english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. నాన్న కుమార్తె - అక్సా
అనుదిన మన్నా

నాన్న కుమార్తె - అక్సా

Friday, 27th of September 2024
0 0 418
Categories : తల్లిదండ్రులు (Parents) ప్రార్థన (Prayer) విశ్వాసం (Faith)
కాలేబుకి ర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెద నని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. (న్యాయాధిపతులు 1:12-13)

కాలేబ్‌కు ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికి, దేవుని వాగ్దానాలపై ఆయనకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అంతేకాక, అతడు బలమైన స్వభావము కలిగి ఉన్న మంచి వ్యక్తి. అతనికి అక్సా అనే కుమార్తె ఉంది, అతడు ఒత్నీయేలు అనే వ్యక్తిని ఇచ్చి వివాహం చేశాడు.

పిల్లల విశ్వాసంపై చాలా ముఖ్యమైన ప్రభావం తల్లిదండ్రులు. మరియు ఇందులో ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంటుంది.

నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, నా తల్లి నన్ను సంఘానికి తీసుకెళ్లిది. ఆమెకు పెద్దగా చదువు లేకపోయినప్పటికీ, భోజన సమయంలో, ఆమె బైబిల్ నుండి కథలను నా చిన్న సోదరుడు మరియు నాతో నిరంతరం పంచుకునేది. సహజంగానే, ఇది చిన్న పిల్లవాడిగా నన్ను బాగా ప్రభావితం చేసింది.

నా యుక్తవయసులో, నేను తిరుగుబాటు చేసి ఘనమైన సంగీతం మరియు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి లోకం వైపు మళ్ళాను. కానీ, అప్పుడు కూడా, నేను దేవుని వైపు మళ్లాలని అని ఆమె నిరంతరం ప్రార్థించడం మరియు నా కోసం ఉపవాసం ఉండటం నేను చూశాను. చాలా సార్లు, నా భద్రత కోసం ఆమె ఇంకా ప్రార్థిస్తున్నట్లు తెలుసుకోవడానికి నేను అర్థరాత్రి వచ్చేవాని. ఇది నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది, తరువాత అది నన్ను ప్రభువు వైపుకు మార్చింది.

ఒక తల్లిదండ్రుల లేదా తాత ముత్తాత విశ్వాసం కూడా కుటుంబంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని అపొస్తలుడైన పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. పౌలు తిమోతికి ఇలా జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, "ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను." (2 తిమోతి 1:5)

ఇది తిమోతి జీవితంలో పునాది వేసింది, ఇది ఆదిమ సంఘంలో సువార్త యొక్క శక్తివంతమైన సేవకునిగా మరియు గొప్ప అపొస్తలులలో ఒకరైన అపొస్తలుడైన పౌలుతో పాటు నమ్మకమైన సహచరుడు మరియు సహోద్యోగిగా ఎదగడానికి కారణమైంది.

ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావలెనని యడిగెను, :అందుకామె దీవెన దయ చేయుము" అని అనెను. (న్యాయాధిపతులు 1:14-15)

కొత్త వధువుగా, అక్సా తన జీవితం మరియు వివాహంపై తన ఆధ్యాత్మిక దీవెన కోరడానికి తిరిగి తన తండ్రి వద్దకు వచ్చింది. తన జీవితంలో దేవుని దీవెన అవసరమని ఆమెకు తెలుసు. ఆమె మొదట తన తండ్రిని దీవించుమని కోరింది, కాని అతడు మౌనంగా ఉన్నందున, ఆమె ధైర్యంగా తన తండ్రిని దీవించుమని కోరింది.

కుమార్తెగా, ఆమె తన తండ్రితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉందని ఇది నాకు తెలియజేస్తుంది. ఆమె తండ్రితో ఉన్న ఈ సన్నిహిత సంబంధమే, తన తండ్రిని దీవించుమని అడిగే విశ్వాసాన్ని ఇచ్చింది. ఆమె తన తండ్రిని అడిగితే, అతడు ఆమెను తిరస్కరించలేడని ఆమెకు నమ్మకం ఉండేది.

ప్రార్థనకు సంబంధించి ఇది అద్భుతమైన పాఠం.

ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించును (1 యోహాను 5:14-15)

ప్రార్థనలో ధైర్యము ప్రభువుతో అనుదిన సంబంధం నుండి వస్తుంది. ధైర్యము మన అడగడంలో మనల్ని దృఢపరుస్తుంది. ప్రభువుతో ఉన్న సంబంధం ఆయనను అసంతృప్తిపరిచే దేనినీ మనం ఎప్పటికీ అడగమని నిర్ధారిస్తుంది. సమాధానమిచ్చే ప్రార్థనకు ఇదే రహస్యం. అక్సా యొక్క వివాహం మరియు ఇల్లు దీవించబడ్డాయి మరియు మనము కూడా ఈ సూత్రాలను ఆచరణలో పెట్టినప్పుడు మీకు మరియు నాకు కూడా ఇలానే జరుగుతుంది.
ప్రార్థన
తండ్రీ, యేసు నామములో, నీ ఆత్మ మరియు వాక్యము ద్వారా నన్ను అపరిమితమైన విజయానికి, కృపకు నడిపించు. తండ్రీ, యేసు నామములో, నా జీవితానికి మరియు నా కుటుంబానికి వ్యతిరేకంగా ప్రతి రకమైన సాతాను ఆటంకము పరిశుద్దాత్మ అనే గాలి ద్వారా చెల్లాచెదురు అవును గాక.

Join our WhatsApp Channel


Most Read
● మార్పు యొక్క వెల
● నిందలు మోపడం
● కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యొక్క శక్తి
● ఆయన తరచుదనానికి అనుసంధానం (ట్యూనింగ్) అవ్వడం
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 1
● క్షమించటానికి క్రియాత్మక పద్ధతులు
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్