు నన్ను సంతృప్తిపరుస్తావు. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● కృపలో అభివృద్ధి చెందడం
● విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ
● యేసు శిశువుగా ఎందుకు వచ్చాడు?
● మానవ తప్పుల మధ్య దేవుని మార్పులేని స్వభావం
● ఐక్యత మరియు విధేయత దర్శనం
● 21 రోజుల ఉపవాసం: 16# వ రోజు
● శ్రేష్ఠత్వమును ఎలా కొనసాగించాలి?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్